Wednesday, January 26, 2022
తమిళంలో 'తాయ్' అంటే తల్లి. 'అత్తు' అంటే ఖండించడం. తాయత్తు అన్న మాటకు అర్థం తల్లి (నుండి) ఖండించినది అని. ఏమిటది? బొడ్డుతాడు (ఉంబిలికల్ కార్డ్).ప్రాచీనకాలంలో బిడ్డ పుట్టగానే మంత్రసాని బొడ్డుతాడునుండి సేకరించిన రక్తాన్ని కొన్ని పసరులతో కలిపి ఒక గొట్టంలో పోసి మూతపెట్టి ఉంచేది.బారసాల అయినాక ఆ గొట్టాన్ని ఒక తాటికి కట్టి...
మన శరీరంలో మూలాధార చక్రానికీ, స్వాధిష్టాన చక్రానికీ, మధ్యలో ‘బ్రహ్మ గ్రంధి’ ఉంటుంది. ఇది ప్రత్యుత్పత్తి కి సంబంధించిన రసాయనాలను ఉత్పత్తి చేస్తుంది.పురోహితుని రూపంలో ఉన్న సాక్షాత్తూ బ్రహ్మ దేవుడు వేసే ముడులే, బ్రహ్మ ముడులనీ, బ్రహ్మ గ్రంధులను కలపడానికి వేసే ముడులు కాబట్టి బ్రహ్మ ముడులు అని పెద్దలు చెబుతారు. వధూవరులు ఇద్దరినీ రెండు...
ఉత్తర దిశలో ఉండే పడక గదికి ఉదయం సూర్యకిరణాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. ఈ గదిలో తలను తూర్పు లేదా దక్షిణ దిశవైపు పెట్టి పడుకోవాలి. చక్కటి నిద్ర పడుతుంది.కుటుంబ పెద్ద పడుకునే గది నైరుతి దిక్కులో ఉండాలి. ఒకవేళ ఇల్లు మొదటి, రెండో అంతస్తులో ఉంటే కుటుంబ పెద్దకు పడక గది పై...
మన ధర్మంలో ముగ్గుకున్న ప్రాధాన్యత ఏమిటి? ఏ ముగ్గును ఎక్కడ,ఎప్పుడు వేయాలి? ఇంటి / గడప/ గేటు ముందు ముగ్గులో భాగంగా గీసే రెండు అడ్డగీతలు ఇంటిలోనికి దుష్టశక్తులను రాకుండా నిరోధిస్తాయి. ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటకు వెళ్ళకుండా చూస్తాయి. ముగ్గువేసి దానికి నాలుగువైపులా రెండేసి అడ్డగీతలు గీస్తే అక్కడ శుభాకార్యాలు, మంగళకరమైన పనులు జరుగుతున్నాయని గుర్తు....
ఒకామె వీసా అప్లికేషన్ కోసం వెళ్ళినప్పుడు అక్కడి అధికారి అప్లికేషన్ ఫారం పూర్తి చేస్తూ "మీరేం పని చేస్తూ ఉంటారు" అని అడిగాడు ."తల్లిని" అన్నది అధికారి కొంచెం అయోమయంగా, "ఇక్కడ ‘తల్లి’ అన్న ఆప్షన్ లేదు మేడమ్. మీ వృత్తి ఏమిటి?" అని అడిగాడు. "పిల్లల అభివృద్ది అనే అంశo పై నేను రీసెర్చ్ స్కాలర్ని"...
చూస్తూండగానే అయిపోయింది కార్తీకం.‌మార్గశీర్షం తెరమీదకు వస్తోంది.‌ అభిషేకాలు అయ్యాయి. తిరుప్పావై మొదలవుతుంది.చలి ముదిరే సమయంలో ప్రత్యూషానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి పాశుర పఠనాలు ఈ మార్గళి లోనే మొదలవుతాయి. మనం పాశురాలు చదివేది డిసెంబరు 16నుంచి. ఇంకా చెప్పాలంటే మార్గశిర బహుళ పంచమి నుంచి. అంటే పాశురాలు చదివేది మార్గశిర మాసం ప్రారంభం అయిన...
విత్తనం తినాలని చీమలు చూస్తాయ్.. మొలకలు తినాలని పక్షులు చూస్తాయ్.. మొక్కని తినాలని పశువులు చూస్తాయ్ అన్ని తప్పించుకుని ఆ విత్తనం వృక్షమైనపుడు.. చీమలు, పక్షులు, పశువులు ఆ చెట్టుకిందకే నీడ కోసం వస్తాయ్ జీవితం కూడా అంతే TIME వచ్చే వరకు వేచివుండాల్సిందే దానికి కావాల్సింది ఓపిక మాత్రమే..... లైఫ్ లో వదిలి వెళ్ళిన వాళ్ళ గురించి ఆలోచించకు.. జీవితంలో ఉన్న వాళ్ళు శాశ్వతం అని భావించకు.. ఎవరో వచ్చి నీ బాధను అర్థం చేసుకుంటారని ఊహించకు... నీకు నీవే...
1. సోమ వారం తలకు నూనె రాయరాదు. 2. ఒంటి కాలిపై నిలబడ రాదు. 3. మంగళ వారం పుట్టినింటి నుండి కూతురు అత్తారింటికి వెళ్లరాదు. 4. శుక్రవారం నాడు కోడలిని పుట్టినింటికి పంప రాదు. 5. గుమ్మడి కాయ ముక్కలనే ఇంటికి తేవాలి. 6. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు 7. మధ్యాహ్నం తులసి ఆకులు కోయరాదు. 8. సూర్యాస్తమయం తరువాత కసవువూడ్చరాదు,...
దేవుడి గుడికి వచ్చిన తరువాత కాస్సేపు కూర్చుని వెళ్లాలని అంటారు. దాదాపు అందరూ పాటిస్తారు. కొందరు సమయం లేకుంటే, ఇలా కూర్చున్నట్లే కూర్చుని లేచి చక్కాపోతారు. దీని గురించి స్పష్టంగా చెబితేనన్నా కూర్చుంటారేమో? గుళ్లన్నీ చాలా వరకు కొండపై వుంటాయి. కాకుంటే కాసిన్ని అయినా మెట్లుంటాయి. పైగా లోపలకు వచ్చాక గుడిచుట్టూ మూడో, అంతకు పైగానో...
హిందూ వివాహ చట్టం 1955లో వచ్చినప్పటికీ, ఈ చట్టం అమల్లోకి రాకముందు, వచ్చిన తరువాత జరిగిన వివాహములు రద్దు చేసుకుని విడాకులు కావాలని భార్య/భర్త కోర్టును కోరవచ్చును. కింద చెప్పబడిన కారణాల్లో ఏదో ఒక కారణం చేత విడాకులు కోరవచ్చును. కారణాలు 1. వివాహం తరువాత ఇతర స్త్రీలతో భర్త, ఇతర పురుషులతో భార్య వివాహేతరసంబంధాలు పెట్టుకున్నపుడు. 2....

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com