
పోస్టల్ సేవలను డిజిటలైజ్ చేయాలి
రాజ్యసభలో ప్రభుత్వానికి విజయసాయిరెడ్డి సూచన న్యూఢిల్లీ, డిసెంబర్ 4: సాంప్రదాయ పద్దతుల్లో సాగుతున్న పోస్టల్ సర్వీసులను డిజటలైజ్ చేయడం ద్వారా ప్రజలకు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తృత రీతిలో సేవలు అందించవచ్చని వైఎస్సార్సిపి సభ్యులు వి.విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. మనీ ఆర్డర్లకు బదులుగా మొబైల్ పేమేంట్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. చిన్న మొత్తాల పొదుపు కార్యకలాపాలను పేమేంట్స్ బ్యాంక్‌కు బదలాయించాలని కోరారు. పోస్ట్ ఆఫీసు బిల్లుపై సోమవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ దేశంలోని…