సింగర్ మంగ్లీకి తప్పిన ప్రమాదం‌

-శంషాబాద్ వద్ద మంగ్లీ కారును డీకొట్టిన డిసియం వ్యాన్ -చేగురు కహ్నా శాంతివనంకు వెళ్ళి తిరిగి వస్తున్న సింగర్ మంగ్లీ గాయని మంగ్లీకి తృటిలో పెను ప్రమాదం తప్పింది. తొండుపల్లి వద్దకు రాగానే వెనకాల నుండి వస్తున్న డిసియం వ్యాన్ కారును డీకొట్టింది. ఈ ప్రమాదంలో మంగ్లీ కారు వెనుక భాగం స్వల్ప డ్యామేజ్ అయింది. ప్రమాద సమయంలో కారులో మగ్లితోపాటు డ్రైవర్ రాజు, మనోహర్ ఉన్నారు.రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతి వనంలో ప్రపంచ…

Read More

విక్టరీ వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి

టాలీవుడ్ టాప్ హీరో విక్టరీ వెంకటేశ్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైంది. వెంకటేశ్ రెండో కుమార్తె హయవాహిని మార్చి 15వ తేదీన పెళ్లి చేసుకోబోతున్నారు. కాగా ఈ శుభకార్యానికి రామానాయుడు స్టూడియో వేదిక కానుంది. హయవాహినికి గతేడాది అక్టోబరులో విజయవాడకు చెందిన ఓ డాక్టర్ తో నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ వేడుకకు కేవలం కుటుంబసభ్యులు, సన్నిహితులు మాత్రమే హాజరవుతారని సమాచారం.

Read More

చోరీ కేసులో తెలుగు నటి సౌమ్య శెట్టిని అరెస్ట్

విశాఖ : కేజీ బంగారం చోరీ కేసులో తెలుగు సినీ నటి సౌమ్య శెట్టిని విశాఖ పోలీసులు అరెస్ట్ చేశారు. రిటైర్డ్ పోస్టల్ ఉద్యోగి ప్రసాద్ ఇంట్లో కిలోకి పైగా బంగారం దోచుకుని ఆమె గోవాకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ప్రసాద్ కుమార్తెతో పరిచయం పెంచుకుని ఇంట్లోకి ప్రవేశించి పక్కా ప్లాన్తో ఆమె ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ద ట్రిప్, యువర్స్ లవింగ్లీ సహా పలు మూవీల్లో సౌమ్య నటించింది.  

Read More

దర్శకుడు క్రిష్ డ్రగ్స్ టెస్ట్ నెగెటివ్ ?

డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్‌కు ఊరట లభించినట్లుగా తెలుస్తోంది. పోలీసుల ముందు హాజరైన ఆయన తన బ్లడ్, యూరిన్ శాంపిల్స్ ను ఇచ్చారు. వాటిని పోలీసులు టెస్ట్ చేయించారు. యూరిన్ శాంపిల్స్ లో డ్రగ్స్ తీసుకున్నట్లు ఆనవాళ్లు లేవని తేలింది. బ్లడ్ శాంపిల్ టెస్టు రావాల్సి ఉంది. అయితే రెండు భిన్నంగా వచ్చిన సందర్భాలు తక్కువని చెబుతున్నారు.

Read More

సీసీఎల్‌కు హైద‌రాబాద్ ఆతిథ్యం

* బాలీవుడ్‌, టాలీవుడ్‌ సెల‌బ్రెటీలు ఆడ‌నున్నారు * ఉచితంగా 10 వేల మంది కాలేజీ విద్యార్థుల‌కు ఎంట్రీ * హెచ్‌సీఏ అధ్య‌క్షుడు జ‌గ‌న్‌మోహ‌న్ రావు హైద‌రాబాద్‌: సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సీసీఎల్‌)కు ఆతిథ్య‌మిచ్చేందుకు హైద‌రాబాద్‌లోని ఉప్ప‌ల్ స్టేడియం ముస్తాబువుతుంద‌ని హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్ (హెచ్‌సీఏ) అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు వెల్ల‌డించారు. ఈ లీగ్ తొలి అంచె మ్యాచ్‌లు షార్జాలో జ‌రుగుతుండ‌గా, వ‌చ్చే నెల 1వ తేదీ నుంచి 3 తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న రెండో అంచె…

Read More

గంజాయి కేసులో బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్ జస్వంత్

గంజాయి కేసులో బిగ్‌బాస్‌ ఫేమ్‌, యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ దొరికిన వైనం సృష్టించింది. ఇటీవలి కాలంలో బిగ్‌బాస్‌లో పాల్గొన్న ప్రముఖులు వివాదాల పాలవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ కేసులో విచారణ కోసం వెళితే గంజాయితో దొరికిపోయిన షణ్ముక్. షణ్ముక్, సంపత్ వినయ్ ఇద్దరినీ అదుపులోకి తీసుకుని పోలీసులు. విచారిస్తున్నారు.  

Read More

50 ఏళ్ల సినీ ప్రస్థానం మురళీ మోహన్ ఘనత

-సినీ, వ్యాపార, రాజకీయ రంగాల్లో మురళీమోహన్ సక్సెస్ -ఎన్టీఆర్ ఆశయమైన పేదరికం లేని సమాజం కోసం పాటుపడతాం -ప్రపంచ దేశాల్లో భారతదేశం పేరును మోడీ మరింత విస్తృత పరిచారు -తెలుగుజాతి నెంబర్ – 1 కావాలన్నదే నా కల -మురళీ మోహన్ 50 ఏళ్ల సినీ ప్రస్థానం కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు -శిల్పకళా వేదిక సహా సైబరాబాద్ అభివృద్ధిని కార్యక్రమంలో మననం చేసుకున్న చంద్రబాబు నాయుడు హైదరాబాద్: 50 ఏళ్ల సినీ ప్రస్థానం మురళీమోహన్…

Read More

ఆ ఒక్కరికోసమే యాత్ర-2

-యాత్ర-2 రివ్యూ 2019 ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథ ఆధారంగా రూపొందించిన యాత్ర సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన యాత్ర బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి యాత్ర సినిమాలో వైఎస్ఆర్‌గా కనిపించి మెప్పించారు. ముఖ్యంగా వైఎస్ఆర్‌ను అభిమానించే ప్రతి ఒక్కరికి యాత్ర సినిమా గుండెలకు హత్తుకునేలా చేసింది. ఈ సినిమాకు కొనసాగింపుగా యాత్ర 2ను అనౌన్స్…

Read More

రాజకీయాల్లోకి రావడం లేదు

– హీరో విశాల్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్టార్ హీరో విశాల్ స్పందించారు. ‘నాకు ఇంత గుర్తింపు, హోదా ఇచ్చిన ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాకు చేతనైనంత సాయం చేయాలనే ఉద్దేశంతో దేవి ఫౌండేషన్ ద్వారా ఎందరినో ఆదుకున్నా. విద్యార్థులకు చదివిస్తున్నా. రైతులకు సాయం చేశా. లాభాలను ఆశించి ఏ పనిచేయను. ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేదు. కాలం నిర్ణయిస్తే, ప్రజల కోసం పోరాడుతా’ అని వెల్లడించారు.

Read More

కొరటాల శివకు సుప్రీంలో కూడా చుక్కెదురు

2012లో స్వాతి మాస పత్రికలో ప్రచురిత మైన చచ్చేంత ప్రేమ నవల శ్రీమంతుడు సినిమాగా తీసారని ప్రముఖ రచయిత శరత్ చంద్ర కోర్ట్ కి ఎక్కారు. ఈ సినిమా కు తానే కథ రాసుకున్నట్టు కొరటాల శివ సిల్వర్ స్క్రీన్ పై తన పేరు ప్రకటించుకొన్నారు. పైగా కథ కోసం కోటి రూపాయలు పారితోషకం తీసుకున్నట్టుగా కూడా శివ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్ట్ కి లిఖిత పూర్వకంగా తెలిపారు. కాగా ఈ కేసులో శ్రీమంతుడు సినిమా…

Read More