గత కొన్నేళ్లుగా మంచి గీతం
వింటున్నావంటే
అది సిరివెన్నెల పాట...
ఆత్రేయ లేని లోటు తీర్చి..
వేటూరికి ధీటుగా నిలిచి
సినిమా పాటకు సిరివెన్నెల సోయగాలద్దిన జాబిల్లి..
ఈ సీతారామ శాస్త్రి..
మూడువేల పాటల మేస్త్రి!
కళాతపస్వి అన్వేషణ ఫలించి అరుదెంచిన
ఈ పాటల విరించి
తొలి సినిమాలోనే
తన ప్రతిభను వివరించి..
పాటల మహసామ్రాజ్యాన్ని
ఆవిష్కరించి..
తానే అయ్యాడు
సినిమా పాటకు
శృతి లయ..!_
ప్రతి పాటలో పాటవం..
పాటకు తెచ్చిపెట్టి
కొత్త గౌరవం
వినిపిస్తూ కిలకిలారావం..
సినిమా పేరునే ఇంటిపేరుగా
మార్చుకున్నా..
మంచి పాటకు...
యశోద సినిమాలో కనిపించిన ఇవా ఆసుపత్రికి సంబంధించిన సన్నివేశాలను తొలగించమని యశోద సినిమా నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ అన్నారు. ఇవ పేరుతో ఆసుపత్రి ఉన్న విషయం తమకు అసలు తెలియదని అన్నారు. మంగళవారం ఫిలిం ఛాంబర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మాత శివలంక కృష్ణ ప్రసాద్ తో పాటు ఇవ...
పంతులు..మాస్టారు..
మంత్రి..గుమాస్తా..
ఇలాంటి పాత్రలకు
పెట్టింది పేరు..
వంగర..
వంద సినిమాల్లో
ఆయన రీళ్లు
ఈ తరహా పాత్రలతోనే
తిరిగిపోయాయి గరగర..!
మాయాబజార్లో శాస్త్రి..
శర్మ అల్లుతో జత కట్టి
కత నడిపిన మేస్త్రి..
ఈ శాస్త్రి..శర్మ ద్వయం..
కురురాజు పెళ్లి బృందంలో
పుష్పం..తోయం..
ఆడపెళ్లి వారిని ఆటపట్టించబోయి
అభాసుపాలైన జంట..
కవచ విధి కవచ విధి..
పరమం పవిత్రం..
రక్షైక రక్షైక శుభశంఖు చక్రం..
ఈ ఇద్దరి బుద్దే వక్రం..!
తొలినాళ్ళ విప్రనారాయణతో
మొదలైన నటయాత్ర
ఎక్కువగా పిలకతోనే
సాగిన పాత్ర..
ఆ పంతులు గెటప్పులోనే
శ్రీకృష్ణపాండవీయంలో
నల్లనయ్య కడకు
ప్రేమసందేశంతో వెళ్లి
రుక్మిణిగా...
- హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో పెద్ద కర్మ
- అంత్యక్రియల రోజున చివరిచూపు చూసుకోలేకపోయిన చాలా మంది అభిమానులు
- దీంతో అభిమానులను కలవాలనుకుంటున్న మహేశ్ బాబు
హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ రాబోయే ఆదివారం (27వ తేదీ) జరగనుంది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి...
గంధర్వ లోకాల నుంచి
దిగివచ్చాడేమో..
ఆ లోకాలకే మరలివెళ్లాడు..
ఈలోగా
తన గానమాధుర్యంతో
శ్రోతల్ని కూడా
గంధర్వలోకాలలో
ఓలలాడించిన సంగీత స్రష్ట
మంగళంపల్లి బాలమురళీకృష్ణ..
ఎప్పటికీ తీరిపోని
సంగీత తృష్ణ..!
ఆ గళంలో రాగాలు
అమృత ధారలైతే
స్వరాలు ఆ ధారల్లో
జలకాలాడలేదా..
సరిగమపదనిసలు
గుసగుసలాడుకుని
ఆ పేటికను తమ
వాకిటిగా చేసుకుని
ఎంతగా నర్తించాయో..
కొత్త కొత్త రాగాలై..
రసరంజితాలై..!
పాడనా వాణి కల్యాణిగా..
స్వరరాణి పాదాల పారాణిగా..
నా పూజకు శర్వాణిగా..
నా భాషకు గీర్వాణిగా..
శరీరపంజర స్వరప్రపంచ
మధురగాన సుఖవాణిగా..
తానే వస్తువుగా రాసిన కీర్తన
ఆ సంగీతకళానిధి స్వరంలో
పరవశంగా నర్తన..
తానూ...
ఆమె ఆడితే
థియేటర్లు గెంతాయి..
పెదవి కదిపితే
పృధివి ఊగింది..
జ్యోతిలక్ష్మి..జయమాలిని..
ఇలాంటి నర్తకీమణులకు
బాలీవుడ్ అక్క..
హిందీ హీరోలను
ఆడించింది చెమ్మచెక్క..!
హెలెన్ అంటేనే
కదిలే బాంబు..
ఆమె ఉంటేనే
బాలీవుడ్ బొమ్మకి
ఎక్కడలేని డాబు..
శరీర కదలికలతో
ఏలేసింది హిందీ సినిమాని
ఊపేసింది తాతతండ్రుల
జమానాని..!
మోనికా ఓ మై డార్లింగ్..
హెలెన్ పాటే కార్వాన్ హిట్టు
మెహబూబా..మెహబూబా..
అంజాద్ ఎదురుగా
ఆడుతున్న మగువ..
వేగుతున్న మాంసం..
ఏది ముందాని
అంతటి గబ్బరూ మీమాంసం!
అసలు హెలెన్ పాట కోసమే
సినిమాకి వెళ్ళిన ప్రేక్షకుడు
ఆమె ఆడుతుంటే
మైమరచిపోయిన
పిచ్చి వీక్షకుడు..!!
తొలినాళ్ళలో హెలెన్ ఆట..
గీతాదత్...
నాకు తెలిసిన
నవ్వుల సుధాకర్..
ఎదిగాడు కారెక్టర్ నటుడిగా..
ఒదిగాడు మంచి మనిషిగా..!
వస్తూనే తన మకాం
ఇక్కడే శాశ్వతమని..
చిత్రసీమకు ఇచ్చేశాడు
శుభలేఖ..
ఇక్కడే దొరికింది
జీవితాన శశిరేఖ..
శైలజ రూపంలో..
సుధా 'సాగర'ముతో
సంగమమై..
ఆ జంట కాపురమే
పూర్ణోదయ లయనిలయమై..!
ఈ కపిల వారి దేవుడయ్య
మనిషి బక్కోడే గాని
గొంతు గంభీరం..
ఆ గళమే చేసింది
కమెడియన్‌ను
క్యారెక్టర్ ఆర్టిస్ట్..
శివలో పాత్ర కెరీర్లో
ఓ పెద్ద ట్విస్ట్..!
హాస్యం ఎంత లాస్యమో..
సీరియస్ పాత్రల్లో
అంత ప్రశస్తం
ఈ సితార దేవదాసు
మా శైలజమ్మ ప్రేమదాసు..
స్వరం...
సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. పోసానిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద రాజమండ్రిలో కేసు నమోదు చేశారు పోలీసులు.. అయితే, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో...
ఆయన మెగాస్టార్..
తెలుగు సినిమా గతిని..శృతిని మార్చిన
సుప్రీం హీరో..
హీరోకి పరుగు నేర్పి..
డాన్సుకి డిస్కో సొగసులద్ది..
స్టంటు వేగం పెంచి..
టాలీవుడ్ ను తన అపారచాతుర్యంతో
రఫ్ఫాడించిన గాంగ్ లీడర్..
కళ్ళలో మెరుపు..
కదలికలో స్టైల్..
డైలాగ్ డెలివరీలో అందమైన మాడ్యులేషన్..
పాత్రకు తగిన అభినయం..
సన్నివేశానికి తగ్గని
నటన..ఎమోషన్..
సిట్యు"వేషం"న్ డిమాండ్ చేసే రౌద్రం..గాంభీర్యం..
కామెడీ..టైమింగ్..
రొమాన్స్..ఏది కావాలంటే
అది తగిన మోతాదులో
ప్రదర్శించే పరిపూర్ణ నటుడు..చిరంజీవి..!
తెలుగు సినిమాని
అయిదుగురు పెద్ద హీరోలు
ఎన్టీఆర్..ఏయెన్నార్..కృష్ణ..శోభన్ బాబు..కృష్ణంరాజు శాసిస్తున్న వేళ..
ఇంకా...
సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిన్న తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించారు. అయితే, అంత గొప్ప సూపర్ స్టార్ అంత్యక్రియలు సొంత ఫామ్ హౌస్ లో కాకుండా శ్మశానవాటికలో నిర్వహించడంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.
దీనిపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందిస్తూ... దీనికి ఒక...