Home » హేమ విషయంలో నిజాలు వెలికి తీయాలి

హేమ విషయంలో నిజాలు వెలికి తీయాలి

-దళారులకు లాభం చేకూరుస్తున్న బెనిఫిట్ షోలు
-పదేళ్లు కేసిఆర్ సినిమా ఇండస్ట్రీని పట్టించుకునేలేదు
-సీనియర్ నిర్మాత నట్టి కుమార్

డ్రగ్స్ మాఫియా ఎక్కడ జరిగినా, రేవ్ పార్టీలు ఎక్కడ జరిగినా… ఒకరెవరో సినిమావాళ్లు పాల్గొన్నా, పట్టుబడినా ఆ నేరాన్ని సినీ పరిశ్రమకు అంతా ఆపాదిస్తున్నారు. దీనివల్ల సినిమా వారిని బయట చీప్ గా చూస్తున్నారు. వాస్తవానికి తప్పు చేసినవారు ఎవరైనా, ఎంతటివారైనా శిక్ష పడాల్సిందే. అందుకే సినీ పరిశ్రమకు చెడ్డ పేరు రాకుండా, నిజంగా తప్పు చేసారని నిరూపణ అయితే అలాంటి వారిని నిషేధిస్తూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్,, పరిశ్రమకు చెందిన ఛాంబర్ వంటి సంస్థలు చర్యలు తీసుకోవాలని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ అన్నారు.

గురువారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ,, “సినిమా నటి హేమ విషయంలో వాస్తవాలు బయటకు రావాలి. ఒకవేళ ఆమె తప్పు చేసినట్లు రుజువైతే మా అసోసియేషన్ చర్యలు తీసుకోవాలి. ఆ మధ్య గోవాలో సురేష్ కొండేటి తాను ఏర్పాటు చేసిన అవార్డుల ఫంక్షన్ లో లోపాలు జరిగాయని, ఫిర్యాదులు వస్తే, అతనిని నిషేదిస్తున్నట్లు పరిశ్రమ నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి అతను ఏర్పాటు చేసుకున్న ప్రైవేట్ ఫంక్షన్ అది. ఆ విషయంపైనే పరిశ్రమ వర్గాలు అలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు, హేమ విషయంలో కూడా వాస్తవాలను పరిగణలోనికి తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలి. నిజంగా బెంగళూరు రేవ్ పార్టీలో ఆమె పాల్గొనకపోతే, సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ద్వారా కర్ణాటక గవర్నమెంట్ తో మాట్లాడించి, ఇందుకు బాధ్యులు పై యాక్షన్ తీసుకోవాలి” అని డిమాండ్ చేశారు.

తెలంగాణలో థియేటర్స్ బంద్ అన్నారు. అసలు ఏ ధియేటర్స్ బంద్ ఉన్నాయో కనిపించటం లేదు‌‌. పర్సంటేజ్ పెంచాలంటున్నారు. నైజాం ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ గుర్తింపు లేని సంస్థ. నైజాం‌లో మెజారిటీ ఎగ్జిబిటర్స్ ముగ్గురే ఉన్నారు. దిల్ రాజుతో పాటు ఏషియన్ , మైత్రీ వారు మాత్రమే. కేవలం‌ 5 శాతం మాత్రమే ఓన్ ధియేటర్స్ ఓనర్స్ ఉన్నారు. మరి ఎవరి కోసం ధియేటర్స్ మూసివేస్తున్నట్లు ప్రకటించారో తెలియడం లేదు. కావాలని నిర్మాతలను ఇబ్బంది పెట్టడానికి బంద్ ప్రకటించినట్లు అనిపించింది.

ఐకమత్యం తో సమస్యలు పరిష్కరించుకోవాలి తప్ప ఇండస్ట్రీకీ ఇబ్బంది కలిగేలా చెయ్యొద్దు. అందుకే పరిశ్రమకు చెందిన, పరిశ్రమ సమస్యలు తెలిసిన వ్యక్తినే ఎఫ్ డి సి చైర్మన్ గా నియమించాలి. నా దృష్టిలో గతంలో ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా చేసిన బసిరెడ్డి కూడా చైర్మన్ రేసులో ఉన్నట్లు తెలిసింది. డిజిటల్ టెక్నాలజీ ని తన స్టూడియో ద్వారా ఫోకస్ చేయడంతో పాటు తక్కువ ధరకే దానిని పరిశ్రమకు అందించిన వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తికి పరిశ్రమ కష్టనష్టాలు తెలుసు. అలాంటి వారు ఆ పదవికి చక్కగా సరిపోతారు.

ఇక చిత్రపురి కాలనీని లో జరిగిన అవకతవకలపై పూర్తి స్థాయిలో నిగ్గు తేల్చి, నిజమైన సినిమా వాళ్లకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పదేళ్లు కేసిఆర్ సినిమా ఇండస్ట్రీ ని పట్టించుకునేలేదు. కేవలం‌ ఐదుగురికే యాక్సెస్ ఉండేది. కాంగ్రెస్ ప్రభుత్వం‌ అందరి ప్రభుత్వం. కొత్తగా వచ్చిన ఈ ప్రభుత్వమైనా చిత్ర పరిశ్రమ అభివృద్ధికి పాటుపడాలి. ఆంధ్ర ప్రదేశ్ ఎఫ్ డి సి కి చైర్మన్ గా పోసాని ఉన్నా ఉపయోగం లేదు. జూన్ 4 తరువాత ఏపీలో కొత్త ప్రభుత్వం వస్తుంది కాబట్టి ఇకపై సినీ ఇండస్ట్రీ కళకళలాడుతుంది .

బెనిఫిట్ షోల టిక్కెట్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి ఆ డబ్బు నిర్మాతకు కానీ, డిస్ట్రిబ్యూటర్ కు కానీ రావడం లేదు. దళారులు బెనిఫిట్ షోలు వేసి, లక్షలాది రూపాయలు లాభపడుతున్నారు. దీనిపై పరిశ్రమ, ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. తెలంగాణాలో సీఎం రేవంత్ , సినిమాటోగ్రఫీ కోమటి రెడ్డి సినిమా టికెట్ రేట్ లు పెంచకుండా జాగ్రత్తలు పాటించాలి. పేదవాడు మల్టీప్లెక్స్ లో సినిమా చూసేలా ధరలు ఉండాలి. కేసీఆర్, జగన్ అరాచకపాలన చూసి ,జనం విసిగిపోయారు . అందుకే ప్రజలు ఇద్దరినీ సాగనంపుతున్నారు. ” అని నట్టి కుమార్ అన్నారు.

Leave a Reply