Monday, November 28, 2022
రాష్ట్ర సమాచార కమీషన్ కు నూతనంగా ప్రధాన సమాచార కమీషనర్, సమాచార కమీషనర్ గా నియమితులైన ఆర్ మహబూబ్ భాషా, పి.శ్యామ్యూల్ జోన్నాధన్ సోమవారం రాజ్ భవన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ ను కలిసారు. పాత్రికేయిలుగా విశేష అనుభవం ఉన్న వీరికి ఇటీవల ప్రభుత్వం సమాచార కమీషన్ లో అవకాశం కల్పించింది....
పెడన నియోజకవర్గంలో ప్రశ్నించే గొంతుకలను వై.ఎస్.ఆర్.సి.పి. నేతలు భయానకంగా అణచి వేసే దుర్మార్గపు చర్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను వాల్ పోస్టర్ ద్వారా ఎత్తి చూపినందుకు ముగ్గురు యువకులపై దాడి చేయడమే కాకుండా రక్షణ కోసం పోలీస్ స్టేషన్లోకి వెళితే సాక్షాత్తు పోలీసుల ఎదురుగా పోలీస్ స్టేషన్లోనే వారిని విచక్షణారహితంగా కొట్టడం చూస్తే ఆంధ్రప్రదేశ్...
ఎంపీ విజయసాయి రెడ్డి విశాఖపట్నం, నవంబర్ 28: ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా సోమవారం పలు అంశాలు వెల్లడించారు. 2018-19లో రాష్ట్రం నుంచి 31.48 లక్షల టన్నుల ఆహార ఉత్పత్తులు ఎగుమతి జరిగితే.. 2020-21లో 52.88...
-రాజధానిపై చట్టం చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించిన సుప్రీంకోర్టు -అమరావతి రాజధాని కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు -ఏపీ హైకోర్టు గతంలో ఇచ్చిన పూర్తి తీర్పుపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ -హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాలపైనే సుప్రీం మధ్యంతర ఉత్తర్వులు -అమరావతిలో నిర్మాణాలపై హైకోర్టు విధించిన కాలపరిమితిపై మాత్రమే స్టే  -తదుపరి విచారణ...
టీడీపీ జాతీయ కార్యాలయంలో ఘనంగా మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి బడుగు, బలహీన వర్గాలలో ఆత్మస్థైర్యం కల్పించి, వారిలో చైతన్యం రగిలించిన విప్లవ జ్యోతి మహాత్మజ్యోతిరావు పూలే అని టీడీపీ నేతలు అన్నారు. పూలే వర్దంతి సంధర్బంగా మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో టీడీపీ నేతలు పూలే చిత్రపటానికి పూలమాళలు వేసి నివాళి అర్పించారు. అనంతరం...
సాక్షి పత్రికలో ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన పూర్తిగా మోసం అని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశం(జూమ్ మీటింగ్)లో ఆయన మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేడు సాక్షి, ఈనాడులో ఫుల్ పేజ్ అడ్వర్ టైజ్ మెంట్ ఇచ్చింది. ఇందులో తామేదో ఘనకార్యాలు చేసినట్లుగా రాసుకున్నారు. అన్నీ...
వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌ విశాఖ‌: టీడీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో ఫైబ‌ర్ నెట్ స్కామ్‌లో నారా లోకేష్ జైలుకు వెళ్ల‌డం ఖాయ‌మ‌ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేర‌కు ఆయ‌న సోమ‌వారం ట్వీట్ చేశారు. రూ. 321 కోట్ల ఫైబర్ నెట్ స్కామ్ లో జైలుకు వెళ్లక తప్పదు...
మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి తాడేప‌ల్లి: అమరావతి రాజధాని కేసులో సుప్రీంకోర్టు తీర్పును స్వాగ‌తిస్తున్నామ‌ని మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి అన్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన పలు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. రాజధాని అమరావతిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ జరిపింది. కాల పరిమితితో రాజధాని పూర్తి చేయాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సుప్రీం కోర్టు...
మంత్రి జోగి రమేష్‌ తాడేపల్లి: వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తుందని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. వికేంద్రీకరణ విషయంలో సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. మున్ముందు ఉద్యమాలు జరగకూడదనే ఉద్దేశ్యంతో సీఎం వైయస్‌ జగన్‌ వికేంద్రీకరణ నిర్ణయాన్ని తీసుకున్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ముందు చూపుతో వ్యవహరించారని తెలిపారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలనే వికేంద్రీకరణ...
-రాజధానిపై సుప్రీం కోర్టు కోర్పును ఆహ్వానిస్తున్నాం -న్యాయ స్థానాలు టౌన్‌ ప్లానర్‌లా వ్యవహరించడం సరికాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది -పవన్‌ది జనసేన కాదు..రౌడీ సేన..అమ్ముడుపోయిన సేన -మంత్రి అంబటి రాంబాబు అమరావతి: రాజధానిని నిర్ణయించాల్సింది, నిర్మించాల్సింది ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలే కానీ న్యాయ స్థానాలు కాదని సుప్రీం కోర్టు తీర్పుతో స్పష్టమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రాజధానిపై...

Recent Posts

WP Twitter Auto Publish Powered By : XYZScripts.com