Home » Andhra Pradesh » Page 2

డీజీపీ గారూ..ఏమిటీ వైఫల్యం?

-బెజవాడలో ప్రధాని భద్రతా ఏర్పాట్ల వైఫల్యంపై కేంద్రం తాఖీదు -డ్రోన్ ఎగరవేసినా పట్టించుకోరా? -ప్రధాని మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ విజయవాడలో ప్రధాని మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర హోం శాఖ లేఖ పంపించింది. విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభం, చివరలో డ్రోన్‍లు ఎగురవేయడంపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. ప్రధాని రోడ్‍షో…

Read More

కలెక్టర్లు ఈసీ గైడ్‌లైన్స్ ఫాలో అవరా?

-ఏపీ సీఈవో ఎంకే మీనాను కలిసిన టీడీపీ నేతలు -మాజీ మంత్రి దేవినేని ఉమా అమరావతి : అబద్దపు ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ వాళ్ల తాబేదార్లు అంతా ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను సమర్థిస్తున్నారంటే … కౌంటింగ్ ప్రక్రియలో వీళ్ల చేష్టలు ఎలా ఉంటాయి ? ఎంతో కష్టపడి ఓటేసి ఆశా వర్కర్ల దగ్గర నుండి అంగన్ వాడీల వరకు మేము వేసిన ఓటు ఏమౌతుందో అని ఆందోళనలో ఉన్నారు. దీనిపై ఆన్ పేపర్ పెట్టి సంబంధిత…

Read More

ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులా?

-పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసం ఘటనపై డీజీపీకి టీడీపీ నేతల ఫిర్యాదు -పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఫుటేజీని డీజీపీకి అందజేసిన టీడీపీ బృందం -ఎమ్మెల్యే పిన్నెల్లిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ పల్నాడు జిల్లాలో ఈవీఎం ధ్వంసం ఘటనపై డీజీపీని కలిసి టీడీపీ నేతలు వర్ల రామయ్య, దేవినేని ఉమ, జూలకంటి బ్రహ్మారెడ్డి, ఏ.ఎస్ రామకృష్ణ ఫిర్యాదు చేశారు. పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన ఫుటేజీని డీజీపీకి అందజేశారు. ఎమ్మెల్యే పిన్నెల్లిని తక్షణమే అరెస్ట్ చేయాలని…

Read More

ఓట్ల లెక్కింపుకు పటిష్టమైన ఏర్పాట్లు

– పాల్వాయిగేటు పీఓ, ఏపీఓను సస్పెండ్ చేశాం – ఖచ్చితమైన ఫలితాలను త్వరితగిన ప్రకటించేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అమరావతి : వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమానికి పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలను…

Read More

పోలింగ్ అధికారి సహా ఇతర సిబ్బందిపై సస్పెన్షన్ వేటు

– పాల్వాయి పోలింగ్ కేంద్రం ఈవీఎంల ధ్వంసం పై కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీ హరీష్‌గుప్తా నివేదిక మాచర్ల వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని త్వరలో అరెస్ట్ చేస్తామని డీజీపీ హరీష్‌గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించారు. పిన్నెల్లి విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారని ఎయిర్‌పోర్ట్‌లను అప్రమత్తం చేశారు. మాచర్ల నియోజకవర్గం పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంల ధ్వంసం చేశారని పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మాచర్ల ఘటనపై సీరియస్ అయిన…

Read More

స్కూళ్లు తెరిచిన రోజే పుస్తకాల పంపిణీ

విజయవాడ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఉచిత పాఠ్య పుస్తకాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే మండల స్టాక్ పాయింట్లకు చేరుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరం మొదటి సెమిస్టర్కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. జూన్ 12న స్కూళ్ల తెరిచిన రోజు నుంచే వీటిని పంపిణీ చేపట్టనున్నారు. కాగా ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన పాఠ్య పుస్తకాలను రెండు రోజుల్లో విడుదల చేయనున్నారు.

Read More

డబ్బు పంచకుండా వైసీపీ నేతలు ‘తోట’కు తొండి చేశారా?

-పంపకాల విషయంలో చేతివాటం? -ఫలితాలొచ్చాక పనిపడతానని వార్నింగ్ -అందరి లెక్కలు తేలుస్తానన్న కన్నెర్ర (రమణ) మండపేట: ఎన్నికలకు మూడు రోజుల ముందు వరకూ వైసీపీ, టీడీపీ అభ్యర్థులు పోల్ మేనేజ్ మెంటుపై దృష్టి సారించాయి. రెండు పార్టీలు డబ్బులు పంపిణీకి సిద్ధమయ్యాయి. వైసీపీ నాయకత్వం ఈ విషయంలో తలమునకలై వార్డుల్లోనూ, గ్రామాల్లోను ఓట్ల కోసం ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలను ఆయా గ్రామ వార్డు స్థాయి నాయకులకు ముట్ట జెప్పారు. ఏం చేస్తారో ఎలా చేస్తారో తెలీదు…

Read More

నో రీపోలింగ్

– ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రం – పిన్నెల్లి పై సివియర్ సెక్షన్లు – సీఈఓ మీనా ఎన్నికల రోజు మాచర్లలో ఈవీఎం ధ్వంసం కావడంతో అక్కడ రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారానికి సీఈఓ మీనా చెక్ పెట్టారు. ఈవీఎం ధ్వంసం చేసినా డేటా భద్రంగా ఉందని అన్నారు. మాచర్లలో రీపోలింగ్ నిర్వహించే అవసరం లేదని స్పష్టం చేశారు. ఎన్నికల అధికారి మీనా మాట్లాడుతూ.. “9 పోలింగ్ స్టేషన్లు లో ఈవీఎంలు ధ్వంసం చేశారు. మాచర్లలో…

Read More

అంబటి పిటిషన్‍పై తీర్పు రిజర్వ్

సత్తెనపల్లి : తన సత్తెనపల్లి నియోజకవర్గంలో 236, 237, 253, 254 వార్డుల్లో రీ పోలింగ్ని ర్వహించాలని మంత్రి అంబటి రాంబాబు వేసిన పిటీషన్‌పై హైకోర్టులో గురువారం హైకోర్టు విచారణ చేసింది. మొత్తం నాలుగు పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ జరపాలని అంబటి కోర్టులో పిటిషన్ వేశారు. అంబటి పిటిషన్‍పై హైకోర్టులో విచారణ ముగిసింది. పిటీషన్‌పై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.

Read More

కుప్పకూలిన కొడాలి నాని

గుడివాడ: ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థతకు గురయ్యారు. గురువారం తన నివాసంలో నందివాడ మండల వైసీపీ నాయకులతో మాట్లాడుతూ సోఫాలోనే ఒక్కసారిగా కొడాలి కుప్పకూలిపోయారు. దీంతో అప్రమత్తమైన నేతలు, గన్‌మెన్లు సపర్యలు చేసి వైద్యులకు సమాచారం అందించారు. దానితో ఆయనకు వైద్య పరీక్షలు చేశారు. కొడాలి ఇటీవలి కాలంలో అనారోగ్యంతో ఉన్న విషయం తెలిసిందే.

Read More