Suryaa.co.in

Sports

ముఖ్యమంత్రి సహాయనిధికి సాత్విక్ సాయిరాజ్ 2 లక్షల విరాళం

విజయవాడ వరద బాధితుల సహాయార్థం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి ప్రముఖ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు సాత్విక్ సాయిరాజ్ 2 లక్షల విరాళం ఇచ్చారు. ఈ మేరకు సాత్విక్ తరఫున ఆయన తల్లిదండ్రులు టి రంగమణి ,ఆర్ కాశీ విశ్వనాథ్ గురువారం ఉదయం అమలాపురం కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ను కలిసి…

స్వయంకృషి, పట్టుదలతో ఐసీసీ చైర్మన్ అయిన జే షా!

నిరుపేద కుటుంబంలో పుట్టిన జేషా, తిండి తిప్పలకోసం అష్ట కష్టాలు పడ్డారు. పలుకుబడి కలిగిన వారెవరితోనూ సంబంధం లేని వారు. అయినప్పటికీ అతని పూర్తి కృషి మరియు క్రికెట్ పట్ల మక్కువతో భారత క్రికెట్‌లోకి ప్రవేశించారు. అతని అద్భుతమైన సంస్థాగత నైపుణ్యాలతో, అనతికాలంలోనే బీసీసీఐ కార్యదర్శిగా నియమించబడ్డారు. ప్రపంచం అతని ప్రతిభను చూసి అతడిని చైర్మన్‌…

6 మెడల్స్.. 71వ స్థానం

– ఒలింపిక్స్ లో భారత్ ప్రస్థానం పారిస్ ఒలింపిక్స్ విశ్వ క్రీడల్లో భారత ప్రస్థానం ముగిసింది. ఇండియా మొత్తం 6 మెడల్స్ సాధించి టేబుల్లో 71వ స్థానంలో నిలిచింది. ఒక్క గోల్డ్ మెడల్ కూడా గెలవలేదు. గత టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా ఈసారి సిల్వర్ తో సరిపెట్టుకున్నారు. మిగతా…

పతకమా?… పథకమా?

ఒక రోజులో రెండు కేజీల బరువు పెరుగుతారా? వినేష్ పోగట్ బరువు పెరుగుతుంది అంటే కోచ్ , డైటీషియన్లు ఏం చేస్తున్నారు? ఆడపిల్లలు దేశం కోసం ఆడకండి, మీ ఆరోగ్యాలను కాపాడుకోవడం కోసం మాత్రమే క్రీడల్లోకి రండి. ఎందుకంటే క్రీడా సంఘాలు రాజకీయ నాయకుల తొత్తులయ్యాయి. క్రీడల గురించి ఏమీ తెలియని కుసంస్కారులు ఆధిపత్యం చలాయిస్తూ…

నైతిక విలువలు ప్రదర్శించిన స్పానిష్ ఆటగాడు

కెన్యా ఆటగాడు రన్నింగ్ రేసులో ముందున్నాడు. గెలుస్తున్నాడు. ముందు గీతను చూసి రేసు చరమ గీత అనుకుని ఆగిపోయాడు. భాష రాదు. కాబట్టి అదే విన్నింగ్ రేఖ అనుకుని ఆగిపోయాడు. కానీ వెనకాలే పరుగెడుతున్న స్పానిష్ రన్నర్ కెన్యా రన్నర్ ను ” ఇంకా పరుగెత్తాలి ” అంటూ కెన్యా ఆటగాడిని ముందుకు తోసి ఆ…

పీవీ సింధు ఒలింపిక్ చీరపై దుమారం

ఆఖరి 3 నిమిషాల్లో హడావిడిగా డిజైన్‌ చేశారా? భారతదేశ సంస్కృతి, చరిత్రకు ఇది ఘోరమైన అవమానం దుస్తులు చాలా చీప్ గా ఉన్నాయన్న బెంగళూరు రచయిత డాక్టర్ నందితా అయ్యర్ నాసిరకం దుస్తులు అంటగట్టారంటూ కామెంట్స్ పారిస్: క్రీడా ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్నపారిస్ ఒలింపిక్స్ క్రీడలు శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవ…

అథ్లెటిక్స్ క్రీడాకారులతో ముచ్చటించిన మోదీ

న్యూఢిల్లీ: ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఒలింపిక్స్ 2024లో పాల్గొనేందుకు పారిస్ వెళ్తోన్న భారత అథ్లెట్లతో ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ముచ్చటించారు. జట్టులో మొత్తం 28 మంది సభ్యులుండగా గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ జావెలిన్ ప్లేయర్ నీరజ్ చోప్రా భారత్‌కు నాయకత్వం వహిస్తున్నారు.క్రీడా రంగంలో అత్యుత్తమ ప్రదర్శన…

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా?

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పోటీ చేసే అవకాశం ఉందని క్రిక్ బజ్ తాజాగా కథనాన్ని ప్రచురించింది. ఈ ఏడాది నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఒకవేళ పోటీకి దిగితే ఎదురులేకుండా ఎన్నికవుతారని అంచనా వేసింది. ఐసీసీ కార్యకలాపాల్లో సమూల మార్పులు చేయాలని ఆయన భావిస్తున్నట్లు పేర్కొంది. 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా…

Posted on **

జగజ్జేతకు.. జజ్జనకరి జనారే!

-దారి పొడ‌వునా నీరాజ‌నాలు -మువ్వ‌న్నెల జెండాల రెపరెపలు -రూ. 125 కోట్ల నజరానా -సంబురంగా ‘విక్టరీ పరేడ్’ ముంబై: జ‌గ‌జ్జేత‌లుగా స్వ‌దేశంలో అడుగు పెట్టిన భార‌త జ‌ట్టుకు అపూర్వ స్వాగ‌తం ల‌భిస్తోంది.. ఓపెన్ టాప్ బ‌స్సులో విక్ట‌రీ ప‌రేడ్ క‌న్నుల పండువ‌గా సాగుతోంది. అశేష‌మైన అభిమానులు దారి పొడ‌వునా నీరాజ‌నాలు ప‌లుకుతూ.. ‘జ‌య‌హో టీమిండియా’ నినాదాల‌తో…

Posted on **

శహభాష్..టీమిండియా!

ప్రధాని మోదీని కలిసిన టీమిండియా ఢిల్లీ: టీ20 ప్రపంచ కప్ తో స్వదేశానికి చేరుకున్న భారత క్రికెటర్లు ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా జట్టు సభ్యులను మోదీ అభినందించారు. టీ 20 ప్రపంచ కప్ పోటీల్లో సత్తా చాటారని ప్రధాని కొనియాడారు. ప్రధాని మోదీతో కలిసి ఆటగాళ్లంతా అల్పాహారం చేశారు.

Posted on **