Suryaa.co.in

Andhra Pradesh

కలెక్టర్లు ఈసీ గైడ్‌లైన్స్ ఫాలో అవరా?

-ఏపీ సీఈవో ఎంకే మీనాను కలిసిన టీడీపీ నేతలు
-మాజీ మంత్రి దేవినేని ఉమా

అమరావతి : అబద్దపు ముఖ్యమంత్రి, వైసీపీ పార్టీ వాళ్ల తాబేదార్లు అంతా ఈవీఎం ధ్వంసం చేసిన ఎమ్మెల్యేను సమర్థిస్తున్నారంటే … కౌంటింగ్ ప్రక్రియలో వీళ్ల చేష్టలు ఎలా ఉంటాయి ? ఎంతో కష్టపడి ఓటేసి ఆశా వర్కర్ల దగ్గర నుండి అంగన్ వాడీల వరకు మేము వేసిన ఓటు ఏమౌతుందో అని ఆందోళనలో ఉన్నారు.

దీనిపై ఆన్ పేపర్ పెట్టి సంబంధిత కలెక్టర్లకు ఇవ్వమని సీఈఓ ని కోరడం జరిగింది. వీడియో కాన్ఫ్ రెన్స్ అయ్యింది త్వరలో రాజకీయపార్టీలను పిలుస్తామని చెప్పారు. ఎన్ని టేబుల్స్, ఎన్ని రౌండ్లు, ఎంత మంది కౌటింగ్ ఏజెంట్లను పెట్టుకోవాలో ఏమి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తెలియజేయాలి.

కౌంటింగ్ కు వచ్చే ఏజెంట్లకు అర్హతలు ఏమీ లేవు 18 ఏళ్లు నిండి ఓటు ఉంటే చాలని అభ్యర్థులు ఏజెంట్లను పెట్టుకోవచ్చని ఈసీఐ చెప్తుంది. రాజానగరంలో ఆర్వో, ఎమ్మార్వో లు మీరు ఏమి చదువుకున్నారు మీద కేసులేంటని అడుగుతున్నారు.. అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి.

ఈ రోజు జరిగిన కలెక్టర్ల కాన్ఫ్ రెన్స్ లో అనంతపురం కలెక్టర్ అడుగుతున్నారంటే.. వీళ్లు ఏవిధంగా ఈసీఐ గైడ్ లైన్స్ ఫాలో ఆవుతున్నారో తెలుస్తుంది.

LEAVE A RESPONSE