– వారిపై విమర్శలు చేసే స్థాయి వైసీపీ నేతలకు లేదు
– గూగుల్ తెచ్చిన ఘనత మాది…గన్ కల్చర్ మీది
– సమాధి రాళ్లు…పునాది రాళ్లు.. బోత్ ఆర్ నాట్ సేమ్ అన్న విషయాన్ని గుడివాడ అమర్ నాద్ తెలుసుకోవాలి
– గుడ్డుకి…గాడిద గుడ్డుకు అమర్ నాధ్ కి తేడా తెలీదు..బోత్ ఆర్ నాట్ సేమ్ అని తెలుసుకోవాలి
– వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్ వ్యాఖ్యలపై మండిపడిన జనసేన నేత పీతల మూర్తి యాదవ్
విశాఖపట్నం: కూటమి ప్రభత్వంపై అవాకులు, చవాకులు పేలడం కాదు.. దమ్ముంటే వైసీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిపై గుడ్డు మంత్రి అమర్ చర్చకు రావాలని జనసేన నేత, మాజీ కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ బుధవారం సవాల్ విసిరారు.
బోత్ ఆర్ నాట్ సేమ్ అమర్ అంటూ పౌర గ్రంధాలయంలో మీడియా ఎదుట వ్యంగ్యాస్త్రాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం చంద్రబాబు తొలి పర్యటన అనకాపల్లి జిల్లా దార్లపూడేనాని. మూడేళ్ళ మంత్రిగా ఉన్న అమర్ పెట్టుబడుల కోసం మాట్లాడితే గుడ్డు..కోడి గుడ్డు అంటూ చెప్పేవారని బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నారు.
జూలై 2024లో ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టును పరిశీలించి పోలవరం నుంచి రూ.800కోట్లతో విశాఖ- విజయనగరం ప్రాంతానికి నీరిచ్చే ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారని మూర్తి యాదవ్ గుర్తు చేశారు. రూ.85 కోట్లతో అనకాపల్లికి నీరిచ్చే పనుల్ని పరిశీలించి, వేగవంతం చేశారని, ఈ రోజు దానివల్లే అనకాపల్లికి మంచి నీరుస్తోందని గుర్తు చేశారు. అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రి పదవిని పొందిన అమర్..మూడేళ్లలో కనీసం ఒక్కరోజు కూడా ప్రాజెక్టుల్ని పరిశీలించలేదని, అలాంటి వ్యక్తి ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలవరం ప్రాజెక్టు కోసం మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి కానీ వైఎస్ జగన్ కు గానీ, కోడిగుడ్డు మంత్రి అమర్ కు గానీ లేదన్నారు. పోలవరం ప్రాజెక్టును ఐదేళ్లపాటు వైసీపీ నేతలు నష్ట పరిచారని, స్పిల్ వే బీటలు వచ్చిందని, గైడ్ బండ్ కుంగిపోయిందని, చివరి నిర్మాణానికి వెళ్లే రహదారి సైతం కొట్టుకుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కరోజు కూడా పోలవరం ప్రాజెక్టు కోసం మాట్లాడని మనుషులు వారని, వైసీపీలో అనిల్ మంత్రిగా ఉన్నప్పుడు అసలు ఆ విషయాలే తనకు తెలియవని చెప్పేవాడన్నారు,అంబటి మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం కోసం స్టడీ చేస్తున్నానని చెప్పేవాడని, వైసీపీ..కూటమి బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నారు.
వైసీపీ హయంలో పరిశ్రమలకు సమాధి రాళ్లు
వైసీపీ హయాంలో పరిశ్రమలకు సమాధి రాళ్లు పడితే… కూటమి హయంలో పునాది రాళ్లు పడుతున్నాయి అని అవి బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ మూర్తి యాదవ్ ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో పోలవరాన్ని పదేళ్లు వెనక్కి తోసెసిన మనుషులు ఇప్పుడు మాట్లాడుతున్నారని, 2027 పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు ద్వారా ఉత్తరాంధ్రకు నీళ్లు ఇస్తానని చంద్రబాబు ప్రకటించారని, పోలవరం పనులు వేగవంతమవుతున్నాయని మూర్తి యాదవ్ స్పష్టం చేశారు.
పోలవరం ప్రాజెక్టుకు గేట్లు పెట్టింది చంద్రబాబేనని, 2027 పుష్కరాల వరకు వేచి చూడండి..ప్రాజెక్టు నీళ్లు వస్తాయి..ఆ నీళ్లలో మీరు స్నానం చేద్దురుగాని అని పిలుపునిచ్చారు. వరదలు వస్తే కూనవరం వెళ్లడం మానేసి చట్నీ అనే ఊరి దగ్గర బాధితులు కొంతమందిని పిలిపించుకుని మాట్లాడిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అని, అప్పుడు అల్లూరి జిల్లా ఇన్చార్జి మంత్రిగా ఉన్న అమర్ పోలవరం వరద బాధితుల్ని ఏ విధంగా ఆదుకున్నారో చెప్పాలని సవాల్ విసిరారు.
కనీసం శబరి నది వరద బాధితుల గ్రామానికి వెళ్లి చూశాడా? ఇప్పుడు పోలవరం కోసం మాట్లాడడం సిగ్గునిపిస్తుందన్నారు. విస్సన్నపేట పేట వద్ద 600ఎకరాల దళితుల భూముల్ని చెక్కేసిన అమర్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ పై ఇప్పుడెoదుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నేను పవన్ కళ్యాణ్ పక్కన నిలబడితే , నాతో ఆయన సెల్ఫీ తీసుకుంటారన్న అమర్.. సీఎం చంద్రబాబుకు దత్తపుత్రుడు అని, పాచిపోయిన లడ్డూలoటూ విమర్శించిన అమర్ ఇప్పుడు తల ఎక్కడ పెట్టుకుంటారని అడిగారు. అటవీ శాఖ, పంచాయతీ రాజ్ శాఖల్ని అభివృద్ధి చేస్తున్న పవన్ కళ్యాణ్ కోసం అమర్ కు మాట్లాడే నైతికత లేదని మూర్తి యాదవ్ అన్నారు. పవన్ కు ఆస్పత్రిలో సర్జరీ జరిగితే అదే గుడ్డు మంత్రి పవన్ త్వరగా కోలుకోవాలని ఎక్స్ లో ట్వీట్ చేశారని, అప్పుడు బూతులు… ఇప్పుడు ట్వీట్లా? బోత్ ఆర్ నాట్ సేమ్ అంటూ అమర్ పై విమర్శలు గుప్పించారు.
వారిద్దరూ సూర్య చంద్రులు
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి సూర్యచంద్రులని, మావిగన్ అంటూ పేలని గొడ్డలి, గన్ లు తుస్సయిపోయాయని, ఆంధ్రా ప్రజలు జగన్ ను మర్చిపోయారని మూర్తి యాదవ్ చెప్పారు. మావిగన్ కు వైసీపీ నేతలు ఇక విడాకులు ఇచ్చేయాలని, వారి తిట్లు, ట్వీట్లను ప్రజలు ఇష్టపడడం లేదని బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నారు. రాష్ట్రంలోనే అత్యంత దారుణంగా ఓడిపోయిన చరిత్ర అమర్ ది అని, రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో మా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గెలిచారని, నీపై గాజువాక ప్రజలు ఎంతగా వ్యతిరేకం చూపించారో ఆ మెజారిటీ చూస్తే చాలని బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నారు.
ఇప్పటికే జగన్ అమర్ ను పక్కన పెట్టేశాడని, ఆయనకు ముందు విశాఖ ఇచ్చారని,తర్వాత అనకాపల్లి ఇంచార్జ్ ఇచ్చారని, ఇప్పుడు చోడవరం పంపించారని ఎద్దేవా చేశారు. రేపు తూ.గో జిల్లా పరిశీలకుడిగా వెళ్ళు అని టికెట్ ఇవ్వడం మానేస్తారన్నారు. ముందు నీ పార్టీలో నీకు ఇస్తున్న విలువ ఏంటో తెలుసుకో అమర్.. తర్వాత విమర్శలు, ప్రెస్ మీట్ లు పెడుదువు అంటూ విమర్శించారు. జగన్ ప్రభుత్వంలో విధ్వంసం ఉంటే తమ ప్రభుత్వంలో వివేకంగా పని చేస్తున్నారని, వైసీపీ మూడు రాజధానుల నినాదం మూడు ముక్కలాట అయిపోయిందని.. వైసీపీ..కూటమి..బోత్ ఆర్ నాట్ సేమ్ అని పీతల మూర్తి యాదవ్ స్పష్టం చేశారు.