– రాయలు , కన్నెగంటి, రంగా పట్ల వివక్ష ఎందుకు?
– ఆ 27 మందిలో ఒక్క కాపు-బలిజ పేర్లు లేకపోవడం కుట్ర
– 1956 నుండి కాపుల మీద సీఎంల కుట్రలు
– సిఎం చంద్ర బాబు నాయుడుకి కాపు పొలిటికల్ జేఏసీ చైర్మన్ వేల్పురి శ్రీనివాసరావు బహిరంగ లేఖ
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 27 మంది ప్రముఖులు జయంతి, వర్ధంతి నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో ఒక్క పేరు కూడా కాపు ,బలిజ వర్గానికి చెందినవారు లేక పోవడం కుట్ర అని శ్రీనివాస రావు పేర్కొన్నారు.
స్వర్ణయుగ చక్రవర్తి దేవరాయలు, సమర వీరుడు ,పుల్లరి ఉద్యమ యోధుడు హనుమంతు, పేద ప్రజల ఇళ్ల పట్టాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేస్తు హత్యకు గురైన వంగవీటి మోహన్ రంగా జయంతి- వర్ధంతి చేయకుండా, ఇతర రాష్ట్రాల కు చెందిన వ్యక్తులు జయంతి, వర్ధంతి నిర్వహించడము సరికాదన్నారు.
1956 నుండి కాపుల మీద సీఎం లు అందరూ కుట్రలు చేశారు అని పేర్కొన్నారు . పెద్దన్న పాత్ర పోషించిన కాపు సామాజిక వర్గం మీద కుట్రలు ఎందుకు అని ప్రశ్నించారు. ఒక కులానికి మాత్రమే ముఖ్యమంత్రి గా ఉన్నారా? రాష్ట్రానికి సీఎం గా ఉన్నారా అని ప్రశ్నించారు. గతంలో రాజశేఖర రెడ్డి, జగన్ లు కాపుల మీద 100 కుట్రలు చేశారు అని, మీరు కూడా వారి వారి బాటలోనే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారా? అని ప్రశ్నించారు.
దేశం కోసం త్యాగం చేయడం నేరమా? కాపులు 1974 లో తిరుపతి ఎస్. వి. విశ్వవిద్యాలయం అధ్యక్షుడు ఎన్నికల్లో సుధాకర్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు ని గెలిపిస్తే.. రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రాణాలు, పవన్ కళ్యాణ్ కాపాడినారు అని గుర్తు చేశారు. ప్రభుత్వం 70 సంవత్సరాల నుండి కేవలం రెండు వర్గాల చేతిలో ఉన్న కారణంగా.. కుల వివక్ష, మత, ప్రాంత వివక్షకు బహుజన వర్గాలు గురవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.