సాయిబాబా పరంగా సనాతనం లేదా హైందవానికి పెను విపత్తు సంభవించింది. సాయిబాబా కారణంగా వైదిక లేదా సనాతన లేదా ‘హైందవ భావాలు’ తీవ్రంగా దెబ్బతిన్నాయి; దెబ్బతింటున్నాయి. హైందవ ఆగమ విధులు, ఆరాధనా పద్ధతులు, పూజా విధానాలు, హైందవ సంప్రదాయాలకు సాయిబాబా అన్నది తీవ్ర విఘాతమయింది. సాయిబాబా విపత్తును హైందవం నుండి వెనువెంటనే తప్పించాలి. సాయిబాబా విపత్తు నుండి హైందవాన్ని వెనువెంటనే రక్షించుకోవాలి. ‘సాయిబాబా రహిత సనాతనం లేదా హైందవం మనకు తక్షణ అవసరం’.
షిర్డీ సాఈన్బాబా లేదా సాయిబాబా… ఇవాళ మన సనాతనానికి పెను అపాయం సాయిబాబా! 100యేళ్ల క్రితం సాయిబాబా మన సనాతనం లేదా హైందవంలో లేడు. కానీ ఇవాళ సాయిబాబా అన్నది హైందవానికి కళంకమూ, వికారమూ, కీడూ అయిపోయింది. ‘సాయిబాబా వల్ల హైందవ భావాలు కలుషితం ఔతున్నాయి’.
సాయిబాబా వల్ల క్రైస్తవం, ఇస్లామ్ ఎంత మాత్రమూ దెబ్బతినలేదు. క్రైస్తవులు కానీ, ముస్లిమ్‌లు కానీ ఈ సాయిబాబాను గురువుగానో, ఒక సాధు పురుషుడుగానో, కనీసం ఒక వ్యక్తిగా కూడానో పరిగణించరు. కానీ హైందవంలో మాత్రం సాయిబాబా ఏకంగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయిపోయాడు.
ఇవాళ కొందరు వికృత స్వభావులైన హిందువులకు వేలయేళ్లుగా ఉన్న హైందవ దేవీ దేవతల కన్నా సాయిబాబా ఎక్కువైపోయాడు. ఈ పరిణామానికి కారణం అజ్ఞానం, మానసిక బలహీనత, మూర్ఖత్వం, అమాయకత్వం, చదువు లేకపోవడం… అంతేకాదు మానసిక రోగం కూడా.
సాయిబాబా వల్ల ఈ వరకే హైందవానికి ఎంతో హాని జరిగింది. సాయిబాబా వల్ల హైందవానికి తదుపరి విధ్వంసం జరగక ముందే మనం అప్రమత్తం అవాలి. సాయిబాబా గురించి సరైన తెలివిడితో సాయిబాబా అపాయాన్ని మనం తొలగించుకోవాలి. ఆ పని చేద్దాం రండి-
మీలో కొందరికి సాయిబాబా నచ్చవచ్చు, నమ్మకం కావచ్చు లేదా సాయిబాబా మీ మనోభావం కావచ్చు. ఎవరి నమ్మకాలు వారివి; ఎవరి అభిప్రాయాలు వారివి; ఎవరి అజ్ఞానం వారిది; ఎవరి అమాయకత్వం వారిది; ఎవరి మానసిక వైకల్యం వారిది. సాయిబాబాను, సాయిబాబా భక్తుల్ని తప్పుపట్టడం కాదు ఈ నా ప్రయత్నం. సాయిబాబా గురించి సరైన అవగాహనతో హైందవానికి సంభవించిన సాయిబాబా విపత్తుకు వ్యతిరేకంగా తెలివిడి ప్రాతిపదికగా ఇది నా ప్రయత్నం.
సాయిబాబాతో హైందవం లేదా వైదికాన్ని కల్మషం చెయ్యద్దని, సాయిబాబాతో ఆలయాల్ని, హైందవ పూజా విధానాల్ని, ఆరాధనా పద్ధతుల్ని అపవిత్రం చెయ్యద్దని వినమ్రంగా చేస్తున్న విన్నపం ఈ నా ప్రయత్నం.
సాయిబాబా పేరుతోనూ, సాయిబాబా కారణంగానూ హైందవానికి జరుగుతున్న కీడును ఆపమని ఆవేదనతో చెయ్యబడుతున్న అభ్యర్థన ఈ నా ప్రయత్నం.
ఉన్మాదానికి, మూర్ఖ, మూఢ, అంధ భక్తికి అతీతంగా, మానసిక రోగానికి అతీతంగా, వక్రతకు అతీతంగా హైందవ ప్రయోజనార్థం నేను చేస్తున్న ఈ ప్రయత్నాన్ని మనసుతోనూ, మస్తిష్కంతోనూ స్వీకరించండి.
2020లో ఒక చిన్న వ్యాసంతో సోషల్ మీడిఅలో ‘సాయిబాబా విపత్తు’కు వ్యతిరేకంగా నా ప్రయత్నం మొదలుపెట్టి కొన్ని విషయాల వ్యాసాలను వెల్లడించాను. మళ్లీ నా ప్రయత్నాన్ని మీ ముందు పెడుతున్నాను.
“సాయిబాబా వికారం మనకు వద్దు; వద్దు; వద్దు;
సాయిబాబా వికారంతో హైందవాన్ని కోల్పోవద్దు”
– రేపటి సంచికలో సాయిబాబాపై అవగాహన వ్యాసాలలో నా తదుపరి వ్యాసం- 2 మీ ముందుకు రానుంది.
– రోచిష్మాన్
9444012279