ఇలాంటి ఒక మనిషి ఉంటాడా..
ఉన్నాడేమో పురాణాల్లో..
విన్నామేమో అలాంటి మనిషి గురించి చరిత్రలో..
ఒక ఊరి నుంచి ఒక ఊరికి..
ఊళ్లోనే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్లడానికి గూగుల్ మ్యాప్ లో వెతికే మన తరంలో నిన్న మొన్నటి వరకు ఇలాంటి ఒక మనిషి జీవించి ఉన్నాడని వినడమే అబ్బురం..
ఆయన ఎక్కడికి వెళ్లాలన్నా తోవ చూపే దిక్సూచి అవసరం లేదు..
అలాగని ఆయన వెళ్ళేది
నీలా నాలా రోడ్డు మీద కారులో కాదు..
నట్టడవిలో కటిక చీకటిలో..
భయంకరమైన ఎడారుల్లో దారే ఉండని దూరాలకు
ఆయన పయనం..
వంద సంవత్సరాల పాటు..
తను వెళ్లడమే గాక భారత సైన్యానికి దిక్సూచిలా నిలబడిన అపర
దురంధరుడు..
ఇంతకీ ఎవరాయన.. తెలుసుకుందాం రండి..
ఇప్పుడు మనం తెలుసుకుంటున్నది రాంచోడ్ భాయ్ సవాభాయ్ రబారీ గురించి..ఆయన వంద సంవత్సరాలకు పైగా భారత సైనికులకు వెలకట్టలేని సేవలను అందించాడు..ఎలా..
భారత సైనికులు ఎంతో గౌరవంగా పాగి అని పిలుచుకునే రబారికి ఎడారుల ఆనుపానులు తెలుసు..అక్కడ తిరిగే ప్రాణుల గురించి కూడా తెలుసు..అంతేకాదు సైన్యాన్ని తోడుకొని వెళ్లే ముందు ఆ బాటలో ఎంతమంది శత్రు సైనికులు వెళ్లినది.. ఎలా వెళ్ళినది ..
ఎంతసేపటి క్రితం వెళ్ళినది.. ఎన్ని ఆయుధాలు మోసుకు వెళ్లినది కూడా ఆయన జస్ట్ పాదముద్రలు చూసి చెప్పేస్తాడు..
అసలు ఆ పెద్దాయనికి పాగీ అనే పేరు ఎవరు పెట్టారో తెలుసా..సాక్షాత్తూ
మన జవాను హీరో జనరల్ మానెక్ షా.. పాగీ అంటే దారి చూపేవాడని అర్థం..
మానెక్ షాకి..రబీరాకి ఎంత అనుబంధమంటే 2001 లో
ప్రాణాలు విడిచే ముందు కూడా జనరల్ షా పాగి.. పాగి అనే కలవరిస్తూ ఉండేవారట..
పాగీకి తెలిసిన విద్య మన సైన్యంలో గాని..మన గూఢచారి విభాగంలో గాని ఎవరికీ లేదంటే నమ్మి తీరాలి..
ఎందుకంటే భారత దేశ అత్యంత ఉన్నత గూఢచారి విభాగం రా సైతం పాగీ తోడు లేనిదే ఎడారిలో ప్రవేశించేది కాదు..బీఎస్ఎఫ్ కూడా అంతే..
అంతెందుకు..1965లో భారత సైనికులు పది వేల మందిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి అత్యవసరంగా తరలించాల్సి వచ్చింది..అప్పుడు అంతటి పటాలానికి పాగీనే దిక్కయ్యాడు..సైన్యం నిర్దేశించుకున్న గడువు కంటే పన్నెండు గంటల ముందే పాగీ సైన్యాన్ని గమ్యం చేర్చి అందరినీ ఆశ్చర్యపరించాడు..
ఎంత గొప్ప సైనికుడికైనా రిటైర్మెంట్ అనివార్యం. కానీ మన హీరో పాగీకి
పదవీ విరమణ లేదు.. మరణమే ఆయన విరమణ.. అదెప్పుడో తెలుసా..108 సంవత్సరాల వయసులో.. 2013 సంవత్సరం జనవరి 18న..
నిజానికి ఆయన మరణవార్త మాత్రమే కాదు..శతాబ్దకాలం పాటు నిశ్శబ్దంగా పాగీ దేశానికి చేసిన సేవ గురించి ఏ పత్రికా రాయలేదు..ఏ టీవీ ఛానల్ కూడా హైలైట్ చెయ్యలేదు..
ఆయన కారణంగా ఒక దేశం వంద సంవత్సరాల పాటు సురక్షితంగా ఉంది. ప్రశాంతంగా నిద్రపోయింది..
పాగీ భారత దేశ రక్షణ అమ్ముల పొదిలో కనిపించని ఆయుధం.. సురక్షిత అస్త్రం.. అత్యంత శక్తిమంతమైన శస్త్రం..సైన్యం నేర్వని శాస్త్రం..!
భారత ప్రభుత్వం పాగీ నిరుపమాన సేవలకు గుర్తింపుగా సంగ్రామ మెడల్..సమర సేవ స్టార్..పోలీస్ మెడల్ ప్రదానం చెయ్యడం మాత్రమే గాక
ఒక సరిహద్దు చెక్ పోస్ట్ కు ఆయన పేరు పెట్టింది.. ఆయన సాహసోపేత జీవిత గాథ గుజరాత్ బడి పిల్లలకు పాఠ్యాంశంగా ఉంది కూడా..
విన్నారా..
చరిత్ర ఎరుగని వీరుడి గాథ..
విద్య నేర్వని మేధావి కథ..
గుర్తింపు కోరని
మహానుభావుడి చరిత్ర..
భరతజాతి సదా మననం చేసుకోదగ్గ మరో పురాణం..!
– ఎలిశెట్టి సురేష్ కుమార్
9948546286
7995666286