హుద్‌హుద్ విలయం గుర్తుందా?
వైజాగ్ వీధులు ధ్వంసమైన వేళ — ఓ పెట్రోల్ బంకు యజమాని ఆపదను అవకాశంగా మార్చుకున్నాడు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న సీఎం చంద్రబాబు ఒక్క మాటలో తేల్చేశారు — “సీజ్ చేస్తాం.”
బాబు గారి పాలనలో ఇది నిత్యసత్యం: ఉడత ఊపులు ఊపితే తోక కత్తిరిస్తారు. సంక్షోభాన్ని స్వార్థానికి వాడుకోవాలని చూస్తే — ఆయన సహించరు, చూస్తూ ఊరుకోరు.
ఇప్పుడు మళ్ళీ అదే నాటకం — కొత్త వేదికపై.
మిడిల్ ఈస్ట్ యుద్ధం మీద మీడియాలో వార్తలు, సోషల్ మీడియాలో పుకార్లు — ఇవన్నీ ముడిపెట్టి ప్రత్యర్థి పార్టీలు జనంలో భయం నాటాయి. “పెట్రోల్ లేదు! డీజిల్ అయిపోతుంది!” అనే మైండ్ గేమ్ మొదలైంది. జనం పరుగులు తీశారు, స్టాక్ అయిపోయింది — కృత్రిమ కొరత, కావాలనే సృష్టించిన గందరగోళం.
ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్‌కు మాత్రమే పరిమితం కాదు — దేశమంతటా ఇదే ఆట సాగింది.
పౌరసరఫరాల శాఖ మంత్రి తన తండ్రి మరణంతో అంత్యక్రియల్లో నిమగ్నమై ఉన్న వేళ — ఆ శోక సమయాన్ని సైతం వదలకుండా పుకార్లను ఉద్ధృతం చేశారు. రెండు రోజులు సాగించారు. ఒక కుటుంబం దుఃఖంలో ఉంటే, రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడం — ఇది వ్యూహం కాదు, నీచత్వం.
సాక్షి స్క్రోలింగ్ — అమరావతిపై అక్కసు
అక్కడితో ఆగలేదు. “అమరావతి కోసం పెట్రోల్, డీజిల్ నిల్వ చేస్తున్నారా?” అంటూ సాక్షి స్క్రోలింగులు నడిచాయి. గూగుల్ శంకుస్థాపన వేడుక రోజున దృష్టి మళ్ళించడానికి సజ్జలను రంగంలోకి దించారు. అభివృద్ధిని భరించలేని వైకాపా — డైవర్షన్ పాలిటిక్స్‌ను ఆయుధంగా మార్చుకుంది.
రవీంద్ర నుండి ‘ప్రొఫెసర్’ నాకేశ్వర్ రావు వరకు — అక్కడ కడుక్కోకుండా వాగారు, పొరుగు రాష్ట్రాల్లో కూడా ఇదే జరుగుతున్నాయని తెలిసినా.
బావిలో కప్పకు ఆ బావే ప్రపంచం. చెరువులో కప్పకు ఆ చెరువే విశ్వం. కానీ నదీతీరాన పుష్కరఘాటులో ఎంత కోలాహలంగా ఉంటుందో — వాటి ఊహ కూడా అందదు.
పుకార్లతో గంటల్లో గెలిచామని సంబరపడిన ఈ బావిలో కప్పలు ఒక విషయం మర్చిపోయాయి —
విషయం తెలిసి బాబు గారు రంగంలోకి దిగారు. గంటల్లో పరిస్థితి సద్దుమణిగింది.
గూగుల్ ఒక్కరోజు కార్యక్రమం కాదు
గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి పెట్టడం — పత్రికా శీర్షిక కాదు, పునాది. ఇక నిత్యం నిర్మాణ విశేషాలు ఉంటాయి. అమరావతి నిర్మాణం పుకార్లతో ఆగదు, అక్కసుతో వెనక్కి తిరగదు.
బావులు నిండవచ్చు. నదులు ఆగవు. సముద్రాలు ఎండవు.