-బెజవాడలో ప్రధాని భద్రతా ఏర్పాట్ల వైఫల్యంపై కేంద్రం తాఖీదు
-డ్రోన్ ఎగరవేసినా పట్టించుకోరా?
-ప్రధాని మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్
విజయవాడలో ప్రధాని మోదీ రోడ్‍షోలో భద్రతా వైఫల్యంపై కేంద్రం సీరియస్ అయింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి కేంద్ర హోం శాఖ లేఖ పంపించింది. విజయవాడలో ప్రధాని నరేంద్ర మోదీ ర్యాలీకి 45 నిమిషాల ముందు, ర్యాలీ ప్రారంభం, చివరలో డ్రోన్‍లు ఎగురవేయడంపై కేంద్ర హోం శాఖ సీరియస్ అయింది. ప్రధాని రోడ్‍షో ప్రాంతం ముందుగానే నోప్లై జోన్‍గా ప్రకటించినా డ్రోన్లు ఎలా ఎగరగలిగాయాని లేఖలో ప్రశ్నించినట్లు తెలిసింది.వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం లేఖలో పేర్కొంది.