Suryaa.co.in

Entertainment Telangana

వందోసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ

నటుడు మహర్షి రాఘవ రికార్డ్‌
చిరు చేతులమీదుగా ప్రత్యేక సన్మానం

తెలుగు రాష్ట్రాల్లో చిరంజీవి బ్లడ్‌ బ్యాంకుకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. 26 ఏళ్లుగా ప్రాణాపాయంలో ఉన్న లక్షలాది మందికి ఉచితంగా రక్తదానం చేసి ఎందరో ప్రాణాలను నిలబెట్టింది. ఈ బ్లడ్‌ బ్యాంకు కు చిరు అభిమానులు అండగా నిలుస్తున్నారు. వారి సహకారంతోనే నిరంతర సేవలను అందిస్తున్నారు. లక్షలాది మంది రక్త దాతలలో ప్రముఖ నటుడు మహర్షి రాఘవ ఒకరు. మెగాస్టార్‌ చిరంజీవిపై అభిమానంతో 1998 అక్టోబరు 2న చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ స్టార్ట్‌ అయినప్పుడు రక్తదానం చేసిన తొలి వ్యక్తి మురళీమోహన్‌ కాగా రెండో వ్యక్తి మహర్షి రాఘవ. ఇప్పుడు మహర్షి రాఘవ 100వ సారి రక్తదానం చేసి రికార్డు సృష్టించారు. 100వ సారి రక్తదానం చేస్తున్నప్పుడు తాను కూడా వస్తానని అప్పట్లో రాఘవకు చిరంజీవి మాటిచ్చారు. మాట ప్రకారం వచ్చి ఆయనను ప్రత్యేకంగా సన్మానించారు.

LEAVE A RESPONSE