- నీ అయ్య జాగీరు కాదు
- పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్
- తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి
- గద్దరన్నపై పవన్‌వి అహంకారపూరిత వ్యాఖ్యలు
- పవన్ కళ్యాణ్.. గుజరాత్ లో పార్టీ పెట్టుకో
- నువ్వు ఇక్కడ వచ్చి పీకేది ఏంది?
- అక్కడే ఏం పీకలేకపోతున్నావు
- బీజేపీ వాళ్ళు సరిగా స్క్రిప్ట్ రాసిస్తలేరు
- బీజేపీ, బీఆర్ఎస్ ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ ను ఆర్టిస్ట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోండి.
- అనవసరంగా గెలకకు
- గాంధీ భవన్ మీడియా సమావేశంలో జనసేన అధినేత పవన్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
హైదరాబాద్: ఆంధ్రా లో దిక్కు లేదు.. గతంలో ఒక్క సీటు రాలేదు డిపాజిట్ గల్లంతు అయింది. ఇప్పుడు పొత్తులో బీజేపీ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే గెలిచారు. నాకు ఆంధ్రా లోనే దిక్కు లేదు. పవన్ కళ్యాణ్ ఇక్కడ ముఖ్యమంత్రి అవుతారా అని ఆయనే చెప్పారు.
విడిపోయి కలిసిందామని మా నినాదం. యస్ మిస్టర్ పవన్ కళ్యాణ్..ఇది మా అయ్య జాగీరే … నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల అయ్య జాగీరే.. నీ అయ్య జాగీరు కాదు. ముందు తెలంగాణ ప్రజలకు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. చనిపోయిన గద్దర్ గురించి మాట్లాడుతూ నేను కారు కొనిచ్చా అని చెప్తున్నాడు. తెలంగాణ లో ఉన్న దళిత వర్గాలు ఆలోచన చేయాలి..ఆయన అహంకారం.
మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగా పోరాడాం. మా మీద ఏ దురహంకారం, ఆధిపత్యం చెలాయించవద్దని కోరుకున్నామో, అదే ఆధిపత్యం తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు. రాజకీయంగా ప్రజాస్వామ్యంలో భారతదేశం లో తెలంగాణ అంతర్భాగమే. అనేక సందర్భాల్లో తెలంగాణ వాళ్లు ఆంధ్ర కి వెళ్తారు ఆంధ్ర వాళ్ళు తెలంగాణకు వస్తారు. హైదరాబాద్ ను పాకిస్తానా? ఇండియనా అన్నట్టు మాట్లాడుతున్నారు. పాస్ పోర్ట్ తీసుకోవాలా అని మాట్లాడుతున్నారు. మీ మైండ్ సెట్ మార్చుకోండి.
మీరు శాసన సభలో ఉన్నారు..మీకు పార్లమెంట్ గురించి ఐడియా లేదు. పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు అయినప్పుడు, నేను ప్రత్యక్ష సాక్షి. మీకు తెలిసి మాట్లాడుతున్నారా? తలుపులు వేసి తెలంగాణ బిల్లు తెచ్చుకున్నారు అని మాటలు మాట్లాడుతూనే పవన్ కళ్యాణ్ తెలంగాణపై అక్కసు కక్కుతున్నారు.
తెలంగాణ మీద ప్రేమ ఉంది అంటున్నారు. తెలంగాణకు మద్దతుగా ఎప్పుడైనా మాట్లాడారా? తెలంగాణ అమరవీరులు చనిపోతుంటే ఎప్పుడైనా సంఘీభావం తెలిపావా? మీరు ధైర్యంగా ఉండండి పోరాడి తెలంగాణ తెచ్చుకోండి అని చెప్పావా?
అవహేళన చేశావు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పిన వాడివి. తెలంగాణ ఏర్పాటును అవమానించిన వ్యక్తివి. మీరు మాట్లాడితే ఎట్లా?
రాజకీయంగా వక్ర భాషా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పెయిడ్ ఆర్టిస్ట్. నా దగ్గర డబ్బులు ఉంటే నేను కూడా ఆయనకు పాత్ర కు ఎంగేజ్ చేసి మాట్లాడించే అవకాశం ఉండేది.. ఆయనకు వచ్చే చిట్టీలు బిజెపి నుండి వస్తున్నాయా? టిఆర్ఎస్ నుండి వస్తున్నాయా తెలుస్తలేదు.
చంద్రబాబు నాయుడు ..తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకునే వాతావరణం కలుగజేస్తున్నాం. మీరు కొండగట్టు వస్తే తెలంగాణ గెస్ట్ గా ప్రోటోకాల్ ఇచ్చాం. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్రజలకు శుభాకాంక్షలు చెప్తూ, ఇది ప్రజల ఆకాంక్ష నెరవేర్చుకున్న రోజు అని కోరు.
నవ నిర్మాణ సభ అని ఏం చేస్తావు? నువ్వు ఇక్కడ వచ్చి పీకేది ఏంది? అక్కడే ఏం పీకలేకపోతున్నావు. బీజేపీ వాళ్ళు సరిగా స్క్రిప్ట్ రాసిస్తలేరు. బీజేపీ, బీఆర్ఎస్ ఎవరో ఒకరు పవన్ కళ్యాణ్ ను ఆర్టిస్ట్ గా ఎంగేజ్మెంట్ చేసుకోండి. 2009,2014 ఎన్నికల తిరిగిన జనం వస్తుండొచ్చు. ప్రేక్షకులుగా నటుడిని గౌరవిస్తూ ఈలలు కొడుతుంటే, అదంతా నా బలం అనుకుంటే ఏం చేస్తాం?
మీరు ఆంధ్రాలోనే గెలవలేకపోయారు ఇక్కడ ఏంది? పవన్ కళ్యాణ్ తెలంగాణకు రావడానికి, పోవడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవు. కానీ ఆవిర్భావ దినోత్సవం రోజు గెలికి, నవ నిర్మాణ సభ పెడతా అంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. తెలంగాణ మా అయ్య జాగిరే..నీ అయ్య జాగీరు కాదు అనే మాట స్పష్టంగా చెప్పడానికి తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఎప్పుడు స్వాగతం పలుకుతుంది. ఎప్పటికీ వ్యతిరేకం కాదు.
రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ విగ్రహాల ప్రస్తావన తెచ్చిన పవన్ కళ్యాణ్ ఎంత దైర్యం.. అహంకారం? పవన్ కళ్యాణ్ తెలంగాణ లో తిరుగుతుంటే ఎవరు వద్దన్నారు? తక్షణమే గద్దర్ ఆత్మకు క్షమాపణలు చెప్పాల్సిందే. ఆ అంశం మీద అన్ని వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
తెలంగాణ లో ఆంధ్రావాల్లకి పని లేదని మేము అనడం లేదు. ఇది ఫెడరల్ సిస్టమ్. ఇది హైదరాబాద్. అని భాషల వాళ్ళు ఉంటారు. అనవసరంగా గెలకకు. పవన్ కళ్యాణ్.. గుజరాత్ లో పార్టీ పెట్టుకో.