Home » మన పాటను పక్క రాష్ట్రం వాళ్ళు పాడటం ఏమిటి?

మన పాటను పక్క రాష్ట్రం వాళ్ళు పాడటం ఏమిటి?

-జయ జయహే తెలంగాణకు కీరవాణి సంగీతం
-ఆక్షేపించిన తెలంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్

హైదరాబాద్: తెలంగాణ కవి అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ గీతాన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రగీతంగా ప్రటించింది. ఈ నేపథ్యంలో ఆ పాటను ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణికి ఇవ్వాలన్న నిర్ణయంపై తెలంగాణ సినీ మ్యుజూషియన్ అసోసియేన్ ఆక్షేపణ వ్యక్తం చేసింది.

పక్క రాష్ట్రానికి చెందిన కీరవాణికి ఆ బాధ్యతలు అప్పగించడం అంటే తెలంగాణను అవమానించడమేనని స్పష్టం చేసింది. అసలు గత కేసీఆర్ ప్రభుత్వమే ఆ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తే బాగుండేదని, కానీ గత సర్కారు ఆ విషయంలో తప్పు చేసిందని వ్యాఖ్యానించింది. తెలంగాణలో ఎంతోమంది కళాకారులున్నందున, వారికే ఆ అవకాశం ఇచ్చి చేసిన పొరపాటు సరిదిద్దుకోవాలని కోరింది.

జయ జయాహే తెలంగాణ.. పాటకి సంగీత దర్శకులు కీరవాణి సంగీతాన్ని అందించమని కోరటం చారిత్రక తప్పిదం అవుతుంది.. తెలంగాణ అస్తిత్వం మీకు తెలియంది కాదు, తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందో మీకు తెలియంది కాదు, మన ఉద్యోగాలు మనకే రావాలి, మన అవకాశాలు మనకే కావాలి అనే నినాదంతో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది.. సకల జనుల సహకారంతో ఎంతో మంది అమర వీరుల త్యాగ ఫలంగా ఏర్పడింది మన తెలంగాణ రాష్ట్రం.. ఇంతటి ఖ్యాతి గడించిన మన రాష్ట్ర గీతాన్ని పక్క రాష్ట్రాల వాళ్ళు పాడటమేంటి..?

అలా చేయడం అంటే మన తెలంగాణ కళాకారులని అవమానించడమే అవుతుంది.. ఎంతో ప్రతిభావంతులు మన తెలంగాణాలో ఉన్నారు.. మన తెలంగాణ కళాకారులకు ఈ గొప్ప అవకాశాన్ని ఇచ్చి తెలంగాణ కళాకారులకి గౌరవాన్ని ఇస్తారని ఆశిస్తున్నాం.

Leave a Reply