Suryaa.co.in

Political News

ప్రజాస్వామ్య మృగాల మధ్య బ్రతుకుదామా?

ఎన్నికల కమీషనర్ గారికి,
ప్రజాస్వామ్యం లో గెలిచి, దానినే దాణాలా భావించి తిని బలిసి, మృగంలా మారి, “ఓటరు తీర్పునే నేలకేసి కొడుతుంటే”
మీ ఎన్నికల వ్యవస్థ చోద్యం చూస్తుంటే,..
సహించ లేని జనం తిరగబడితే..,
వారి మీదా రంకెలు వేస్తూ పొడుస్తుంటే..
తీరికగా వట్టి కేసులు కట్టి, బెయిలు తీసుకొనే వరకు మన వ్యవస్థలు ఆ మృగానికి రక్షణగా నిలిచాయా?⁉️
ఏమాత్రం ప్రజాస్వామ్యంపై మీ ఎన్నికల వ్యవస్థకు చిత్తశుద్ధి వున్నా…..,
బెయిలు రద్దుకు అప్పీల్ చెయ్యండి.
లేదంటే ఆ మృగం మీద తిరగబడిన ప్రజలనే అరెస్ట్ చేయించి, జైళ్లలో వేయించి ప్రజల ప్రాణాలను అలాగైనా కాపాడండి.
అలాంటి మృగాల కోసం మన వ్యవస్థలు వున్నాయని, ఈ ప్రజలు ప్రజాస్వామ్యం న్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నించి, మరెప్పుడూ ఇలా సహించలేని ఆలోచనలు చెయ్యరు.
నిర్ణయం మీది కమీషనర్ గారు.

ఒకే ఒక్క సారి ఆలోచించండి.
మన మీదో.. మన బంధువుల మీదో వాహనాన్ని నడిపితే ఎలా వుంటుందో…
ఓటేసి పొలాల్లో దాక్కొనే దౌర్భాగ్య పరిస్థితిలో ఓటర్లుండడం ఎంత దయనీయం.
మృగాల చేత రంకెలు వేయిస్తూ.. ఓటర్లను పొడిచే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కట్టడి చేయలేని మనం, జనం సొమ్ములను జీతాలుగా తీసుకొంటూ ఈ పదవుల్లో వున్నామా అని ఆలోచించండి.

ఇట్లు
ప్రజాస్వామ్య మృగాల మధ్య బ్రతికే వున్న ఓ ఓటరు

– తీగల రవీంద్ర

LEAVE A RESPONSE