Home » Crime News

అక్రమ సంబంధం నేపథ్యంలో పోలీసు అధికారిపై పోక్సో కేసు నమోదు

వరంగల్: కాకతీయ యూనివర్సిటీ పోలీస్టేషన్ లో గతంలో ఎస్సైగా పనిచేసి ప్రస్తుతం సీఐగా భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారి బండారు సంపత్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు కేయూ పోలీస్ అధికారి తెలిపారు. 2022 లో కేయూ పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదరు పోలీస్ అధికారి కేయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండే ఒక మహిళతో అక్రమ సంబంధం ఇంకా కొనసాగిస్తున్నారన్న సమాచారంతో సదరు…

Read More

నిందితులకు సహకరిస్తున్న నలుగురు అరెస్ట్‌

ఆన్‌లైన్‌ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితులకు సహకరిస్తున్న నలుగురు నిందితులను సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సైబర్‌ క్రైం నిందితులకు వివిధ బ్యాంక్‌ ఖాతాలు అందిస్తున్న సురేంద్ర, నరేష్‌ బాబును అరెస్ట్‌ చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. సైబర్‌ క్రైమ్‌ నిందితులకు వివిద బ్యాంకుల్లో ఉన్న 8 ఖాతాలను కమిషన్‌ తీసుకొని నిందితులు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది. దేశవ్యాప్తంగా 83 కేసుల్లో 5 కోట్ల…

Read More

జంటహత్యల కలకలం

కాకినాడ: వివాహేతర సంబంధం కారణంగా కాకినాడ జిల్లాలో జరిగిన జంటహత్యలు కలకలం రేపాయి. ఈ సంఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. మృతులు పొలం వద్ద కలిసి ఉన్నారనే పక్కా సమాచారంతో ప్రత్యర్థి లోక నాగబాబు పథకం ప్రకారం కత్తితో దాడి చేసి హతమార్చినట్లు డీఎస్పీ హనుమంతరావు తెలిపారు. గత కొంతకాలం నుంచి లోక నాగబాబుతో సహజీవనం చేస్తున్న…

Read More

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కేసు రీ ఓపెన్

బీఆర్‌ఎస్ హయాంలో కవిత అనుచరుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కు బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. మార్చి 17- 2022లో రోడ్ నెంబర్ 45లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న 2 ఏళ్ల బాలుడుపై కారు దూసుకెళ్లింది. బాలుడిని ఢీ కొట్టిన కారు మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మీర్జా ఇన్‌ఫ్రా…

Read More

నలుగురి ప్రాణాలు తీసిన రిపోర్టర్లు!

– 25 లక్షలు కావాలని బ్లాక్‌మెయిల్ టంగుటూరు : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరు గ్రామంలో ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. మృతుడు నీరటి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా నీరటి రవి అనే వ్యక్తిని ఐదుగురు రిపోర్టర్లు ఒక హోమ్ గార్డ్ 25 లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్ చేయగా తన ముగ్గురు కొడుకులను…

Read More

భార్య కళ్ళ ఎదుట భర్త పాశవిక హత్య

నెల్లూరు జిల్లా రామచంద్రాపురంలో ప్రసాద్‌ అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. భార్య నోట్లో గుడ్డలు కుక్కిన కొందరు గుర్తుతెలియని యువకులు.. ఆమె ఎదుటే భర్తను చిత్రహింసలకు గురిచేసి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. శరీరంపై 25కు పైగా కత్తిపోట్లు ఉన్నట్లు గుర్తించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు ఆధారాలు సేకరించాయి. పాత కక్షల కారణంగానే ఈ హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు…

Read More

కిలాడి బ్యాంక్‌ మేనేజర్‌

బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్న కిలాడి బ్యాంక్‌ మేనేజర్‌ కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం గంగూరు యూనియన్‌ బ్యాంకు శాఖ మేనేజరుగా పనిచేస్తున్న దావులూరి ప్రభావతిపై పెనమలూరు పోలీసులు చీటింగ్‌ కేసు నమోదు చేశారు. బ్యాంక్‌ మేనేజర్‌ బ్యాంకులో కుదువ పెట్టిన బంగారంతో వడ్డాణం చేయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. గతంలోనూ పలువురిని మోసం చేసి గంగూరు యూనియన్ బ్యాంక్ మేనేజర్ డబ్బులు గుంజినట్లు పేర్కొన్నారు. గంగూరు బ్యాంకు మేనేజరుపై పెనమలూరు పోలీసుల కేసు నమోదు…

Read More

ఏపీసీఐడీ పేరుతో ఐటీ కంపెనీ ఓనర్ కిడ్నాప్

– హైదరాబాద్ పోలీసుల దర్యాప్తు లో తేలిన ఎవరూ ఊహించని నిజం – నకిలీ గ్యాంగ్ కి లీడర్ ఏపీ లో కర్నూల్ డి ఐ జి ఆఫీస్ లో పనిచేసే ఎస్‌ఐ…అరెస్ట్ (శివ శంకర్. చలువాది) ఏపీ సీఐడీ అధికారులు రాజకీయ నేతల్ని అరెస్ట్ చేసే తీరును ఉపయోగించుకుని కిడ్నాప్‌కు పాల్పడుతున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీసీఐడీ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని ఐటీ కంపెనీల యజమానుల్ని కిడ్నాప్ చేసి…

Read More

హెచ్‌ఎండీఏలో బాలకృష్ణుడి అవినీతి లీలలు

– ఏసీబీకి చిక్కిన హెచ్‌ఎండిఏ పెద్ద గద్ద – బీఆర్‌ఎస్ సర్కారులో బాలకృష్ణదే హవా – పాలకులతో చెట్టపట్టాల్ – వందకోట్ల సంపాదన ఎలా సాధ్యం? – ఒక అధికారి సంపాదనే వందకోట్లా? – మరి పెద్ద గద్దల సంపాదన ఎంతో? ఆయన హెచ్‌ఎండిఏలో ఒక కీలక అధికారి. బీఆర్‌ఎస్ పాలనలో ఆయన చెప్పిందే వేదం. ఆయన మాట శిలాశాసనం. తాజాగా ఆయన ఇంటిపై తెలంగాణ ఏసీబీ జరిపిన దాడిలో, వందకోట్ల రూపాయల అక్రమ సంపాదన బయటపడింది….

Read More

ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్

– పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇన్స్టాగ్రామ్, ఎక్స్ ఖతాలు హ్యాక్ కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్ కు యత్నించారు. అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి దుండగులు ఇన్స్టాగ్రామ్ ఖాతాలో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు. వెంటనే గుర్తించిన కవిత  తన సోషల్ మీడియా ఖాతాలు…

Read More