నిందితులకు సహకరిస్తున్న నలుగురు అరెస్ట్‌

ఆన్‌లైన్‌ ట్రేడింగ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నిందితులకు సహకరిస్తున్న నలుగురు నిందితులను సైబర్‌ క్రైం పోలీసులు అరెస్టు చేసిన సంఘటన గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సైబర్‌ క్రైం నిందితులకు వివిధ బ్యాంక్‌ ఖాతాలు అందిస్తున్న సురేంద్ర, నరేష్‌ బాబును అరెస్ట్‌ చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపారు. సైబర్‌ క్రైమ్‌ నిందితులకు వివిద బ్యాంకుల్లో ఉన్న 8 ఖాతాలను కమిషన్‌ తీసుకొని నిందితులు సహకరించినట్లు పోలీసుల విచారణలో వెలుగుచూసింది.

దేశవ్యాప్తంగా 83 కేసుల్లో 5 కోట్ల ఈ ఖాతాల ద్వారా లావాదేవీలు జరిగినట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించామన్నారు. మరో కేసులో క్రిప్టో ఎక్స్చేంజ్‌ ట్రేడింగ్ బిజినెస్‌లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయి అంటూ నిందితులు ప్రచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. సైబర్‌ క్రైమ్‌ నిందితులకు సహకరించిన సాయి గౌడ్‌, సాయికుమార్‌, ఇద్దరినీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. దేశవ్యాప్తంగా 45 కేసుల్లో 13 కోట్లు స్వాహా చేసిన సైబర్‌ క్రైమ్‌ నిందితులపై మూడు కేసులు తెలంగాణ పరిధిలో జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితులపై కేసులు నమెదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Leave a Reply