Suryaa.co.in

Crime News Telangana

మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కేసు రీ ఓపెన్

బీఆర్‌ఎస్ హయాంలో కవిత అనుచరుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కు బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీ ఓపెన్ చేశారు. మార్చి 17- 2022లో రోడ్ నెంబర్ 45లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న 2 ఏళ్ల బాలుడుపై కారు దూసుకెళ్లింది. బాలుడిని ఢీ కొట్టిన కారు మాజీ ఎమ్మెల్యే షకీల్‌కు చెందినదిగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మీర్జా ఇన్‌ఫ్రా పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కానీ షకీల్‌పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. రోడ్డుపై బెలూన్స్ అమ్ముకొనే కుటుంబం రోడ్డు దాడుతుండగా ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కారుపై ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్ ఉన్నట్లు గుర్తించారు. అది తన కారు కాదని.. స్టిక్కర్‌ను తన స్నేహితుడికి ఇచ్చినట్లు అప్పట్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ చెప్పారు.

ఆ కారు ప్రమాదంలో డ్రైవ్ చేసిన వ్యక్తిని కాకుండా మరొకరిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పుడు మరో సారి కేసును రీ ఓపెన్ చేశారు.గతంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నందున, పోలీసులు ఆయనను రక్షించే ప్రయత్నం చేసి, తర్వాత వారే చిక్కుల్లో పడ్డారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో షకీల్‌కు ఇబ్బందులు తప్పేలా లేదు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత షకీల్ కొన్నాళ్లు పారిపోయిన అంశం చర్చనీయాంశమయింది.

LEAVE A RESPONSE