Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రెడ్డి పోలవరం విధ్వంసంతో జాతికి ద్రోహం

-ప్రజావేదిక విధ్వంసతో ప్రారంభమైన జగన్ రెడ్డి పాలన -డయఫ్రం వాల్ విధ్వంసంతో ముగిసింది
-టీడీపీ నీటి పారుదల రంగంలో చేసిన పనులకు ఎన్నో అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది
-పోలవరానికి కేంద్రం ఇచ్చిన రూ.2,500 కోట్ల నిధులు -నిర్వాసితులకు ఇవ్వకుండా దారి మళ్లించారు
-మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

రాష్ట్ర విభజన చట్టంలో జాతీయ ప్రాజెక్టుగా గుర్తించబడి 100 శాతం నిధులతో కేంద్ర ప్రభుత్వమే నిర్మాణం చేసే ప్రాజెక్టును ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూర్ఖత్వం, నిర్లక్ష్యం, దోపిడీ కార్యక్రమంలో భాగంగా, రివర్స్ డ్రామా తో ప్రజావేదిక విధ్వంసతో ప్రారంభమైన జగన్ రెడ్డి పాలన డయఫ్రం వాల్ విధ్వంసంతో పరిపాలన ముగిసింది. జాతీయ ప్రాజెక్టు పోలవరం నాశనం చేసి జాతికి ద్రోహం చేశారు.

బహుళార్ధక సాధకప్రాజెక్టు 960 మె.వా. జలవిధ్యుత్, 50 లక్షల ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సాగు చేసుకునే ప్రాజెక్టు. టీడీపీ అధికారంలోకి రాకముందు కాలవల మట్టి పనులకే పరిమితం చేశారు. 5 శాతం పనులు పూర్తి కాలేదు.

7 ముంపు మండలాల నిర్వాసితుల డబ్బులు తినేశారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్లకు రూ.115 కోట్లు పరిహారం చెల్లించి, కేంద్ర పెద్దలతో ఒప్పించి, పనులు త్వరగా అవ్వడానికి కేంద్రం ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పనులు చేపట్టింది. ప్రతి సోమవారం పోలవరంగా గుర్తించాం. 28 సార్లు ప్రాజెక్టు సందర్శనం, 82 సార్లు వర్చువల్ ఎన్ స్పెక్షన్ దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇన్ని సార్లు ఒక ప్రాజెక్టును సందర్శించి ఉండరు. రాష్ట్రంలో కరువు విలయ తాండవం చేయకుండా ప్రతి కాలువకు, ప్రతి చెరువుకు నీళ్లు వెళ్లే విధంగా పోలవరం పనులు ముమ్మరం చేశాం.

5 శాతం అవ్వన్ని పనులను 72 శాతం పూర్తి చేశాం. దాదాపు 11,923 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ 5 ఏళ్లల్లో రూ.5,825 కోట్లు మాత్రమే పనులు చేశారు. 15 నెలలు డయాఫ్రం వాల్ పనులు ఉద్దేశ్యపూర్వకంగా దెబ్బతీశారు. మొదటి జలవనరుల శాఖా మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ బుల్లెట్ దిగిందా అని అహాంకార పూరితంగా మాట్లాడారు. రెండో మంత్రి వచ్చి పోలవరం అంటే చేతులెత్తేసి, డ్యాన్సులు చేస్తున్నారు. పోలవరం ఎప్పుడు కడతాం, ఏం పనులు జరుగుతున్నాయో చెప్పే చిత్తశుద్ధి, రైతుల పట్ల ఏ మాత్రం అంకితభావం లేదు. ఇద్దరు మంత్రులు జగన్ రెడ్డి కనుసన్నల్లో చేతగాని అసమర్ధుల్లా మారి ముగ్గురు పోలవరాన్ని ముంచేసి జాతికి ద్రోహం చేశారు.

కరువు బారిన పడే రాయలసీమను కాపాడాలని హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ, ముచ్చుమర్రి, పట్టిసీమ వంటి ప్రాజెక్టుల పనులు పరుగెలెత్తించాం. ఆ పనులు కూడా జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు. పక్క రాష్ట్రంలో జగన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిని గెలిపించుకోవాలన్న ఉద్దేశ్యంతో రాయలసీమకు వెళ్లాల్సిన నీటిని పక్క రాష్ట్రనికి ఇచ్చిన తెలివితక్కువ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. సీఆర్పీఎఫ్ కి నాగార్జున సాగర్ డ్యాంను అప్పగించిన ప్రబుద్దులు వైసీపీ నాయకులు. శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాంల్లో ఎంత నీళ్లు ఉన్నాయి, ఏ ప్రాజెక్టుకు ఎంత నీళ్లు వెళ్లాయి, ఎంత నీళ్లు ఇవ్వాలో జగన్ రెడ్డి తెలుసా? చంద్రబాబు నాయుడు కుప్పం వరకు నీళ్లు తీసుకువెళ్లారు.

జగన్ రెడ్డి 58 నెలల పాటు పనులు చేయకుండా రూ.30 కోట్లు ఖర్చు చేసి గేట్లు ఎత్తి తరువాత ఎత్తికెళ్లారు. కుప్పం గేట్లు మూన్నాళ్ల ముచ్చటగా సాగాయి. జలవనరుల రంగాన్ని నిర్వీర్యం చేశారు. ఏ ప్రాజెక్టులో ఏ స్థాయిలో పనులు అయ్యాయో మేము పుస్తకం వేసి సమాచారాన్ని ప్రజలకు అందించాం. 62 ప్రాజెక్టులు పరిగెత్తించి 23 ప్రాజెక్టులు పూర్తి చేశారు. రూ.68, 293 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ రెడ్డి రూ.35,268 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క ప్రాజెక్టుకు నీళ్లివ్వలేదు. రైతు కన్నీరు పెట్టకూడదు, రైతు కష్టం ఉండకూడదని ప్రతి ఎకరాకు నీళ్లందించేందుకు చంద్రబాబు కృషి చేశారు.

మేము చేసిన పనులకు సాగు నీటి విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. నీటి పారుదల రంగాల్లో ఎన్నో అవార్డులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. నీటి సంఘాలు, నీరు చెట్టు, నీరు ప్రగతిని నాశనం చేశారు. జగన్ రెడ్డి ఖర్చు పెట్టిన దానిల్లో డబ్బులు అన్ని ఏమయ్యాయి? సంగం, నెల్లూరు బ్యారేజీకి గత ప్రభుత్వాలు పనులు పూర్తి చేస్తే రూ.200 కోట్లు ఖర్చు పెట్టి శిలాఫలకాలు వేసుకున్నారు. ఉత్తరాంధ్రలో నాగావళి – వంశధార పనులు ఏమయ్యాయి? ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు.

వంశధారి స్టేజ్ -2, ఫేజ్ -2 లో రూ.871 కోట్లు ఖర్చు పెట్టాం. తోటపల్లి బ్యారేజీకి రూ.236 కోట్లు ఖర్చు పెట్టాం, గజపతి బ్రాంచ్ కెనాల్ కు రూ.48 కోట్లు ఖర్చు పెట్టాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని నాశనం చేశారు. పోలవరం రైట్ కెనాల్ కు రూ.1655 కోట్లు ఖర్చు పెట్టాం. ఎడమ కాలువకు, పురుషోత్తమ పట్నం లిఫ్ట్ కు రూ.1,578 కోట్లు ఖర్చు పెట్టి జాతికి అంకితం చేశాం. చంద్రబాబుకు పేరు రాకూడదని కోర్టు లిటిగేషన్ లో పెట్టారు.

పట్టిసీమను నాలుగున్నరేళ్లు పట్టించుకోలేదు. టీడీపీ డిమాండ్ చేస్తే ఆఖరి క్షణంలో నీళ్లు వదిలారు. పోలవరం డ్యాంకు వెళ్లనీయ్యకుండా అడ్డుకున్నారు, అరెస్ట్ లు చేశారు. టీడీపీ హయాంలో పోలవరం ప్రాజెక్టులు సందర్శించేందుకు లక్షల మంది వెళ్లారు. కాని జగన్ రెడ్డి మమ్మల్ని చూడనివ్వడం లేదు. ఇక ప్రజలను ఏం చూడనిస్తారు. ఎందుకంటే ప్రజలు చూస్తే జగన్ రెడ్డి బొక్కలు భయటపడతాయని భయపడుతున్నారు. చింతలపూడి లిఫ్ట్ కు రూ.4వేల కోట్లు ఖర్చు పెట్టాం. పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 10 నియోజకవర్గాలు, 10 లక్షల ఎకరాలకు నీళ్లు వెళ్లే చింతలపూడిని నిర్వీర్యం చేసింది.

పులిచింతల్లో రూ.1,174 కోట్లు టీడీపీ ఖర్చు చేస్తే జగన్ రెడ్డి హాయంలో గేట్లు కొట్టుకుపోతే పట్టించుకోలేదు. అన్నమయ్య, ఫించా ప్రాజెక్టులు, గుండ్లకమ్మ ప్రాజెక్టులు కొట్టుకుపోతే ఇంత వరకు చర్యలు లేవు. నాగార్జున ఆధునీకరణ పనులకు రూ. 2,495 కోట్లు ఖర్చు పెట్టాం. కాని మీరు కనీసం నీళ్లు కూడా ఇవ్వలేకపోయారు. ఈ రోజు డ్యాంలు జగన్ రెడ్డి కనుసన్నల్లో ఉన్నాయా? కేఆర్ఎంబీ విశాఖలో పెట్టామన్నారంటే జగన్ రెడ్డికి బుర్ర ఉందా? రాష్ట్ర రైతాంగానికి జగన్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? సాగునీటి రంగం మీద జగన్ రెడ్డికి అవగాహన లేదు.

గుండ్లకమ్మకు రూ.81 కోట్లు ఖర్చు పెట్టాం. వెలిగొండకు రూ.1,400 కోట్లు ఖర్చు పెట్టాం. 2024లో వెలిగొండ టన్నల్స్ పనులు పూర్తి చేసి ప్రకాశం జిల్లా రైతాంగానికి నీళ్లు ఇచ్చి చంద్రబాబు జాతికి అంకితం ఇస్తారు. నీళ్లు ఇవ్వకుండా వెలిగొండ ప్రాజెక్టుకు ఎలా జాతికి ఇస్తారు? నీళ్లిచ్చి జాతికి అంకితం ఇవ్వడం చూశాం. కాని కాలవల్లో నీళ్లు పారకుండా జాతికి అంకితం ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఒక్కడే. తెలుగు గంగకు రూ.504 కోట్లు ఖర్చు పెట్టాం. బద్వేల్ సాగర్ కు కూడా నీళ్లు తీసుకువెళ్లలేని దద్దమ్మ జగన్. సోమశిల, స్వర్ణముఖి పనులు నిలిపివేశారు.

సోమశిల ప్రాజెక్టుకు రూ.300 కోట్లు, సోమశిల హైలెవెల్ కెనాల్ కు రూ.500 కోట్లు ఖర్చు పెట్టాం.
గాలేరు నగరి ఫేజ్ 1 కి రూ.1,420 కోట్లు, ఫేజ్ 2 కిరూ.123 కోట్లు ఖర్చు పెట్టాం. జగన్ రెడ్డి ఏం ఖర్చు పెట్టాం. గండికోటలో నీళ్లు నిలబెట్టి పులివెందుల ప్రాంతానికి నీళ్లు ఇచ్చిన ఘనత చంద్రబాబుది. ఎస్ఆర్బీసీ కి రూ.250 కోట్లు, హంద్రీనీవా కు రూ.5,570 కోట్లు ఖర్చు పెడితే జగన్ రూ.1,657 కోట్లు ఖర్చు పెట్టారు. రాయలసీమ ద్రోహి జగన్ రెడ్డి కాదా?

రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏమయ్యాయి? జగన్ రెడ్డి వరకు కృష్ణమ్మ నీటిని, బచావత్ ట్రిబ్యునల్ హక్కులను తాకట్టు పెట్టారు. నాడు సమస్య వచ్చినప్పుడు కేంద్ర జలశక్తి మంత్రి ఉమాభారతి ఆధ్వర్యంలో చంద్రబాబు, నేను ఒక పక్షం, కేసీఆర్, హరీష్ రావు మరో పక్షం కూర్చొని ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణ కు. 299 టీఎంసీలకు ఇచ్చేలా సంతకాలు పెట్టించాం కాబట్టి నేడు ఆంధ్ర హక్కులను కాపాడగలిగాం.

ఇరిగేషన్ రంగంలో స్వర్ణయుగం నడిచింది. కుంగిపోయిన ప్రాజెక్టులు తెలంగాణలో, పరిగెత్తిన ప్రాజెక్టులు ఏపీలో ఉన్నాయి. మహేంద్రతనయ రూ.246 కోట్లు ఖర్చు చేస్తే జగన్ రెడ్డి పెట్టిన ఖర్చు రూ.26 కోట్లు మాత్రమే. తారకరామ తీర్ధ సాగర్ రూ.103 కోట్లు, కిరిశపాడు రూ.20 కోట్లు, కేసీకెనాల్ లిఫ్ట్ రూ.34 కోట్లు, ఏలేరు రూ.46 కోట్లు ఖర్చు పెట్టాం. డెల్టా ఆధునీకరణలో రూ.813 కోట్లు ఖర్చు పెడితే, జగన్ రెడ్డి పెట్టిన ఖర్చు రూ. 123 కోట్లు, కృష్ణ ఆధునీకరణలో రూ.1239 కోట్లు ఖర్చు పెడితే జగన్ రెడ్డి పెట్టిన ఖర్చు రూ. 326 కోట్లు.

తుంగభద్ర హెచ్ఎల్సీ కింద రూ.113 కోట్లు ఖర్చు పెడితే, జగన్ రెడ్డి పెట్టిన ఖర్చు రూ. 17 కోట్లు మాత్రమే. కాన్పూర్ కెనాల్ ఆదునీకరణ పనులకు రూ. 45 కోట్లు ఖర్చు పెడితే జగన్ రెడ్డ రూ.6 కోట్లు ఖర్చు పెట్టారు. మోడరైనేజేషన్ ఎంపీఎస్సీకి రూ.148 కోట్లు ఖర్చు పెడితే జగన్ రెడ్డి రూ.55 కోట్లు ఖర్చు పెడతానికి చేతులు రాలేదు. గోదావరి ఫ్లడ్ బ్యాంక్ కి రూ.236 కోట్లు ఖర్చు పెడితే జగన్ రెడ్డి రూ. 6 కోట్లు ఖర్చు పెట్టారు. కృష్ణ ఫ్లడ్ బ్యాంక్ కు రూ.327 కోట్లు ఖర్చు పెడితే జగన్ రెడ్డి రూ. 24 కోట్లు పెట్టారు. 5 ఏళ్లల్లో జగన్ రెడ్డి జలవనరుల ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారు. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు.

పోలవరం రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి రూ.730 కోట్లు ఆదా చేసానని చెప్పి రూ.4వేల కోట్ల పనుల అంచనాలు పెంచుకున్నారు. అక్టోబర్ 2020 వచ్చిన వరదలకు డయాఫ్రం వాల్ దెబ్బతిందని నీతిఆయోగ్ నియమించిన ఐఐటీ హైదరాబాద్ స్పష్టం చేసింది. నిర్వాసితులను గోదావరి ముంచి కేంద్రం ఇచ్చిన డబ్బులను రూ.2,500 కోట్లు నిర్వాసితులకు ఇవ్వకుండా దారి మళ్లించారు. రంపచోడవరం, పోలవరం నియోజకర్గంలో ఓట్లు అడిగే హక్కు జగన్ రెడ్డికి లేదు.

LEAVE A RESPONSE