- కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష
- మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
- తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించి న మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి
సూర్యాపేట జిల్లా: కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష. ప్రాణాలు లెక్కచేయకుండా పోరాడి రాష్ట్రాన్ని సాధించిండు. అందుకే కెసిఆర్ ను ప్రజలంతా జాతిపితగా పిలుస్తుండ్రు. అది తట్టుకోలేని కాంగ్రెస్, బీజేపీ నాయకులు విషం కక్కుతుండ్రు. పదవులను సైతం పక్కనపెట్టి రాష్ట్ర సాధనకై ముందుకు నడిపిన గొప్పనేత కెసిఆర్.
ఎట్లున్న తెలంగాణ ఎట్లా అభివృద్ధి చెందిందో ప్రజలు ఎప్పటికీ మరిచిపోరు. ఆంధ్రా పాలకుల హయాంలో ఉద్యోగులు తెలంగాణ యాస మాట్లాడాలంటేనే బయపడ్డరు. తెలంగాణ ఏర్పడితే చీకటి బతులైతయని అందరినీ బయపెట్టిండ్రు. ఉమ్మడి పాలనలో తెలంగాణ పదం అంటేనే భయపడే పరిస్థితి.
ఆంధ్ర కుట్రదారులు, దళారులు పన్నాగాలతో ఎన్నోసార్లు తెలంగాణను అడ్డుకున్నరు. మొక్కవోని ధైర్యంతో.. ఉక్కు సంకల్పంతో తెలంగాణ కోసం ఒక్కడిగా బయల్దేరిన కేసీఆర్. ఎన్నో ఉద్యమాలు చేసి కోట్ల గొంతులను ఏకం చేసి పోరాడిన ఘనత ఆయనది. ఉమ్మడి పాలకుల కుట్రలు చేధించి.. రానేరాదనుకున్న తెలంగాణ సాదించిండు.
వస్తదో రాదో అనుకున్న కరెంటును పోనే పొదనుకునే విదంగా ఇచ్చిండు. రైతాంగం తో పాటు అన్ని రంగాల వినియోగదారులకు 24 కరెంట్ ఇచ్చి చరిత్ర సృష్టించిండు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలో ఉన్న ఏ రాష్టంలో కూడా 24 గంటల కరెంట్ ఇవ్వలేదు. ఈ విషయంలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత కెసిఆర్ దే.
ధాన్యం, పాలు, చేపలు, మాంసం ఇలా అన్నీ రంగాల ఉత్పత్తిలోనూ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిండు. కాంగ్రెస్ మాయమాటలకు, అమలుచేయలేని హామీలకు మోసపోయి గోసపడుతున్నరు. కేసీఆర్ ను దూరం చేసుకున్నామన్న బాధతో ప్రజలంతా పశ్చాత్తపడుతున్నారు.
రెండున్నరేండ్లుగా కాంగ్రేస్ అరాచకాలు తప్ప.. చేసిన అభివృద్ధి ఏమీ లేదు. కెసిఆర్ పథకాలన్నీ దూరమయ్యాయి.. ప్రశాంతంగా ఉన్న తెలంగాణ మళ్లీ ఆగమయ్యే పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ దుర్మార్గపు పాలన వల్ల అన్ని రంగాల్లో తెలంగాణ వెనుకబడింది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో మళ్లీ కాంగ్రెస్ అరాచక పాలన నడుస్తోంది.
మరోమారు ఉద్యమ చైతన్యంతో పోరాటానికి మనమంతా సిద్ధం కావాలి. BRS ను అధికారంలోకి తీసుకువచ్చి కేసీఆర్, కేటీఆర్ ల సారథ్యంలో రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకురావాలి. లేదంటే తెలంగాణ పూర్తిగా అన్యాయానికి గురై.. మళ్లీ వెనుకటి రోజులు దాపూరించే ప్రమాదముంది. ఇప్పటికే ఆంధ్ర పాలకులు, ఉద్యోగులు,ఆంధ్ర కుట్రదారుల పెత్తనం మొదలయింది.
ప్రస్తుతం విద్యుత్ సంస్థల్లో ఆంధ్ర అధికారుల పెత్తనం నడుస్తోంది.. అప్రమత్తంగా ఉండి పోరాడకపోతే ఆగమైతం.. వాళ్ల కుట్రలను చెదించాలంటే మరొక తెలంగాణ ఉద్యమం చేయాలి… ఆంధ్రకు చంద్రబాబు ఏజెంట్ గా మారిన కాంగ్రెస్ పార్టీని పారద్రోలాలి..తెలంగాణలో కుట్రల కాంగ్రెస్ అరాచక పాలనను అంతం చేద్దాం. అంతా ఏకమై మరో ఉద్యమానికి సిద్ధమవుదాం. మళ్లీ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల అభివృద్ధితో దేశంలోనే అగ్రగామిగా నిలుపుకుందాం.
మాజీ ఎంపీ, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర కార్యదర్శి వై. వెంకటేశ్వర్లు, బీఆర్ఎస్నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.