హైదరాబాదులోని దేవనార్ స్కూల్ ఫర్ ద బ్లైండ్ ఆవరణలో గరిమెళ్ల ప్రత్యూష జ్ఞాపకార్ధం, గరిమెళ్ల ఫ్యామిలీ నిర్మించిన వసతి గృహాన్నికేంద్రమాజీ మంత్రి, బీజేపీ నేత సుజనాచౌదరి ప్రారంభించారు. ఈ స్కూలు నిర్వహణలో సహకరించేందుకు సుజనా ఫౌండేషన్ తరపున 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించారు.
ఈ సందర్భంగా అంధులకు విశేష సేవలందిస్తున్న స్కూలు యాజమాన్యాన్ని సుజనాచౌదరి అభినందించారు. వారి ఆలనాపాలనా చూడటంతోపాటు, మరింత సాంకేతిక విజ్ఞానం, పరికరాల కోసం తన ఫౌండేషన్ నుంచి 50 లక్షలు విరాళంగా ఇస్తున్నట్లు సుజనా చౌదరి ప్రకటించారు. ఇది సమాజంలో ఒక బాధ్యతగల పౌరుడిగా తాను నిర్వర్తిస్తున్న బాధ్యత అని వ్యాఖ్యానించారు.