– ఇద్దరిపై విచారణకు సీఐడీ ఆదేశం
– క్రీడాపరికాలకొను ‘ గోల్‌మాల్’ ఆరోపణలు
విజయవాడ: జగన్ సర్కారు హయాంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో జరిగిన అక్రమాలకు సంబంధించి అప్పటి మంత్రులు రోజా, ధర్మాన కృష్ణదాస్‌పై విచారణ జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు సీఐడీ ఏడీజీ విజయవాడ పోలీసుకమిషనర్‌ను ఆదేశించారు. ఆడుదాం ఆంధ్రలో అవినీతి జరిగిందంటూ ఆట్యపాట్య సంస్థ సీఈఓ ప్రసాద్ సీఐడీకి ఫిర్యాదు చేశారు. దానితో వాటిపై విచారణ జరపాలని సీఐడీ ఏడీజీ ఆదేశించారు. ఈ స్కీములో న్యాణత లేని బ్యాట్లు, క్రీడాసామాగ్రి క్రీడాకారులకు ఇచ్చారన్న ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే.