జగ్గయ్యపేట: పట్టణంలో బలుసుపాడు రోడ్డులో గల అంబేద్కర్ గురుకుల (బాలికల) పాఠశాల నందు దీపావళి పండుగలకు వెళ్ళకుండా హాస్టల్లోనే ఉన్న విద్యార్థులకు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య తానే ప్రత్యేకంగా బాణసంచా కొనుక్కొని వెళ్లి, దగ్గరుండి పండుగ నిర్వహించి విద్యార్థులతో బాణసంచా కాల్పించి, వారికి స్వీట్స్ పంచి దీపావళి పండగ విశిష్టతను వివరించారు. విద్యార్థులంతా హ్యాపీగా ఫీలయ్యారు. ఈ సందర్భంగా ఒక మహిళ అయినటువంటి సత్యభామ నరకాసుడిని వధిస్తుంది. బాలికలు, మహిళలు ఆ విధంగా ధైర్యంగా ముందుకు ఎదగాలి అని ఎమ్మెల్యే వారికి తెలియజేశారు.