Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ప్రభుత్వంలో రోడ్లన్నీ గుంతలమయం

  • గత  ప్రభుత్వంలో రోడ్లపై వెళ్లాలంటే ప్రజలు నరకం చూసేవారు
  • రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: రహదారుల పునరుద్ధరణకు కట్టుబడి, ప్రజలకు సురక్షిత మార్గాలను అందించేందుకు గుంతల రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్నారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఆనంద్, మరియు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. ఈ కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం వద్ద నిర్వహించబడింది.

ఈ సందర్భంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, గత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి నిధుల కొరతతో రహదారులు గుంతలతో నిండిపోయాయని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సంక్రాంతికి అన్ని రోడ్లను మరమ్మత్తు చేసి ప్రజలకు సౌకర్యం కల్పించే బాధ్యతను స్వయంగా తీసుకుంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొడ్డపనేని రాజా నాయుడు, స్థానిక కార్పొరేటర్ చెక్క అహల్య, టీడీపీ నాయకులు చెక్క సాయి సునీల్, తోట దామోదర్, దొరబాబు, శాంతి నాయుడు, ముని శేఖర్ నాయుడు, ఆకుల రాజేష్, వెంకటేశ్వర్లు నాయుడు, బాలకృష్ణ, పుష్పరాజు, కే.ఆర్. నాయర్, కుమార్, రఘు రామ్, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE