– అర్ధరాత్రి పూట గోడలు దూకే అలవాటు రేవంత్ రెడ్డికే
వంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకుల ఫోన్లను రోజూ ట్యాప్ చేస్తున్నాడు
– ఢిల్లీలో ముఖ్యమంత్రి పక్కన ఉన్న వారంతా గార్బేజ్ బ్యాచ్
– సచివాలయంకు ఎందుకు పోవడం లేదు రేవంత్ రెడ్డి?
-తెలంగాణ లో భవన్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు చిట్ చాట్
హైదరాబాద్: కేటీఆర్ పైన చెత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన చెత్త వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఢిల్లీలో ముఖ్యమంత్రి పక్కన ఉన్న
వారంతా గార్బేజ్ బ్యాచ్. అసలే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువ. ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెత్త వ్యాఖ్యలతో మరింత కాలుష్యం పెరిగింది. బనకచర్ల పైన రేవంత్ రెడ్డి నగ్నంగా దొరికిపోయాడు. రేవంత్ రెడ్డి చీకటి బాగోతం కప్పిపుచ్చుకునేందుకు బజారులోని చెత్త అంతా మీడియా ముందు ఉంచాడు.
బనకచర్ల ప్రాజెక్ట్ ఎజెండాలో ఉన్నదని ఆంధ్ర ప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామ్మోహన్ నాయుడు చెప్పారు. రేవంత్ రెడ్డి ఏమో బనకచర్ల అసలు
చర్చకు రాలేదని అంటున్నాడు. డ్రగ్స్, గంజాయి అంటూ మోకాళ్లకు బోడి గుండుకు ముడి పెట్టే ప్రయత్నం. తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి.
ముఖ్యమంత్రి అయిన తరువాత జై తెలంగాణ అంటాడేమో అనుకున్నాము. జై కర్ణాటక , జై మహారాష్ట్ర అని ఆ రాష్ట్ర నాయకులు అనడం లేదా? కర్ణాటకకు చెందిన AICC అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే జై తెలంగాణ అనలేదా?
కేటీఆర్ అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతారు. రాష్ట్ర ప్రయోజనాలు ప్రపంచం ముందు ఉంచాడు. నీలా కేటీఆర్ బ్యాగ్ లు మొయ్యలేదు. నీ చుట్టూ ఉన్నవారు బ్యాగ్ లు మోసేవారు. పరిపాలన అంటే బ్యాగ్ లు మోసుడు కాదు రేవంత్ రెడ్డి.
కాంగ్రెస్ పార్టీ పాలనలో మలేరియా, డెంగ్యూ వంటి రోగాలతో గురుకుల పాఠశాల విద్యార్థులు హాస్పిటల్ లో ఉంటున్నారు. గ్రామాల్లో పాలన పడకేసింది. జూబ్లీ హిల్స్ ప్యాలెస్, కమాండ్ కంట్రోల్ బిల్డింగ్ లోనే పాలన చేస్తున్నావు.
సచివాలయంకు ఎందుకు పోవడం లేదు రేవంత్ రెడ్డి? రోజు ప్రజలను కలుస్తా అని మాట ఇచ్చావు కదా? ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశానికి నేను పాల్గొనడం ఇష్టం లేదని కాదు. బనకచర్ల ప్రాజెక్ట్ ఎజెండాలో ఉండడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాము. బనకచర్ల ప్రాజెక్ట్ కి సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పేపర్లలో చర్చ జరిగినట్లు వచ్చింది. లైయింగ్ సిండ్రోమ్ అనే వ్యాధితో రేవంత్ రెడ్డి బాధ
పడుతున్నాడు.
మహిళలను కోటీశ్వరలను చేస్తా అని మోసం చేశావు. ఢిల్లీ పర్యటనకి సంబంధించి ఒకరోజు ముందు ఆంధ్ర ప్రదేశ్ కు షాక్ అని లీక్ ఇచ్చావు. మధ్యాహ్నం కల్లా బనకచర్ల ప్రాజెక్ట్ ఎజెండాలో ఉంటే పోయేది లేదు అని అన్నావు. రాత్రి కల్లా పరుగు పరుగున ఢిల్లీకి పోయావు. కేటీఆర్ సవాల్ విసిరితే చర్చకు రాని వ్యక్తివి. పైగా కేటీఆర్ పైన పిచ్చి వాగుడు వాగుతున్నావు. ఈ రాష్ట్రంలో అర్థరాత్రి పూట గోడలు దూకే అలవాటు రేవంత్ రెడ్డికే ఉన్నది .
తాత్కాలిక నీటి ఒప్పందంలో భాగంగా కృష్ణ జలాల్లో ట్రిబ్యునల్ సెక్షన్ 3 సాధించాడు. నీటి ఒప్పందాల గురించి రేవంత్ రెడ్డికి తెలియదు, ఇంటి దొంగ రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రి మాట్లాడితే రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడాలి. కేసీఆర్ కు ఉన్న ఇమేజ్ రేవంత్ రెడ్డికి రాదు. నా ఎత్తు
గురించి మాట్లాడిన నా అంత ఎత్తు అయితే రేవంత్ రెడ్డికి రాదు. రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే అసెంబ్లీ పెట్టాలి. అసెంబ్లీలో మా మైక్ కట్
చెయ్యకుండా నిజాయితీగా అన్ని అంశాల పైన చర్చకు బీఆర్ఎస్ రెడీ.
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయింది. ఈరోజు మా మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇంటి పైన దాడి, నా క్యాంపు కార్యాలయం, పాడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన, సునీత లక్ష్మారెడ్డి పైన , మర్రి రాజశేఖర్ రెడ్డిపైన దాడి చేస్తున్నారు. రాష్ట్రంలో పూర్తిగా శాంతి భద్రతలు కరువై హత్యలు,
ఎక్కువ అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పాలనలో రాష్ట్ర ఆదాయం పడిపోయింది.
చిల్లర మాటలు బంద్ చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశాడు. ఎవడో దుబాయ్ లో ఎవరో చనిపోతే మా కేటీఆర్ కు ఏం సంబంధం? ఆ రిపోర్ట్ నీ దగ్గర ఏమైనా ఉంటే రేవంత్ రెడ్డి ముక్కులో పెట్టుకో. ఈడీ ఎందుకు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చెయ్యడం లేదు? కిషన్ రెడ్డి రేవంత్ రెడ్డికి అండగా ఉంటున్నాడు.
కేంద్రంతో సఖ్యతతో ఉంటానని పేరుకే అంటున్నావు, నీ వల్ల రాష్ట్రానికి ఒక్క ఉపయోగం జరగలేదు. కేటీఆర్ పైన చేసిన ఆరోపణల్లో రుజువు ఉంటే చూపించు. లేదంటే కేటీఆర్ కు బహిరంగంగా క్షమాపణ చెప్పు రేవంత్ రెడ్డి. లోకేష్, కేటీఆర్ ను అర్ధరాత్రి పూట కలిశాడు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు.
అర్ధరాత్రి పోయి కలిసే అలవాటు రేవంత్ రెడ్డికే ఉన్నది, మా కేటీఆర్ కు లేదు. ఈ రాష్ట్రం కోసం, ప్రజల కోసం మేము భయపడం. ఏదో ఒకటి చేసి మా పైన కేసులు పెడితే మేము భయపడతాం అని రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. మా పై తెలంగాణ ఉద్యమం లో 300 పైగా కేసులు పెట్టారు.
ఎన్ని కేసులు పెట్టిన భయపడేది లేదు. మా పైన ఇంటిలిజెన్స్ వ్యవస్థతో రేవంత్ రెడ్డి నిఘా పెడుతున్నాడు, మాకేం కాదు. రేవంత్ రెడ్డి బీఆర్ఎస్
నాయకుల ఫోన్లను రోజూ ట్యాప్ చేస్తున్నాడు. మా వెనుక ఇంటలిజెన్స్ వాళ్ళను పెట్టి ఎక్కడ అంటే అక్కడ తిప్పుతున్నారు.
మా చుట్టూ నిఘా పెట్టారు. మా అందరి ఫోన్స్ ట్యాప్ అవుతున్నవి. విలేకరుల ఫోన్ ట్యాప్ చేస్తున్నారా? నా తో విలేకరులు మాట్లాడేది ఎలా తెలుస్తుంది?