ఇదేం బాలేదు అద్దెష్షా! ఈ రాతలేంది అద్దెష్షా! ఆడు అక్కడ తవ్వుకు పోతన్నాడు…. ఈడు ఇక్కడ తవ్వుకు పోతన్నాడు…. ఆడి సుట్టాలు తవ్వుకు
పోతుండారు…. ఈడి బామ్మరిది తవ్వుకు పోతుండాడు. ఆడి సెటప్పు తమ్ముడు తవ్వుకు పోతుండాడు. ఏం రాతలద్దెష్షా!?
ఇసకేమన్నా ఈ పేపర్నానాకొడుకుల్దా అద్దెష్షా?
ఏసు ప్రభు ఇచ్చాడు అద్దెష్షా! ఎందుకిచ్చాడు? ఇళ్ళు, బిళ్ళింగులు కట్టుకోమని ఇచ్చాడు.మరి ఆళ్ళు కట్టుకోవద్దా? రోడ్లు ఎయ్యొద్దా? ఎయ్యక పోతే…. ఎయ్యలేదని…. గుంతలు పడి జనం సేపలు పట్టుకుంటాన్నారని రాత్తారు. ఈటి కోసమని ఇసక తవ్వితే, తవ్వేత్తన్నారని మా మీద పడి ఏడుత్తరు.
ఏ ఏడుకాయేడు మట్టసం గా… అడుక్కల్లా తవ్వేసుకోక పోతే…. నదుల్లో ఇసక దిబ్బలు పెరిగి పోయి…. నదుల్లో నీళ్లు పారతయ్యా అద్దెష్షా!? నీళ్లు పారకుండా ఎక్కడి నీళ్లు ఆగిపోతే…. పంటలు పండుతుయ్యా అద్దెష్షా? అప్పుడు పోలవరం కట్టి లాబమేంటీ…. బనకశర్ల తవ్వి లాభమేంటి?
అయి రెండూ లేకపోతే…. మన బాబు గారి సేతుల్లో డబ్బులాడతయ్యా అద్దెష్షా? మరి స్టేటు ఎట్టా డెవలప్ అయ్యిద్దద్దెష్షా సరే! మా సుట్టాల్ తవ్వలేదు అనుకుందాం! ఈ పేపర్నాకొడుకులు తవ్వుతారా అని ప్రెశ్నిస్తన్నా! దాన్ని తవ్వుకుని మేం ఏవన్నా తింటన్నామా అద్దెష్షా?
పెజలకే యిస్తన్నాం గదా! మొన్నటికి మొన్న మీరే గదా అద్దెష్షా పెద్దాపురం…. ఆవిడెవరో… ఆడ లేడీస్…. ఇసక పంపించమని అంటే…. పంపించామా లేదా…?
ఇసకే గదా అని తుస్కారం పనికిరాదద్దెష్షా! ఇసక మీద ఎంత మంది కళ్ళుంటయి అనుకున్నారు!?
మైనింగోళ్ళను సూసుకోవాలి…. పోలీసోళ్లను సూసుకోవాలి…. పైగా మా సీ ఐ గాడికి ఆకలి బాగా ఎక్కువ. మళ్ళీ ఆడికో టూ టౌను. ఆవిణ్ణి సూసుకోవాలి.మా పంచాయతీ సర్పంచి. వార్డు నెంబర్లు. మళ్ళీ ఆళ్ళ మీద పోటీ చేసి ఓడిపోయినోళ్లు.వాళ్ళను సూసుకోవాలి. ట్రాన్స్పోర్టోళ్లను సూసుకోవాలి.
ఈళ్ళు గాక పేపరోళ్ల గురించి ఇక సెప్పేదేముంది? ఇదివరకు…. పేపరోళ్లంటే ఓ అర డజను మంది ఉండేవాళ్లు . ఇప్పుడో…!? ఏకంగా ఓ వందమంది. ఎవణ్ణి పలకరిస్తే…. వాడే ఓ ఇలేకరంట. సేతి లో సెల్ల ఫోను.మామూలు ఫోను కాదెద్దష్షా ఐ ఫోన్. ఆడికో శానలు. డైలీ కలెక్షన్ గాళ్ళ కింద తయారైనరు అద్దెషా.
ఇసక అనేది ఏసు ప్రెబు మనకు ఇచ్చిన వరం. నెత్తి మీది జుట్టు లాటిది. ఎన్ని సార్లు గుండు కొట్టించినా మళ్ళీ పెరుగుతానే ఉంటది. ఇసకా అంతే! ఎంత తవ్వేసినా… మళ్ళీ రడీ అయిపోద్ది. అంటే…. అరిగేది కాదు, తరిగేది కాదు.
అందుకాని; ఆడు అక్కడ ఇసక తవ్వాడు…. ఈడు ఇక్కడ తవ్వాడు అంటూ ఎదవ రాతలు రాసే వాళ్ళను పట్టుకొచ్చి, రఘురామ కృష్ణం రాజు ను పట్టుకొచ్చి కుళ్ళ బొడిచారు సూడు…., ఆ రేంజ్ లో కుళ్ళ బోడిచేసి…. ఆళ్ళ మీద ఎస్సీ /ఎస్టీ కేసెట్టించేయమని తవుర్ని సవినయం గా కోరుకుంటున్నా అద్దెష్షా! లేకపోతే కంట్రోలు కారు.
భోగాది వేంకట రాయుడు