– ఆలస్యమైనా మిథున్ రెడ్డి ఈరోజు అరెస్ట్ చేయడం శుభ పరిణామం
అమరావతి : పెద్దిరెడ్డి కుటుంబ సామ్రాజ్య పాపాలకు లెక్క తేల్చి శిక్షించడానికి కూటమి ప్రభుత్వం నడుం బిగించి, భారీ లిక్కర్ స్కామ్ లో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథురెడ్డి ని సిట్ విభాగం అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పెట్టడం పట్ల బిసివై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ హర్షం వ్యక్తం చేశారు.
కూటమి అధికారం లోకి వచ్చాక బాగా ఆలస్యమైనా మిథున్ రెడ్డి అక్రమాలను గుర్తించి ఆయనపై కేసు పెట్టి, ఈరోజు అరెస్ట్ చేయడం శుభ పరిణామం గా రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. మంచి సాక్ష్యాలు న్యాయ స్థానం ముందుంచి మిథున్ రెడ్డికి తగిన శిక్ష విధించే విధంగా కూటమి ప్రభుత్వం పని చేసి తన చిత్తశుద్ధి నిరుపించుకుంటే ప్రజలు నమ్ముతారన్నారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన పాపలకు లెక్క చెప్పే రోజు ప్రారంభం అయ్యిందని రామచంద్ర యాదవ్ ప్రకటించారు.