– గోదావరి నదీ జలాలపై చంద్రబాబు కుట్ర
– ప్రతి కాలేజీలో బనకచర్లకు వ్యతిరేకంగా కరపత్రాల పంపిణీ
– కెసిఆర్ పాలనలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నేతలు కుక్కిన పేనులా ఉన్నారు
– 26న బీ ఆర్ ఎస్ వి రాష్ట్ర సదస్సు
– బీ ఆర్ ఎస్ వి అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, బాల్క సుమన్
హైదరాబాద్: బీ ఆర్ ఎస్ విద్యార్ధి విభాగం రాష్ట్ర సదస్సు ఈ నెల 26 న ఉప్పల్ నియోజకవర్గం లోని మల్లాపూర్ వీ ఎన్ ఆర్ గార్డెన్స్ లో నిర్వహిస్తున్నాం. ఉదయం పదిగంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. మాజీ మంత్రి , ఎమ్మెల్యే టి .హరీష్ రావు ఉదయం సెషన్ లో పాల్గొంటారు. మధ్యాహ్నం జరిగే సెషన్ లో మాజీ మంత్రి ఎమ్మెల్యే జి .జగదీశ్ రెడ్డి ,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పాల్గొంటారు. సాయంత్రం సెషన్ లో బీ ఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే టీ రామారావు పాల్గొని ముగింపు ఉపన్యాసం ఇస్తారు.
బనక చర్ల తో తెలంగాణ కు జరిగే నష్టాన్ని మా విద్యార్ధి నేతలు ప్రతీ కాలేజి తిరిగి వివరిస్తున్నారు. ఇందుకు సంబంధించి ఐదు లక్షల కరపత్రాలు ముద్రించాం .విద్యార్థులను కలిసి తెలంగాణ కు బనకచర్ల తో జరుగుతున్న నష్టాన్ని కరపత్రాలతో వివరిస్తున్నాం. ఎల్లుండి జరిగే సదస్సులో బనక చర్ల పైనే ప్రధానంగా చర్చిస్తాం
చంద్రబాబు ,మోడీ ,రేవంత్ రెడ్డి లు కలిసి తెలంగాణ నీటి వనరులను కొల్లగొడుతున్న తీరును వివరిస్తాం. బనక చర్లపై జంగ్ సైరన్ మోగించేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. బనక చర్లపై విద్యార్థి విభాగం పోరాటం చేస్తుంది.
తెలంగాణకు అన్యాయం జరిగితే పోరాటం చేసేందుకు మా విద్యార్థి విభాగం సన్నద్ధం అవుతోంది. గోదావరి నదీ జలాలపై చంద్రబాబు కుట్ర చేస్తున్నారు బనక చర్ల ప్రాజెక్ట్ ను కేంద్ర సంస్థలు తిరస్కరించాయి. తన గురువుకు ధారాదత్తం చేసే పనిలో రేవంత్ రెడ్డి ఉన్నారు.
ముఖ్యమంత్రికి చదువే రాదు. మంత్రులు అస్సలు మాట్లాడటం లేదు. ప్రశ్నిస్తే కేటీఆర్ పై అక్రమ కేసులు పెడుతున్నారు. ఎంత అణిచివేసే ప్రయత్నం చేసినా మా అధినాయకత్వం భయపడదు. ప్రభుత్వం పెట్టిన కేసులన్నీ నీరు గారిపోతున్నాయి.కొత్తగా మళ్ళీ ఏం చేయాలని ఆలోచన చేస్తున్నారు.
కాంగ్రెస్ పాలనలో ప్రగతి కుంటుపడింది. ఇందిరమ్మ ఎమర్జెన్సీ మళ్ళీ వచ్చింది. రేవంత్ రెడ్డి ఎన్నడూ తెలంగాణ అనలేదు. ఢిల్లీకి ఊడిగం చేస్తూ చంద్రబాబుకు గురుదక్షిణగా తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నాడు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకు మా విద్యార్థి విభాగం నేతలను సన్నద్ధం చేసేందుకు సదస్సు ఏర్పాటు చేస్తున్నాం. భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం.
కెసిఆర్ పదేళ్ల పాలనలో మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నేతలు కుక్కిన పేనులా ఉన్నారు. కేసీఆర్ లాంటి పులిని పండబెట్టి పిల్లిని గెలిపించారు. కేసులు పెట్టి వేధించటం ఇందిరమ్మ పాలనా? కేటీఆర్ బర్త్ డే ఫ్లెక్సీలను జీహెచ్ఎంసీ వాళ్ళు చింపి వేయటం అరాచకం. కృష్ణా గోదావరి జలాల్లో నీటి వాటా వచ్చే వరకు పోరాటం చేస్తాం. మేము పోరాటం మొదలు పెడితే మీ జేజమ్మలు కూడా మమ్మల్ని ఆపలేరు.
ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ,చిరుమళ్ల రాకేష్ కుమార్ , ఆంజనేయ గౌడ్ ,ధర్మేందర్ రెడ్డి ,తుంగబాలు ,కడారి స్వామి యాదవ్ , కృష్ణ పాల్గొన్నారు.