– అయ్యర్ కట్టిన పోలవరం కూలితే ఎందుకు చర్యలు లేవు?
– కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఏ అనుమతి ఉందని రేవంత్‌రెడ్డి కొబ్బరికాయ కొట్టిండు?
– డీపీఆర్ లేకుండానే రేవంత్‌రెడ్డి పనులు ప్రారంభించాడు
– నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక్క అనుమతి ఉందో ఉత్తమ్ చూపించాలి
– ఒక్క అనుమతి లేకుండా బిల్లులు ఎట్లా చెల్లించావో సమాధానం చెప్పాలి
– పోలవరంపై ఎన్డీఎస్ఏ ఎందుకు వెళ్లడం లేదు?
– కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని నిరూపిస్తాం
– మొబిలైజేషన్ అడ్వాన్లు పేరుమీద రూ. 2 వేల కోట్లు దొబ్బారు
– నిపుణుల సూచనలతోనే నదీ ద్వారానే మేడిగడ్డకు తరలించాలని నిర్ణయించాం.
“కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ కుట్రలు.. కమిషన్ వక్రీకరణలు, వాస్తవాలు అంశం పై తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి హరీష్ రావు ప్రెజెంటేషన్
హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తీసుకున్నాం. గత కేబినెట్లో ఉన్న ఇద్దరు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారు. 20-30 పేజీల కేబినెట్ నోట్ ఉంటుంది. ఆ నోట్‌ను ప్రభుత్వం ఇవ్వడం లేదు. కేబినెట్ కాకుండా అసెంబ్లీ అఫ్రూవల్ కూడా ఉంది.
గవర్నర్ ప్రసంగంలో కూడా కాళేశ్వరం అంశం ఉంది. గవర్నర్ ప్రసంగాన్ని కేబినెట్ ఆమోదిస్తుంది. అసెంబ్లీలోని ప్రసంగాన్ని గవర్నర్ కూడా ఆమోదించారు. కేబినెట్ ఆమోదం లేదనడానికి ఏముంది ఆర్థికమంత్రి ప్రసంగంలోనూ కాళేశ్వరంపై మాట్లాడారు.
ఆర్థిక మంత్రి ప్రసంగంపై కూడా గవర్నర్, కేబినెట్ ఆమోదం ఉంటుంది. అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చిన ఏకైక సీఎం కేసీఆర్. దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ చేయలేదు. కేసీఆర్ సోలో నిర్ణయమని ఎలా అంటారు?
కేసీఆర్ కాళేశ్వరంపై అసెంబ్లీలోనే చర్చ పెట్టారు కదా? మేం ప్రిపేరయి రాలేదని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సభ నుంచి పారిపోయిండు. కేసీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్లో మిగతా విపక్షాలు పాల్గొన్నాయి.
అసెంబ్లీలోనే చర్చినంక కేసీఆర్ సోలో నిర్ణయం ఎలా అవుతుంది?
కేబినెట్ అనుమతే కాదు. అసెంబ్లీ అఫ్రూవల్స్ కూడా ఉన్నాయి.
ప్రాణహితకు జాతీయ హోదా ఇవ్వాలని సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన నెలరోజుల్లోనే ప్రధానికి కేసీఆర్ లేఖ రాశారు. ప్రాణహితకు జాతీయ హోదా అడగడం తప్పా? కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఏ అనుమతి ఉందని రేవంత్‌రెడ్డి కొబ్బరికాయ కొట్టిండు. డీపీఆర్ లేకుండానే రేవంత్‌రెడ్డి పనులు ప్రారంభించాడు.
ఎలాంటి అనుమతులు లేకుండానే బిల్లులు కూడా చెల్లించారు..
నారాయణపేట్-కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ఒక్క అనుమతి ఉందో ఉత్తమ్ చూపించాలి. ఒక్క అనుమతి లేకుండా బిల్లులు ఎట్లా చెల్లించావో సమాధానం చెప్పాలి.
ఎన్డీఎస్ఏ సీడబ్ల్యూసీలో అంతర్భాగం. ఎన్డీఎస్ఏకి దేశమంత ఒకే నీతి ఉంటుందా? రాష్ట్రానికో విధంగా నీతి ఉంటుందా? రాష్ట్రం పిలువకుండానే ఎన్డీఎస్ఏ వచ్చింది. ఎన్నికలకు ముందు మూడు రోజుల్లోనే నివేదిక ఇచ్చింది.
మూడుసార్లు కూలిన పోలవరంపై ఎన్డీఎస్ఏ ఎందుకు వెళ్లడం లేదు?
పోలవరం కట్టిన ప్రధాని మోదీపై చర్య తీసుకుంటావా? పోలవరం కూలితే ఎగ్జిక్యూటివ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వానిది బాధ్యతనా? రాజకీయ కుట్రతోని ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చారు.
ఎన్డీఎస్ఏ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ కట్టిన పోలవరం కూలింది.
ఆయన వచ్చి మన కాళేశ్వరంపై నివేదిక ఇచ్చిండు. చంద్రశేఖర్ అయ్యర్ కట్టిన పోలవరం కూలితే ఎందుకు చర్యలు లేవు? రెండు పిల్లర్లు కూలితేనే కేసీఆర్‌ది బాధ్యత అయితే..ఎస్ఎల్బీసీ కూలి మృతదేహాలు బయటకు తీయలేదు? ఎస్ఎల్బీసీ కూలిన ఘటనలో రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ బాధ్యత వహించాలి.
కాళేశ్వరం ద్వారా రెండు పంటలు పండాయి. కాళేశ్వరం పూర్తిస్థాయిలో బాగుంది. సుందిళ్ల, అన్నారం సేఫ్ అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అసెంబ్లీలోనే చెప్పిండు. రెండు పిల్లర్లు కుంగితే కాళేశ్వరం కూలిందని తప్పుడు ప్రచారం. రెండు పిల్లర్ల మరమ్మతులు నువ్వు చేస్తే చెయ్.
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే రెండు పియర్లు బాగు చేస్తాం. కాళేశ్వరం తెలంగాణకు వరప్రదాయిని అని నిరూపిస్తాం.
రేవంత్ పాలన గాలికొదిలేశారు. రేవంత్ రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. విద్యార్థులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు. వాస్తవాలు లేకుండా వండి వార్చిన రిపోర్ట్ బయటపెట్టారు. బిల్లు కావాలంటే 10-12 శాతం కమీషన్లు కావాలి. బీజేపీ, కాంగ్రెస్‌లు కలిసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.
గోదావరి నదిపై పోలవరం ప్రాజెక్టు 3 సార్లు కుప్పకూలింది. పోలవరంపై NDSA ఎందుకు వెళ్లలేదు? మేడిగడ్డలో చిన్న ఘటన జరగగానే NDSA వచ్చింది. మాకు నోటీసులు రాకముందే మీడియాకు లీకులు ఇస్తున్నారు. కుట్ర పూరితంగానే కమిషన్ విచారణ జరిగినట్లు కనిపిస్తోంది. అసెంబ్లీలో 665 పేజీల రిపోర్ట్ పెడితే ప్రభుత్వాన్ని నిలదీస్తాం.
ఒక వైపే చూసి, విని, నిలబడి ఇచ్చిన రిపోర్ట్ ఇది. ఇది బేస్‌లెస్ రిపోర్ట్. దేశంలో ఎన్నో కమిషన్లు వేశారు.. న్యాయస్థానాల ముందు నిలబడవు. గతంలోనూ ఎంతో మంది రాజకీయ నేతలపై కమిషన్లు వేశారు. సీఎం రేవంత్ వరుస సీరియళ్లు నడుపుతున్నారు. కేసీఆర్‌ను హింసించాలన్నదే రేవంత్ ఉద్దేశం
కాంగ్రెస్ హయాంలో తమ్మిడిహట్టి దగ్గర దమ్మెడు మట్టి ఎందుకు వేయలేదు? తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదు. జీవ సంపద ఉంది, మహారాష్ట్ర నుంచి అభ్యంతరాలు ఉన్నాయి. అందుకే అక్కడ ప్రాజెక్ట్ కట్టలేదు. కన్నేపల్లి దగ్గర మోటార్లు ఆన్ చేయాలని బీఆర్ఎస్ నేతలు ధర్నా చేశారు.
రెండేళ్ల నుంచి ఎందుకు తట్టెడు మట్టి ఎత్తలేదు. కేసీఆర్ మహారాష్ట్రలో చారిత్రాత్మక ఒప్పందం చేసుకున్నారు. కేసీఆర్ ఒకేసారి మూడు అగ్రిమెంట్లు చేశారు. 152 మీటర్లకు అగ్రిమెంట్ చేస్తే ఎలా తగ్గిస్తారని ఉత్తమ్ అన్నారు.ఇంకా గంట 40 నిమిషాలు బేగంపేట ఎయిర్‌పోర్టులో ఉంటా.152 మీటర్లకు ఒప్పుకున్నట్టు ఉత్తమ్ అగ్రిమెంట్ పత్రం తీసుకొస్తే, ఇక్కడి నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా చేస్తానని కేసీఆర్ సవాల్ విసిరారు.
ఒక్క ఏడాదిలోనే 24 గంటల కరెంటు ఇచ్చారు. మిషన్ కాకతీయతో చెరువులను పునఃరుద్దరించారు. పెండింగ్ ప్రాజెక్ట్‌లను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చాం. నువ్వు వచ్చినంక ఒక్క కాలువ తవ్విన, ఒక్క ఎకరానికి నీళ్లు ఇచ్చావా? రెండేళ్లలో ఢిల్లీకి కమీషన్ల మూటలు తీసుకెళ్లావు.
వచ్చే రెండేళ్లలో కూడా రేవంత్‌రెడ్డి చేసేదేమీలేదు.
ఢిల్లీకి కమీషన్ల ముఠాలు తీసుకెళ్లారు తప్ప చేసిందేమీ లేదు. కాటన్ బ్యారేజీ కట్టినా కమిషన్ వేసి వేధించారు. అయినా కాటన్ గోదావరి ప్రజల గుండెల్లో నిలిచి ఉన్నారు. కేసీఆర్‌కు కూడా తెలంగాణ ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోతారు. కాళేశ్వరం ముమ్మాటికీ వర ప్రదాయినే, రేవంత్‌కు కూడా తెలుసు.
కాళేశ్వరం కూలిందన్నోడు గంధమల్లకు కొబ్బరికాయ ఎట్ల కొడుతాడు?
మల్లన్నసాగర్ నుంచి మూసీకి నీళ్లు తీసుకొస్తానని చెబుతున్నాడు
కేసీఆర్ చేసింది వందేళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని కాళేశ్వరం నిర్మాణం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సత్యహరిశ్చంద్రుడికి తమ్ముడి లెక్క మాట్లాడుతున్నారు.
ప్రాణహిత-చేవెళ్లలో పెట్టిన ఖర్చు రూ. 3,700 కోట్లు మాత్రమే. రూ. 11 వేల కోట్లు ఖర్చు చేశామని ఉత్తమ్ చెబుతున్నాడు. మొబిలైజేషన్ అడ్వాన్లు పేరుమీద రూ. 2 వేల కోట్లు దొబ్బారు. నిన్నటి మీటింగ్‌లో ప్రభుత్వం 4 అంశాలను బయటపెట్టింది.
తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదని CWCనే చెప్పింది. తమ్మిడిహట్టి దగ్గర చెప్పిన 165 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాల వాటా ఉంది.
తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం మా నిర్ణయం కాదు. ప్రాణహిత చేవెళ్లకు హైడ్రాలజీ అనుమతి ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్తోంది.
కానీ నీటి లభ్యత లేదని ఉమాభారతి అదే లేఖలో మరో పేరాలో పేర్కొన్నారు. 152 మీ. ఎత్తులో బ్యారేజీ నిర్మించవద్దని మహారాష్ట్ర స్పష్టంగా చెప్పింది. ప్రాజెక్టు పూర్తి కావాలన్న ఉద్దేశంతోనే తమ్మిడిహట్టి నుంచి మార్చాం
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి రహస్యం లేదు.. అన్ని అంశాలు DPRలో ఉన్నాయి. రైతులకు నీళ్లు ఇవ్వాలన్నదే మా లక్ష్యం. ఏడాదిలోనే కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు సాధించాం. 11 కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు ప్రాజెక్టును ఆమోదించాయి.
ఒక ప్రాజెక్టుకు కావాల్సిన అన్ని అనుమతులు వచ్చాయి. మరి కమిషన్ ఎవరిని తప్పుబడుతుంది? కేంద్రం, అనుమతులు ఇచ్చిన ఏజెన్సీలను కమిషన్ తప్పుబడుతుందా? ఐదుగురు నిపుణులతో వేసిన కమిటీ కూడా మేడిగడ్డను సూచించింది. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరుకు నేరుగా తరలించలేమని నిపుణులు చెప్పారు.
నిపుణుల సూచనలతోనే నదీ ద్వారానే మేడిగడ్డకు తరలించాలని నిర్ణయించాం.. ఈ విషయం నిపుణుల కమిటీ తన అఫిడవిట్లో పేర్కొంది. మా అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారని..
నిపుణుల కమిటీనే కమిషన్‌కు చెప్పింది.