– బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్
నెల్లూరు: పార్టీ నాయకులంతా ప్రజా ప్రతినిధులుగా మారాలని అందుకు అనుగుణంగా కార్యాచరణ ఉండాలని బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ పిలుపు ఇచ్చారు. నెల్లూరు జిల్లా కార్యకర్తల సమావేశంలో కార్యకర్తలలో జోష్ నింపే విధంగా మాధవ్ ప్రసంగం కొనసాగింది. నెల్లూరు జిల్లా బీజేపీ అడ్డా… అటువంటి గడ్డపై నుండి హామీ ఇస్తున్నా… కార్యకర్తల భుజం తట్టి ప్రోత్సహిస్తున్న అంటూ బిగ్గర స్వరంతో మాధవ్ మాట్లాడారు. జనసంఘ్ కాలం నుండి బీజేపీ నెల్లూరు జిల్లాలో బలమైన పార్టీ గా ఉండడానికి ఇక్కడ నాయకత్వం చేస్తున్న కృషి ఉందన్నారు.
రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులను అందించిన జిల్లా నెల్లూరు. ఈ జిల్లా నుండి వెంకయ్య నాయుడు అనేక హోదాల్లో పని చేసే ఉపరాష్ట్రపతి అయ్యారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పొట్టి శ్రీ రాములు నిరాహార దీక్ష కారణంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. అంటే ఇక్కడ పోరాటాలు పురిటి గడ్డ గా అభివర్ణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశ్వ నేత. ప్రపంచ దేశాల నేతలు నరేంద్ర మోడీ ని అనుసరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం వల్ల మన రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందన్నారు.