కాకినాడ: “జన్మదినం అనేది మనకోసమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి ఉపయోగపడే రోజుగా మారాలి” అని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అన్నారు.
ఆగస్టు 19 తన జన్మదినం సందర్భంగా, కార్యకర్తలు ఫ్లెక్సీలు, బ్యానర్లకు ఖర్చు చేయకుండా పేదలకు తోడ్పడే చిన్న చిన్న సేవా కార్యక్రమాలు చేయాలని ఆయన కోరారు.
“అవసరంలో ఉన్న పిల్లలకు అండగా నిలబడటం, వృద్ధులకు సహాయం చేయటం – ఇలాంటి పనులు మన సమాజానికి ఉపయోగకరంగా ఉంటాయి. ప్రేమతో చేసిన చిన్న సహాయం కూడా ఎవరికో పెద్ద మార్పు తీసుకువస్తుంది” అని సతీష్ బాబు చెప్పారు.
అలాగే, ఇలాంటి సేవా కార్యక్రమాలను ఇతరులకు స్ఫూర్తి కలిగించేలా సోషల్ మీడియాలో పంచాలని ఆయన సూచించారు.