– అమరావతి రాజధాని వరద నీరు ముప్పు గురైన నీరుకొండ ప్రాంతాన్ని పరిశీలించిన మంగళగిరి వైసీపీ ఇన్చార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి
మంగళగిరి: రాజధానిలో కట్టడాలు కొండవీటి వాగు మళ్లింపు వల్ల వరద నీరు గ్రామాలను ముంచుతుంది. కొండవీటి వాగు నీరు వెనక్కి వెళ్ళటం వల్ల కాజా, చిన్న కాకాని, నంబూరు, పెద్దకాకాని గ్రామాలలోని సుమారు 70000 ఎకరాలు పంట నీట మునిగింది.
గత సంవత్సరం వరద వచ్చిన సమయంలో నీరుకొండ ప్రాంతం పూర్తిగా మునిగిపోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధాని డెవలప్మెంట్ అని చెప్తున్నారు. కానీ రాజధానిలో ఎక్కడా డెవలప్మెంట్ లేదు. సీఆర్డీఏ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కొండవీటి వాగు గురించి ఆలోచించకపోతే అనేక గ్రామాలలో ప్రాణం నష్టం జరిగే అవకాశం కూడా ఉంది.
రాజధానిలో ప్రజలు ఇంకా బ్రతకాలి అంటే ఇప్పటికైనా చంద్రబాబు అవగాహనతో ముందుకు వెళ్లాలి. కొండవీటి వాగు స్కీం మీద సరైన ఇంజనీర్ల తో సమావేశ ఏర్పాటు చేసి వరద నీరును రాజధాని నుంచి తప్పించాలి. కొండవీటి వాగు గురించి చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకోకపోతే అమరావతి రాజధాని కలగానే మిగిలిపోతుంది.