విజయవాడ: బీజేపీ రాష్ట్ర మీడియా అధికార ప్రతినిధుల జాబితా ఎంపికయింది. బీజేపీ ఏపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ ప్రకటించారు. ఇప్పటికే బీజేపీ రాష్ట్ర మీడియా ఇన్ఛార్జి కిలారు దిలీప్, చీఫ్ స్పోక్స్ పర్సన్ జయప్రకాష్ నారాయణ్ (జెపి) లను ప్రకటించారు. తాజాగా రాష్ట్ర అధికార ప్రతినిధి ల జాబితా రాష్ట్ర కార్యాలయం నుంచి మాధవ్ విడుదల చేశారు. ఆ వివరాలివి. వాకాటి నారాయణ రెడ్డి(నెల్లూరు), పూడి తిరుపతిరావు(శ్రీకాకుళం), సాదినేని యామినీ శర్మ, ఎన్టీఆర్ (విజయవాడ), పెద్దిరెడ్డి రవికిరణ్(కాకినాడ), ముళ్లపూడి రేణుక(పశ్చిమ గోదావరి), డాక్టర్ వినుషా రెడ్డి(కర్నూలు), డాక్టర్ కె. సుహాసిని ఆనంద్(విశాఖపట్నం), నల్లా పవన్ కుమార్ (డాక్టర్ అంబేద్కర్ కోనసీమ), జల్లి మధుసూధన్(తిరుపతి), కేబీఎన్బీ నరసింగరావు (బ్రహ్మం)(కర్నూలు), దర్శనం శ్రీనివాస్(గుంటూరు), వంగల శశి భూషణ్ రెడ్డి(కడప), చిరువోలు బుచ్చిరాజు కృష్ణ(మచిలీపట్నం), షేక్ బాజీ ఎన్టీఆర్(విజయవాడ).