2000 వ సంవత్సరంలో పుటిన నేను పెరుగుతున్న క్రమంలో ఎన్నో మార్పులను చూసాను. కాలక్రమేణా ప్రజల జీవన గతులు మారడం అలానే ఎంతోమంది తలరాతలు మారడం చూసాను అప్పుడు నాకు అనేక ప్రశ్నలు వచ్చాయి. ఆ ప్రశ్నలకు జవాబులు తెలుసుకునే సమయంలో తెలుగుదేశం గురించి తెలుసుకున్నాను.
ఒక్క పార్టీ తలచుకుంటే ఒక్క జాతి తలరాత ఎలామారుతుందో, ప్రజల జీవన గతులును ఎలా మార్చగలదో భవిష్యత్తు తరాల కోసం పునాదులు ఎలా వేయగలదో తెలుసుకున్నాను. అవి మా తరంలో ప్రతి ఒక్కరికి తెలియచేయడం కోసం, మా తరాన్ని చైతన్యపరచడం కోసం రాస్తున్నాను.
1980లో ఈ తెలుగు నాట గంజినీళ్లు, రాగులు, సజ్జలు మాత్రమే తిని బ్రతికే ఎంతోమంది పేద వాళ్ల కోసం రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి వాళ్ళ ఆకలి తీర్చిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను.
పాత రోజుల్లో పూరి గుడిసెలు మాత్రమే వుండేటివి ఎంతోమంది పేదవాళ్లు దాంట్లో ఉండేవాళ్లు ఎప్పుడు వానొచ్చినా, ఎండ వచ్చిన, గాలి వచ్చిన నిద్రలేక గడిపే ఎంతోమంది నిరుపేదల కోసం పక్కా ఇల్లు నిర్మించి వాళ్ళని ఒక ఇంటికి యజమానులను చేసిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను.
ఒకప్పుడు ఇంటి గడప దాటి బయటికి రాని మహిళల కోసం చదువుకోమని ఒక ప్రత్యేక విశ్వవిద్యాలయం పెట్టిన పార్టీ, మహిళలకు పాఠశాలలకు వెళ్లడానికి సైకిలు ఇచ్చిన పార్టీ, మహిళల కోసం ప్రత్యేకంగా పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీలు పెట్టిన పార్టీ, ఉద్యోగాల్లో కాలేజీల్లో సీట్లు 33% రిజర్వేషన్లు కల్పించిన పార్టీ, బస్సుల్లో మహిళలకు కండక్టర్లుగా పరిచయం చేసిన పార్టీ, డ్వాక్రా సంఘాల ద్వారా వాళ్లలో చైతన్యం తీసుకువచ్చి వాళ్ళ సొంత కాళ్ళ పైన వాళ్ళు నిలదొక్కుకునేలా చేసిన పార్టీ, ప్రతి ఆడబిడ్డ ఒక వ్యాపారవేత్త అయ్యేలా ప్రణాళికల రూపొందించిన పార్టీ, ఇలా మహిళా సాధికారత కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను.
ఒకప్పుడు ఆడబిడ్డ పుడితే పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తే వాళ్ళ దయ దక్షిణ్యాల మీద బ్రతుకుతుంది లే అనే పరిస్థితి నుంచి వాళ్లకు ఆస్తిలో సమాన హక్కు కల్పించాలని చట్టం చేసి సమాజంలో ఒక మార్పు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను.
ఒకప్పుడు భూమిశిస్తు కట్టలేని రైతుల కోసం భూమిశిస్తూనే రద్దు చేసింది, కరెంటు చార్జీల భరించలేని రైతుల కోసం 50 రూపాయలకే హార్స్ పవర్ విద్యుత్ తీసుకువచ్చింది, సాగుకి తాగుకి నీటికి సమస్య ఉంటే రాష్ట్రమంతటా ప్రభుత్వం తరఫున వేల బోర్లు వేయిపించే రైతులకు అండగా నిలబడింది.
ప్రతి ఎకరాకు నీళ్లు అందించాలని లక్ష్యంతో ఈ తెలుగు నాట ఇరిగేషన్ ప్రాజెక్టులకు పునాదులు వేసి మనం చూస్తున్న తెలుగు గంగా, హంద్రీనీవా, గాలేరు నగరి, సోమశిల, కందలేరు, పులిచింతల, మద్దువలస, జూరాల, నెట్టెంపాడు, కల్వకుర్తి లిఫ్ట్, బ్రహ్మం సాగర్, మచ్చుమరి ఎత్తిపోతల, సిద్దాపురం, అవుకు టన్నెల్, ఎస్ ఎల్ బి సి, ఎస్ ఆర్ బి సి ఇలాంటి ఎన్నో ప్రాజెక్టుల ద్వారా జలదారులు పారించింది తెలుగుదేశం అని తెలుసుకున్నాను.
కరువుతో అల్లాడుతున్న రాయలసీమలో నీళ్లు ఇవ్వడమే కాకుండా రైతులకు బిందు సేద్యం వైపు మళ్లించి ఇజ్రాయిల్ టెక్నాలజీ అయిన డ్రిప్ తీసుకొచ్చి 90% సబ్సిడీ ఇచ్చి రైతులుకు అందించి ఈరోజు రాయలసీమ ఒక హార్టికల్చర్ హబ్ గా మార్చింది తెలుగుదేశం అని తెలుసుకున్నాను.
రాయలసీమ అంటే ఒకప్పుడు ఫ్యాక్షనిజం, గుండాయిజం, రౌడీయిజం అని వినే వాళ్ళం ఆ పరిస్థితులను మార్చి ఫ్యాక్షనిజంని అణచివేసి, ముఠా కక్షలకు చెక్ పెట్టి ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొల్పి, కత్తులు పట్టే చేతులకు పెన్నులు కంప్యూటర్లను పట్టించింది, రక్తం పారె దగ్గర నీళ్లను పారించింది. బాంబులు తయారయ్యే దగ్గర కార్లు, ఫోన్లు తయారయ్యాలా చేసింది. టెంపుల్ టూరిజంకి కేర్ ఆఫ్ అడ్రెస్స్ గా మార్చింది, చదువులకు నిలయంగా మార్చి రేపటి తిరుగులేని భవిష్యత్తుకు పునాదులు వేసిందని తెలుసుకున్నాను.
ఒకప్పుడు మనకు ఏదైనా పనిబడి ప్రభుత్వం దగ్గరికి వెళ్లాలంటే తాలూకా వ్యవస్థలో వందల కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చేది అలాంటి సమయంలో తాలూకా వ్యవస్థని రద్దుచేసి పరిపాలన దగ్గర చేయడం కోసం మండల వ్యవస్థను తీసుకువచ్చిన పార్టీ, ఈ సేవ, మీసేవ వాట్సప్ గవర్నెన్స్ తీసుకొచ్చిన పార్టీ, రైతులకు వాళ్ళ భూములపై హక్కులు కల్పిస్తూ పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను.
ఈరోజు మనమందరం చదువుకుంటున్నాం కానీ ఒకప్పుడు చదువు అనేది కొంతమందికి మాత్రమే పరిమితం ఆ రోజుల్లో సమాజంలో మార్పు రావాలంటే చదువు వల్ల మాత్రమే సాధ్యమని చదువుల పండగానే పాలసీ తీసుకోని వచ్చి ఏడు లక్షల మంది విద్యార్థులకు బడికి వచ్చేలా చేసింది ఒకప్పుడు 40% కూడా లేని అక్షరాస్యత 80% వరకు పెరిగేలా మార్పు తీసుకువచ్చింది ఈ తెలుగు నాట, తొలిసారి రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలు తీసుకొచ్చింది.
ఎంసెట్ విధానాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశమే, తొలి వైద్య విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం తీసుకొచ్చింది. కొత్తగా 38 వేల పాఠశాలల నిర్మించి రెండు లక్షల వరకు ఉపాధ్యాయులు నియమించింది డిఎస్సీ ద్వారా, అందరూ చదవాలి అందరూ ఎదగాలి అని ప్రతి గ్రామంలోకి ఒక ప్రాథమిక పాఠశాల, మూడు కిలోమీటర్ల కి ఒక ప్రాథమికోన్నత పాఠశాల, ఐదు కిలోమీటర్లకి ఉన్నత పాఠశాల నెలకొల్పారు.
కంప్యూటర్ విద్యను పాఠశాల స్థాయిలోనే తీసుకొచ్చారు. ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, బి ఫార్మసీ, ఎంసీఏ, ఎంబీఏ, జూనియర్, డిగ్రీ, డైట్ కాలేజీలను ఏర్పాటు చేసి ఈ తెలుగు నాట విద్యా విప్లవాన్ని తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను.
తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ముందు ఈ సమాజంలో పటేల్ పట్వారి, కరణం, మున్సబు లాంటి వ్యవస్థలు చేతుల్లో ప్రజలు మగ్గిపోతుంటే అలాంటి వ్యవస్థలను రద్దుచేసి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాల్లో ఎంతోమందికి నిజమైన స్వాతంత్రాన్ని ఇచ్చిన పార్టీ తెలుగుదేశం. అలాగే ఒకప్పుడు సమాజంలో కుల వివక్షతతో ప్రజలు మగ్గిపోతూ ఉంటే ఆ కుల వివక్షత పైన రాజీలేని పోరాటం చేసి సమాజంలో ప్రజలను చైతన్యం చేసి కుల వివక్షతను రూపుమాపిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను.
అన్ని వర్గాలకు అవకాశాలు రావాలని స్థానిక సంస్థల్లో బీసీలకు తొలిసారి 20% రిజర్వేషన్ తీసుకొచ్చింది, ఎస్సీలకు 14 నుంచి 15 శాతానికి, ఎస్టీలకు 4నుంచి 6శాతానికి తీసుకొచ్చింది, మైనారిటీల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. దేశానికి తొలి దళిత స్పీకర్ను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు తొలి దళిత మహిళ స్పీకర్ను అందించింది. రెండు గ్లాసుల సిద్ధాంతాన్ని రూపుమాపి, వర్గీకరణ ద్వారా అన్ని వర్గాలకు సమఫలాలు అందాలని కృషి చేసింది తెలుగుదేశం అని తెలుసుకున్నాను.
ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ అనే స్థాయి నుండి యువతకు ఉపాధి చూపించే స్థాయి కు మార్పు తీసుకువచ్చింది. హైటెక్ సిటీ, మైక్రోసాఫ్ట్, ఐఆర్డిఏ, ISB , శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగ్ రోడ్డు, ఎంఎంటిఎస్ పరుగులు, 19 ఫ్లైఓవర్లు, మల్టీప్లెక్స్ లు, అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, బయోటెక్ సంస్థలు, గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్, కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం ,సరూర్ నగర్ స్టేడియం వంటి అనేక క్రీడా ప్రాంగణాలు నిర్మించి 2002లోని 32వ నేషనల్ గేమ్స్, 2003లోని మొదటి ఆఫ్రో ఆసియన్ గేమ్స్ వంటి నిర్వహించి క్రీడా రాజధానిగా చేశారు.
బిల్ గేట్స్, బిల్ క్లింటన్, టోనీ ప్లేయర్ వంటి ప్రపంచ ప్రఖ్యాతలను హైదరాబాద్ రప్పించి ప్రపంచ పటంపై హైదరాబాదును గుర్తింపు తెచ్చారు. IIIT ,నల్సార్ ను హైదరాబాద్ కు తెచ్చింది. నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ గార్డెన్స్, జలగం వెంగళరావు పార్క్, కేబిఆర్ పార్క్, కృష్ణ కాంత్ పార్క్, సంజీవయ్య పార్క్, జలవిహార్ వంటివి ఈరోజు ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయంటే అది తెలుగుదేశం ఫలితమే.
హైదరాబాద్ త్రాగునీటి కోసం నాగార్జునసాగర్ నుంచి కృష్ణా జలాలు తీసుకొచ్చింది తెలుగుదేశమే. ఈ రోజు మనం చూస్తున్న హైదరాబాద్ అభివృద్ధికి 1990లోనే పునాదులు వేసి హైదరాబాద్ తలరాతను మార్చింది తెలుగుదేశం అని తెలుసుకున్నాను.
మనం నేడు చూస్తున్న రాజకీయ పార్టీలకు తెలుగుదేశం కి చాలా తేడా ఉంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రత్యర్థి పార్టీలను చంపాలని గాని, కూలగొట్టాలని గాని, పడగొట్టాలని కానీ చూడలేదు. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక విధానాలను చూసి పుట్టిన పార్టీ తెలుగుదేశం అలాంటిది కాంగ్రెస్ పార్టీ నుంచి పీవీ నరసింహారావు గారు ప్రధాని అభ్యర్థిగా నంద్యాల నుంచి పోటీ చేస్తే నా తెలుగువాడు ప్రధాని అవ్వాలని అభ్యర్థన నిలబెట్టకుండా పార్టీల కతీతంగా విలువలతో రాజకీయం చేసింది నాడు తెలుగుదేశం. అలానే తెలుగుదేశం పార్టీ చేసిన ఎన్నో పనులకు ప్రత్యర్థి పార్టీలో ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తుల పేర్లు పెట్టి విలువలతో రాజకీయం చేసింది.
దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే సమయంలో ఎన్నో పదవులు వచ్చిన తీసుకోకుండా రాష్ట్ర హక్కుల కోసం, దేశ ప్రయోజనాల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం. సొంత పార్టీ కార్యకర్తలను ప్రత్యర్థులు చంపితే కత్తి ఇచ్చి కార్యకర్తలను ప్రత్యర్థులను చంపమని చెప్పలేదు.
దీనికి చెక్ పెట్టి వాళ్ళ పిల్లలను చదివిపించి సమాజంలో వాళ్ల పిల్లలను ప్రయోజకులను చేసి ఉన్నత స్థాయిలో కుర్చోపెట్టింది. ఇలా నిరంతరం విలువలతో, సిద్ధాంతాలతో పనిచేసిన పార్టీ తెలుగుదేశం అని తెలుసుకున్నాను. ఇలా మనం సమాజంలో చూస్తున్న అన్ని వర్గాల, అన్ని వృత్తుల, అన్ని ప్రాంతాల, అభివృద్ధిలో భాగస్వామ్యం అయింది తెలుగుదేశం. అలానే భవిష్యత్తుకు పునాదులు వేస్తూ నేడు క్వాంటం వ్యాలీ అంటూ, డేటా సెంటర్లకు నిలయంగా మారుస్తూ, గ్రీన్ ఎనర్జీకి నిలయంగా, ఆర్గానిక్ ఫార్మింగ్ అంటూ కొత్త విధానాలతో, విజన్ 2047 అంటూ మన భవిష్యత్ తరాల కోసం పనిచేస్తుంది తెలుగుదేశం.
అందుకే ప్రతి ఒక్కరు ఈ తరం యువతగా మనం గతంలో మన పాత తరలలో మార్పులు తీసుకొచ్చిన తెలుగుదేశం గురించి తెలుసుకుంటూ, భవిష్యత్తులో మన కోసం మన రేపటి తరాల కోసం పనిచేస్తున్న తెలుగుదేశంకు, మన వంతు కర్తవ్యం గా అండగా నిలబడుతూ, మంచి సమాజాన్ని నిర్మించడంలో రేపటి విజయాలను సాధించడంలో మనమందరం భాగస్వామి అవ్వాలని కోరుకుంటూ ఈ తరం యువత.
– శశి