-పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ చూపు తెదేపా వైపు?
-జనసేనతో టచ్‌లో పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు ?
కాకినాడ జిల్లా జగ్గంపేట జ్యోతుల చంటిబాబు టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఆయనకు ఈసారి జగ్గంపేట ఎమ్మెల్యే టిక్కెట్ ను జ్యోతుల చంటిబాబుకు ఇచ్చే పరిస్థితి లేదని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేయడంతో ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు..ఈ మేరకు టీడీపీ నేతలతో జ్యోతుల చంటిబాబు సమావేశమయ్యారు. 2019లో ఆయన వైసీపీ నుంచి జగ్గంపేట ఎమ్మెల్యేగా గెలిచారు..
వచ్చే నెల మొదటి వారంలో అయితే టీడీపీలోనూ ఆయనకు జగ్గంపేట టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదని టీడీపీ నేతలు తెలిపారు. మరో నియోజకవర్గంలో తనకు పోటీ చేసే అవకాశం కల్పించాలని చంటిబాబు టీడీపీ అధినేతను కోరినట్లు తెలిసింది. దీంతో జ్యోతుల చంటి బాబు వచ్చే నెల 5, 6 తేదీల్లో టీడీపీలో చేరే అవకాశాలున్నాయని పార్టీ నేతలు చెబుతున్నారు..
కాగా పిఠాపురం ఎమ్మెల్యే పెండం దొరబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ రాజీనామాకు సిద్ధమైనట్లు సమాచారం. పర్వత ప్రసాద్‌ల చూపు తెదేపా వైపు ఉండగా… దొరబాబు జనసేనతో టచ్‌లో ఉన్నారని సమాచారం.తమకు రానున్న ఎన్నికల్లో… టికెట్ ఇవ్వకపోయినా సరే జగన్ ఓటమే తమకు కావాలంటూ… సదరు పార్టీలతో రాయబారం నడుపుతున్నారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.