Suryaa.co.in

Telangana

త్వరలో అద్భుతమైన మేనిఫెస్టో

– కాంగ్రెస్, బిజెపి దిమ్మ దిరిగేలా బిఆరెస్ మానిఫెస్టో
– అధికారంలో ఉన్న కాంగ్రెస్ కర్ణాటక, ఛత్తీస్గడ్ లో ఎందుకు ఇవ్వడం లేదు?
– కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేశారు
– నల్గొండ, సూర్యపేట్ లలో మెడికల్ కాలేజీలు తెచ్చాం
యాదాద్రి జిల్లా నకిరేకల్ నియోజవర్గం రామన్నపేటలో మంత్రి హరీశ్ రావు

ఇంటింటికి తాగు నీళ్ళు ఇచ్చి నీటి కష్టాలు తీర్చిది కేసీఆర్. గతంలో ఎమ్మేల్యేలు రావాలంటే ముందు నీళ్ళ ట్యాంకర్ వచ్చి నీటి సమస్య తీర్చేవి. 2000 పింఛన్లు ఇస్తున్నది సీఎం కేసీఆర్. దేశంలో అత్యధిక పింఛన్లు ఇస్తున్నది కేసీఆర్. అత్తా, కోడళ్ళ పంచాయతీ బంద్ అయ్యింది పింఛన్లు వల్ల. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్.

కాంగ్రెస్ వాళ్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. 50 ఏళ్ల నుండి ఎందుకు ఇవ్వడం లేదు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కర్ణాటక, ఛత్తీస్గడ్ లో ఎందుకు ఇవ్వడం లేదు? అక్కడ చేతకాదు ఇక్కడ ఎలా సాధ్యమవుతుంది?ఆడబిడ్డ ఉన్న తల్లికి కొండంత అండ కేసీఆర్.

12 లక్షల 74 వేల మంది పెళ్ళిళ్ళకు చెక్కులు ఇచ్చాం. ఎమ్మెల్యే కోరిక మేరకు నిధులు పెంచి మొత్తం రూ. 17 కోట్లతో రామన్నపేటలో మంచి ఆసుపత్రి అందుబాటులోకి తెస్తాము. నలగ్గొండ, సూర్యపేట్ లలో మెడికల్ కాలేజీలు తెచ్చాం.నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన అంటే, నేడు నేను సర్కారు దవాఖానకు పోతా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి 30, 40 నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు సభ్యులు లేరు.ఇక్కడి నాయకుడు ఒకరు 24 గంటల కరెంట్ రావడం లేదు అంటున్నడు, అందులో వేలు పెట్టు చూడు కరెంట్ వస్తుందా లేదా తెలుస్తుంది. కాంగ్రెస్ పాలనలో ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ చేశారు.

కాంగ్రెస్ నాయకులు కరెంట్ గురించి మాట్లాడితే సూర్యుడి మీద ఉమ్మి వేసినట్లే.మీ పాలనలో కరెంట్ కష్టాలు వర్ణనాతీతం. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. కరెంట్ గురించి ఎంత మాట్లాడితే అంత మంచిది మాకు. కరెంటు విషయంలో ఎన్నికల్లో వెళ్ళడానికి మేము సిద్ధం. కాంగ్రెస్ పాలనలో కరెంట్ బాగుందా, మా పాలనలో కరెంటు బాగుందా ప్రజలనే తీర్పుకోరుదాం. దాని మీదే ఎన్నికలకు పోదాం.

త్వరలో అద్భుతమైన మేనిఫెస్టో వస్తుంది. కాంగ్రెస్, బిజెపి దిమ్మ దిరిగేలా బిఆరెస్ మేనిఫెస్టో ఉంటుంది. సీఎం కేసీఆర్ గారు త్వరలో ఆ శుభవార్త చెబుతారు.సీఎం కేసీఆర్ పాలన సంక్షేమానికి స్వర్ణయుగం. కేసీఆర్ మాట తప్పలేదు, తెలంగాణ తెస్తా అన్నాడు సాధించి చూపెట్టాడు.కానే కాదు రానేరాదు అన్న తెలంగాణను ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా తెలంగాణ సాధించినాడు.ఓట్ల కోసం ఆపద మొక్కులు కాంగ్రెస్ వి. అందరూ కేసీఆర్ నాయకత్వం దీవించాలి.ఎమ్మెల్యే లింగయ్యకు కనీసం హైదరాబాద్ లో ఇల్లు కూడా లేదు.కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన నకిరేకల్ ప్రజల సేవ కోసం కృషి చేస్తారు.

LEAVE A RESPONSE