– కేసీఆర్ అనుభవిస్తున్న భోగాలు ఎక్కడినుంచి వచ్చాయి
– ఇక్కడ సరిపొదట..ఇప్పుడు దేశాన్ని ఉద్దరిస్తాడట
– ఈ దరిద్రం ఇక్కడితో సరిపోదా
– వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
కేసీఆర్ తన సొంత డబ్బుతో పంట వేయని రైతులకు పరిహారం ఇవ్వాలి. ఒకప్పుడు కేసీఆర్ కుటుంబం ఎలా ఉంది? స్కూటర్,అద్దె ఇల్లు ఉన్న కేసీఆర్ ఇప్పుడు ఎలా ఉన్నారు? పెద్ద పెద్ద గడీలు.. ప్రైవేట్ జెట్ లు..ఫామ్ హౌస్ లో వందల ఎకరాలు ఎక్కడ నుంచి వచ్చాయి..?
కేసీఆర్ అనుభవిస్తున్న భోగాలు ఎక్కడినుంచి వచ్చాయి? కేసీఆర్ కుటుంబం తప్పా తెలంగాణ లో ఎవరు బాగుపడలేదు. బంగారు తెలంగాణ కేసీఆర్ కుటుంబానికి బంగారం అయ్యింది టీఆరెఎస్ పార్టీ అకౌంట్ లో 860 కోట్లు ఉన్నాయని చెప్తున్నారు. ఒకప్పుడు రూపాయి లేని అకౌంట్ లో ఇన్ని వందల కోట్లు ఎలా వచ్చాయి. వడ్డీ నే నేలకు మూడు కోట్లు వస్తుందట. కేసీఆర్ ఎలా బ్రతుకుతున్నారు…ప్రజలు ఎలా బ్రతుకు తున్నారు. కేసీఆర్ ఇంట్లో 5 ఉద్యోగాలు ఉన్నాయి..మరి నిరుద్యోగుల సంగతి ఏంటి? నిరుద్యోగుల శవాల మీద కేసీఆర్ సింహాసనం వేసుకొని కూర్చొని రాజ్యం ఏలుతున్నారు.
ఇక్కడ సరిపొదట..ఇప్పుడు దేశాన్ని ఉద్దరిస్తాడట. దేశాన్ని కూడా నాశనం చేయడానికా… ఈ దరిద్రం ఇక్కడితో సరిపోదా? ఈ దరిద్రం దేశం మొత్తం కావాలా?కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద లక్షల కోట్లు ఆస్తులు. కేసీఆర్ అకౌంట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి…రైతులు మాత్రం అప్పులతో ఆత్మహత్యలు చేసుకోవాలి.
ఇది బంగారు తెలంగాణ కాదు.. అప్పుల తెలంగాణ.మంత్రుల మీద కేసులు లేవని గొప్పలు చెప్తున్నారు.అందరూ గౌతమ బుద్దులు అంట..వారికి పూజలు చేయాలట. అందరూ గౌతమ బుద్దులు అయితే టీఆరెఎస్ నేతల అరాచకాలకు ప్రజలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు. కేసీఆర్ మాటలకు రెండు సార్లు మోసపోయింది చాలు.
వైఎస్సార్ సంక్షేమం కోసం పార్టీ పెట్టాం.వైఎస్సార్ సంక్షేమ పాలన జరిగి తెస్తాం.సంక్షేమ తెలంగాణ ను తెస్తాం. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి అంటాడు…3లక్షల70 వేల కోట్ల రూపాయలు వ్యవసాయానికి ఖర్చు పెట్టారట. అంత ఖర్చు పెడితే రైతులు ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ డబ్బులు ఎక్కడకు పోయినట్లు… టీఆరెఎస్ నేతల జేబుల్లోకి వెళ్లాయి.
రైతు కేవలం గరిష్టంగా సంపాదిస్తున్నది నేలకు కేవలం 2 వేలు మాత్రమే.రెండు వేలతో రైతు ఎలా బ్రతుకుతారు? రైతు సుభిక్షంగా బ్రతకాలి అంటే వైఎస్ఆర్ సంక్షేమ పాలన మళ్ళీ రావాలి.