-యాంటి నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యం
-వాటికి పూర్తి స్థాయిలో నిధులు
-రక్షణ పట్ల ఇది మా ప్రభుత్వం నిబద్ధత
-ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు లైసెన్స్ లు తీసుకోండి
-గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించండి
-ఒప్పందం మేరకు ఉద్యోగులకు వేతనాలు చెల్లించండి
– పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయంలో జరిగిన HCSC సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: నగర అభివృద్ధికి గతంలో ఎన్నడూ లేనివిధంగా 10,000 కోట్లు బడ్జెట్లో కేటాయించామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కమల్లు అన్నారు. శుక్రవారం ఆయన పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ కార్యాలయంలో Hcsc ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. యాంటి నార్కోటిక్ బ్యూరో, సైబర్ సెక్యూరిటీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రార్ధన తెలుస్తుందని వివరించారు. భద్రత విషయంలో పోలీస్ శాఖకు వారికి అవసరమైన మేరకు పూర్తిస్థాయిలో నిధులు కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
హైదరాబాద్ పట్టణంతోపాటు రాష్ట్రంలో భద్రత, అభివృద్ధి విషయంలో ఇది మా నిబద్ధత అన్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు లైసెన్సులు తీసుకోవాలని.. గ్రామీణ యువతకు ఉపాధి మంచి వేతనాలు ఇవ్వాలని సూచించారు. ప్రైవేటు సెక్యూరిటీ సంస్థలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా భద్రత విషయంలో చేస్తున్న కృషి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం రూరల్ మోడల్గా నిలవాలని కోరారు.
ఫార్మల్ పోలింగ్ కే పరిమితం కాకుండా ఇన్ ఫార్మర్ పోలీసింగ్ పైన దృష్టి పెట్టిన పోలీసు ఉన్నతాధికారులను అభినందించారు. హైదరాబాద్ నగరం వేగంగా పెరుగుతున్నది.. సాఫ్ట్వేర్, ఫార్మా.. ఇతర ప్రధాన పరిశ్రమలు వేగంగా విస్తరిస్తున్నాయని వివరించారు.
తెలంగాణ ఒక పట్టణ రాష్ట్రమని అభివర్ణించారు. హైదరాబాదులో ఫోర్త్ సిటీ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు రచిస్తున్నారని వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు నిర్మిస్తున్నామని.. హైదరాబాద్ నగర విస్తరణకు పెద్ద సంఖ్యలో మౌలిక వసతులు కల్పించాలని మా ప్రభుత్వం నిర్ణయించినట్లు వివరించారు.
హైదరాబాద్ సిటీ కమిషనర్ ఆధ్వర్యంలో చురుకైన సంస్థ అయిన హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ (HCSC) నిర్వహిస్తున్న ఈ జాతీయ భౌతిక భద్రత శిఖరాగ్ర సమావేశములో మీతో కలిసి పాల్గొనడం ఆనందాన్నిస్తుంది అన్నారు. వృత్తిపరమైన స్కిల్స్ డెవలప్మెంట్ కు తెలంగాణ రాష్ట్ర పోలీస్ ఆధ్వర్యంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ & కంట్రోల్ సెంటర్ సరైన ప్రదేశంగా నేను భావిస్తున్నాను అన్నారు.
ఈ కార్యక్రమంలో పోలీసు, రక్షణ, సామాజిక సేవ, వ్యాపారవేత్తలు, నిపుణులు మరియు ప్రభుత్వ సంస్థలు సంఘటితంగా ఒక సురక్షితమైన ప్రపంచం వైపు అడుగులు వేసేందుకు సమావేశం కావడం శుభ పరిణామం అన్నారు. ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విలువైన సమయాన్ని కేటాయించినందుకు ముందుగా అభినందనలు మీ అందరికీ ధన్యవాదాలు అన్నారు.
‘పౌరులను సురక్షితమైన లక్ష్యం వైపు, సురక్షిత సమాజం వైపు సమ్మేళనం చేయడం’ ఈ సెమినార్ ప్రధాన అంశం. వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో సమాజం సురక్షితంగా ఉండడం చాలా అవసరం. ఇందుకు సమాజంలోని పౌరులంతా ఒక స్పృహతో బాధ్యత స్వీకరించాలి. పరిసరాల భద్రతకు సంబంధించిన అంశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అన్నారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం అనివార్యమైన ఈ డిజిటల్ యుగంలో భౌతిక భద్రత విషయంలో ఒక గొప్ప మార్పు కోసం జరుగుతున్న ఈ చర్చలు మంచి ప్రయోజనాన్ని అందిస్తాయని నేను బలంగా విశ్వసిస్తున్నాను అన్నారు. మీరు ఎంచుకున్న అంశాలు ప్రస్తుత ఆర్థిక అభివృద్ధి మరియు మన తెలంగాణ రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణ పై ప్రత్యక్ష ప్రభావాన్ని కలిగి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా భౌతిక భద్రతా చర్యలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది అన్నారు.
ఈ రోజుల్లో భౌతిక భద్రత పాత్రను పెద్ద సంఖ్యలో ఉన్న ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది వారి భుజాన వేసుకున్నారు. అంతేకాదు వీరు మన రాష్ట్రంలో ఉపాధి కల్పనలో కీలక పాత్ర పోషిస్తున్నారు. రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది సిబ్బందితో, ఒక హైదరాబాదులోనే లక్ష మంది సిబ్బందితో సేవలు అందిస్తున్నారు. రాష్ట్రంలో భద్రత, సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గట్టి సంకల్పంతో ముందుకు వెళుతుంది అన్నారు.
ప్రైవేటు సెక్యూరిటీ ఇండస్ట్రీ అనేది ప్రస్తుతం వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగం. నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రతను అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న స్కిల్ డెవలప్మెంట్, ప్రైవేటు సెక్యూరిటీ ఇండస్ట్రీ ఇస్తున్న ఉపాధి ద్వారా మన రాష్ట్ర యువతకు అవకాశాలు లభిస్తున్నాయి అన్నారు. సమావేశానికి హాజరైన సంబంధిత ప్రభుత్వం అధికారులు పెద్ద సంఖ్యలో ఉపాధిని పెంపొందిస్తూనే సమాజంలో భద్రతను పెంపొందించే దిశగా బలమైన కార్యాచరణ ప్రణాళికతో ముందుకు వెళ్లాలి.
ఈ సమావేశం ద్వారా గుర్తించిన అన్ని ప్రధాన సమస్యలను, ప్రభుత్వాధికారులు సిఫారసు చేసిన అంశాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది అన్నారు. ఒక కార్యాచరణ ప్రణాళికతో రావాల్సిందిగా మీ అందరిని కోరుతున్నాను అని తెలిపారు.
సెక్యూరిటీ సిబ్బంది కనీస వేతనాల పైన దృష్టి పెట్టండి. దేశవ్యాప్తంగా అత్యుత్తమ కనీస వేతనాలతో సమానంగా ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చర్యలు చేపడుతుంది. మన రాష్ట్రంలో ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీల చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడంపై ప్రభుత్వ దృష్టికి వచ్చిన కొన్ని సమస్యలను నిర్ణీత సమయంలో ప్రత్యేక దృష్టి సారించి పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాం అన్నారు.
ప్రైవేట్ సెక్యూరిటీ ఇండస్ట్రీని ప్రొఫెషనల్ ఈవెంట్ నిర్వహణలో భాగస్వామ్యం చేసినందుకు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ ను అభినందిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం సురక్షితమైనదిగా నిర్ధారించేందుకు మీరు చేస్తున్న ప్రయత్నం ఈ ఆడిటోరియంలోని నాలుగు గోడలు దాటి ముందుకు తీసుకువెళ్లాలని మీ అందరిని కోరుతున్నాను అన్నారు.