Suryaa.co.in

National

ఎస్‌బీఐలో త్వరలో 10వేల ఉద్యోగాలు

– త్వరలోనే నోటిఫికేషన్
– కొత్తగా 600 ఎస్బిఐ బ్రాంచ్ లను ఏర్పాటు చేస్తామన్న ఎస్‌బీఐ చైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి

ముంబై: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ స్థాయిలో నియామకాలకు సిద్ధమవుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 10 వేల మందిని కొత్తగా నియమించు కోనున్నట్లు వెల్లడించింది. దానికోసం త్వరలో నోటిఫికేషన్ కూడా జారీ చేయనుంది.

ఈ ఏడాది మార్చి నాటికి దేశంలో 22,542 ఎస్‌బీఐ బ్రాంచులు ఉన్నాయని, సాధారణ బ్యాంకింగ్ అవసరాలను తీర్చడంతో పాటు సాంకేతికంగా మరింత బలోపేతమం అయ్యేందుకు మరో 600 ఎస్‌బీఐ బ్రాంచులను కొత్తగా ఏర్పాటు చేపట్టనున్నట్లు సంస్థ ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు.

LEAVE A RESPONSE