Suryaa.co.in

Telangana

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు 100 కోట్ల నిధులు మంజూరు

– ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు
– హర్షం వెలిబుచ్చిన బ్రాహ్మణ సంఘాలు
– మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు సంఘ నేతల కృతజ్ఞతలు
– మీ చొరవ వల్లే నిధులని ప్రశంస
– త్వరలో సీఎం, డిప్యూటీసీఎం, దుద్దిళ్లకు భారీ సన్మానసభ
– అఖిల భారత ఫెడరేషన్ అధ్యక్షుడు ద్రోణంరాజు రవికుమార్ వెల్లడి

హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆధ్వర్యములో తెలంగాణా రాష్ట్రం ప్రభుత్వం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ కు రు.100 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు రాష్ట్ర బ్రాహ్మణ సంఘాలు కృతజ్ఞతలు తెలియచేసాయి. అసెంబ్లీ ఆవరణలో ఐ టి,పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ని కలసి ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియ చేసారు.

ఈ సందర్భంగా అఖిల భారత బ్రాహ్మణ ఫెడరేషన్ కార్యదర్శి తులసి శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాబోయే నిధులతో విదేశీ విద్యకు దరఖాస్తుదార్లుకు సెకండ్ సెమిష్టర్ ఫీసులు చెల్లించే అవకాశముందని తెలియచేసారు. అఖిల భారత ఫెడరేషన్ ఉపాధ్యక్షులు ద్రోణంరాజు రవికుమార్ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి ,ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క లు బ్రాహ్మణులకు చేసిన సహాయం మరువలేనిదని ,అతి త్వరలో రాష్ట్ర క్యాబినెట్ మంత్రులకు రాజధానిలో ఘనంగా సత్కార సభ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

వనస్థలిపురం బ్రాహ్మణ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు పోచంపల్లి శ్రీధర రావు,నందిరాజు లక్ష్మీ నారాయణ, బడంగ్ పేట, రంగారెడ్డి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు మంగు రాఘవ రావు,బ్రాహ్మణ సంక్షేమ వేదిక అధ్యక్షులు బాల శ్రీనివాస్, ఉపాధ్యక్షురాలు అవ్వా విజయ లక్ష్మి , వట్టెం శేషుకుమార్ రాజ్యలక్ష్మి ,సిరిపురం నరేందర్, బొడుప్పల్ బ్రాహ్మణ సంఘం కార్యదర్శి నంద కిషోర్ జోషి ,రఘునందన్,పొత్తూరి చంద్ర శేఖర్,అక్కిరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE