కొత్త పార్లమెంటులో వైకాపాకు 11వ నంబరు రూమ్ కేటాయించగానే.. స్పీకర్ దగ్గర కాళ్లావేళ్లా పడి 12వ నంబరు కేటాయించుకున్నారు. రేపు ప్రశ్నోత్తరాలు, శూన్యగంట (జీరో అవర్) ముగియగానే అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. అది కూడా సరిగ్గా 11:11 నిమిషాలకు వస్తే ఎలా అని ఆలోచించిన ఒక వైకాపా ‘మేధావి’, కొశ్చన్ అవర్లో కొన్ని ప్రశ్నలు సంధించి సమయాన్ని వృధాచేసి, 12 గంటల పైకి వచ్చేలా చేయాలని సలహా ఇచ్చారట! ఢిల్లీలో వేరే పార్టీ ఎంపీతో ఈ విషయం కదిపితే.. “సాధారణంగా బిల్లుల వంటి బిజినెస్ అవర్ మధ్యాహ్నం 2 గంటలకు వస్తుంది.. ఆ మాత్రం తెలియకుండా ఈ ‘11’ టెన్షన్ ఏంటి?” అని చివాట్లు పెట్టారని సమాచారం.