-ఇక ప్రతి శనివారం హౌసింగ్ డే
-ఎంపీ విజయసాయి రెడ్డి
ఏప్రిల్ 29: ‘పేదలందరికీ ఇళ్లు’ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఏడాది రూ. 15,810 కోట్లు ఖర్చు చేయనున్నట్లు రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలను వెల్లడించారు. పేదల ఇళ్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రూ.10,203 కోట్లు ఖర్చు చేసిందని అన్నారు. ఈ మేరకు ప్రతి శనివారం హౌసింగ్ డే నిర్వహించనున్నట్లు సీఎం జగన్ వెల్లడించారని అన్నారు. పెద్ద ఎత్తున గృహ నిర్మాణాలతో ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని అన్నారు.
మే 9 నుంచి ‘జగనన్నకు చెబుదాం’
ప్రభుత్వ సేవల్లో సమస్యలు, సలహాలను నేరుగా ముఖ్యమంత్రికి తెలియజేయటానికి మే 9 నుంచి ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి ప్రజలతో నేరుగా ఫోన్ లైన్ లో మాట్లాడే విధంగా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ సేవల్లో సమస్యలు, సలహాలను ప్రజలు నేరుగా తెలియజేయవచ్చని అన్నారు. గ్రీవెన్స్ లు నమోదు కోసం 1902 హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దొంగిలించబడిన ఫోన్లు రికవరీ లో అద్బుత ప్రగతి
దొంగిలించబడిన ఫోన్ల రికవరీలో ఏపీ పోలీస్ 100 గణనీయమైన ప్రగతి సాధించిదని ఎంఎంటీఎస్ (మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం) టెక్నాలజీ ఉపయోగించి వేల సంఖ్యలో దొంగలించబడ్డ ఫోన్లు రికవరీ చేయడం ప్రశంసనీయమని విజయసాయి రెడ్డి తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చేపట్టిన చర్యలు అద్భుత ఫలితాలనిచ్చాయని అన్నారు.
నేషనల్ మెడికల్ డివైస్ పాలసీ-2023 తో ఇండియా స్వయం సమృద్ధి
కేంద్ర మంత్రి వర్గం నేషనల్ మెడికల్ డివైస్ పాలసీ-2023 ని ఆమోదించిన అనంతరం ఇండియా వైద్య పరికరాల రంగంలో త్వరితగతిన స్వయం సమృద్ది సాధిస్తుందని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. దేశీయంగా హెల్త్ కేర్ అవసరాలు తీర్చడంతో పాటు ఇతర దేశాల హెల్త్ కేర్ అవసరాలను తీర్చగల సత్తా భారతదేశానికి ఉందని అన్నారు. నేషనల్ మెడికల్ డివైస్ పాలసీ-2023 ద్వారా భారతదేశం ప్రస్తుతం ఉన్న 11 బిలియన్ల యూఎస్ డాలర్ల నుంచి 2030 నాటికి 50 బిలియన్ డాలర్లకు చేరుకోగలదని అంచనా వేశారు.
పాలసీ ఆమోదిస్తే వైద్య పరికరాల రంగంలో కొత్త పరిశ్రమలు ఏర్పడతాయని, ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తాయని అన్నారు. అన్ని రకాల మెడికల్ పరికరాలు ఇండియాలోనే తయారవుతాయని తద్వారా దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది ఆయన అన్నారు.