Suryaa.co.in

Andhra Pradesh

లోకేశ్ పాదయాత్రతో టీడీపీకి 1983 నాటి ప్రభంజనం ఖాయం

– జగన్ రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల మద్దతుతో యువగళం పాదయాత్ర వేయి కి.మీ పూర్తైంది
– యువగళం పాదయాత్ర వేయి కి.మీ పూర్తైన సంధర్బంగా జాతీయ కార్యాలయంలో సంబరాలు

వైసీపీ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల మద్దతుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా 1000 కి.మీ పూర్తి చేసుకోవడం అభినందనీయమని టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు. లోకేష్ యువగళం పాదయాత్ర 1000 కి.మీ ల మైలు రాయిని చేరుకోవడం పట్ల మంగళగిరిలో కేంద్ర కార్యాలయం వద్ద నేతలు కేక్ కట్ చేసి లోకేష్ కు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ… యువగళం పాదయాత్రతో ప్రజల్ని చైతన్యవంతం చేయడంలో లోకేష్ విజయవతమైయ్యారని అన్నారు. అన్ని వర్గాల ప్రజలతో రోజుకో అంశంపై చర్చించి రాబోయే టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు ఏవిధంగా మేలు చేస్తామో చెప్పడంతో పాటు కొన్ని కొన్ని సమస్యలకు పరిష్కార మార్గాలను చూపిస్తున్నారని అన్నారు. ప్రతి 100 కి.మీ స్ధానిక సమస్యలపై ఒక హామీ ఇస్తూ… అధికారంలోకి రాగానే నెరవర్చేందుకు ప్రణాళికబద్దంగా ముందుకెళ్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని అన్నారు.

జగన్ రెడ్డి పాలనలో యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. టీడీపీతోనే యువత భవిత అని నమ్మి యువత అంతా లోకేష్ కి బ్రహ్మరధం పడుతున్నారు. యాత్రలో భాగంగా ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు చేస్తున్న అవినీతిని, అధికార పార్టీ దోపిడీని ప్రశ్నిస్తూ ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారని అన్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే 25కు పైగా కేసులు పెట్టినా.. అనేక ఇబ్బందులు సృష్టించినా.. వెనకడుగు వేయకుండా ప్రజలతో మమేకమౌతున్నారని అన్నారు.

లోకేష్ యువగళం పాదయాత్రతో జగన్ రెడ్డి వెన్నులో వణుకుపడుతుంది. వైసీపీ నాయకులు రోజులు లెక్క పెట్టుకుంటున్నారు. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని ప్రజలు గుర్తించారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటూ మండుటెండలో సైతం అనారోగ్య సమస్యలను లెక్కచేయక 1000 కి.మీ ల మేర యాత్ర పూర్తి చేసిన నేపథ్యంలో పుల్లారావు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.

పొలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమామహేశ్వరావు మాట్లాడుతూ….. లోకేష్ చేపట్టిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. లోకేశ్ పాదయాత్రతో జగన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. ఆ భయంతోనే పాదయాత్రకు అడుగడుగునా ఆటంకాలు సృష్టించారు. ప్రజలతో మాట్లాడకుండా మైక్ లాక్కున్నారు, స్టూల్ లాక్కున్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారు. జగన్ రెడ్డి తన స్వార్ధం కోసం పోలీసు వ్యవస్ధను దిగజార్చారు. జగన్ రెడ్డి ఎన్ని ఆటంకాలు సృష్టించిన ప్రజల మద్దతులో లోకేష్ దిగ్విజయంగా 1000 కి.మీ పూర్తి చేశారని అన్నారు. లోకేష్ చేపట్టిన 4000 కి.మీ పాదయాత్రను కూడా పూర్తి చేసి రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చబోతున్నారు. లోకేష్ యాత్రకు అండగా ఉంటాం.

మాజీ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ… లోకేష్ పాదయాత్ర 1000 కి.మీ పూర్తి చేసుకుని లక్ష్యం వైపు వడివడిగా అడుగులేస్తున్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించిన పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. యువగళం పాదయాత్రకు యువత పెద్ద ఎత్తున సంఘీభావం తెలియజేస్తుంది. వైసీపీ ప్రభుత్వంలో దగాపడ్డ యువత లోకేష్ వైపు ఆశగా చూస్తున్నారు. స్థానిక సమస్యలు, టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వ అవినీతిపై ప్రధానంగా చర్చించడంతో లోకేష్ లోని రాజకీయ పరిణితి పెరిగింది. రాబోయే రోజుల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయం.

మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ… పట్టుదల, సంకల్పంతో లోకేష్ ప్రజలతో మమేకమౌతున్న తీరు అద్భుతం. ప్రతికూల పరిస్థితుల్లో సైతం 1000 కి.మీ పాదయాత్ర పూర్తి చేయడం అభినందనీయం. ప్రతి 100 కి.మీ పాదయాత్ర పూర్తి చేసిన నేపథ్యంలో ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం అభినందనీయం. టీడీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి, వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను ప్రజలకు అర్థమయ్యేలా విడమరిచి చెబుతున్నారు. కాబట్టే తాడేపల్లి ప్యాలెస్ వర్గాలు భయపడుతున్నారు. యువగళం పాదయాత్ర ద్వారా వైసీపీ నేతల అవినీతిని సెల్ఫీ రూపంలో ఎండగడుతున్నారు. కాబట్టే పాదయాత్రను అడ్డుకునేందుకు అనేక కుట్రలు చేశారు. పోలీసులు సైతం అధికార పార్టీ నేతలకు ఊడిగం చేస్తూ అడ్డుంకులు సృష్టించిన వెనకడుగు వేయకుండా లోకేష్ ముందుకు సాగుతున్నారు.

జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ… లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజలే రక్షణ కవచంలా ఉంటూ కాపాడుకుంటున్నారు. ముఖ్యంగా యువత పాదయాత్రకు పూర్తిస్థాయిలో మద్దతు పలుకుతున్నారు. అన్ని వర్గాల ప్రజల సమస్యలను తెలుసుకుంటూ భవిష్యత్తులో వారికి ఏవింధంగా భరోసా కల్పిస్తామో తెలయజేస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. ప్రతి మైలు రాయి పూర్తి చేసుకున్న తరుణంలో ఒక మంచి చేసే కార్యక్రమాని శ్రీకారం చుట్టడం అభినందనీయం.

కోవెలమూడి రవీంద్ర కుమార్ మాట్లాడుతూ… లోకేష్ పాదయాత్ర చూసి తాడేపల్లి ప్యాలెస్ ఉలిక్కిపడుతుంది. యువగళం పాదయాత్రలో ప్రజలకు భరోసా కల్పిస్తూ భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేస్తామో చెబుతూ 1000 కి.మీ పాదయాత్ర పూర్తి చేయడం శుభపరిణామం. బాబాయి హత్య కేసులో అడ్డంగా ఇరుక్కుపోయిన జగన్ కు రాబోయే రోజుల్లో శిక్ష పడటం ఖాయం. ఎన్ని అడ్డంకులు సృష్టించిన లోకేష్ తన 4000 కి.మీ పాదయాత్ర పూర్తి చేయాలని ఆ భగవంతుడ్ని కోరుకుంటున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు, పోతినేని శ్రీనివాసరావు, తమ్మిశెట్టి జానకిదేవి, డేగల ప్రభాకర్, తెలుగు యువత కిలారు నాగ శ్రవణ్ , కనుపర్తి శ్రీనివాస్, చిట్టాబత్తిన శ్రీనివాసరావు, బుచ్చి రాం ప్రసాద్, సుఖవాసి శ్రీనివాస్, రావిపాటి సాయికృష్ణ, సందిరెడ్డి గాయత్రి, కసుకుర్తి హనుమంతరావు, ఆరుద్ర భూలక్ష్మి, టి ఎన్ టి యు సి రఘరామరాజు, పర్చూరి ప్రసాద్, ఆకుల జయసత్య, తెలుగు రైతు రాజశేఖర్ రెడ్డి, చప్పిడి రాజశేఖర్, సాయిరాం గౌడ్, పార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్ర బాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE