Suryaa.co.in

Andhra Pradesh

జగన్ రాజకీయాల్లో ఓ బచ్చా

– పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా..కాపాడుకుంటా
– టిడిపిని జగన్ ఏమీ చెయ్యలేరు…ఇది ఎన్టీఆర్ పెట్టిన పార్టీ
– కిలోమీటరుకు 150 గుంతలు ఉన్నాయి
– విజయసాయిరెడ్డి పోయి సుబ్బారెడ్డి వచ్చాడు
– అనకాపల్లి జిల్లా చోడవరం ఎన్టీఆర్ స్ఫూర్తి – చంద్రన్న భరోసా సభ సభలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు

అనకాపల్లి జిల్లా చోడవరం బహిరంగసభలో టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు వైసీపీ సర్కారుపై విరుచుకుపడ్డారు. ఊహించిన దానికంటే.. అంచనాలకు మించి వచ్చిన జనాలను చూసి చంద్రబాబు లో హుషారు కనిపించింది. సీఎం జగన్, ఎంపీANAKAPALLI1
విజయసాయిరెడ్డి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. విజయసాయి, సుబ్బారెడ్డికి విశాఖలో ఏం పని అని ప్రశ్నించారు. ఉన్న రాజధానికే తట్ట మట్టి తీయని జగన్, మూడు రాజధానులేం కడతారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. జగన్ రాజకీయాల్లో ఓ బచ్చా అని ఫైరయ్యారు. చంద్రబాబు నాయుడు ఇంకా ఏమన్నారంటే…

చోడవరం సభతో జగన్ ప్రభుత్వ పతనం మొదలయ్యింది.టిడిపిని జగన్ ఏమీ చెయ్యలేరు…ఇది ఎన్టీఆర్ పెట్టిన పార్టీ.చాలా మంది టిడిపి పని అయిపోతుంది అని కలలుగన్నారు…అలా కలలుగన్నవారి పని అయిపోయింది. జగన్ రాజకీయాల్లో ఓ బచ్చా…పరిపాలనలో ఓనమాలు తెలియని వ్యక్తి జగన్.

ప్రభుత్వం వేధిస్తున్న పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా..కాపాడుకుంటా.
• తెలుగు దేశం ఆవిర్భావంతో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికి తెలియాలి. ప్రజల్లో చర్చ జరగాలి. మీ ఊళ్లో ఒక రోడ్డు వేసినా, మంచి నీటి పథకం వచ్చినా, సాగునీరు వచ్చినా టిడిపి వల్లనే. రాష్ట్రంలో సామాజిక న్యాయం తెచ్చింది ఎన్టీఆర్…ఎర్రం నాయుడుని కేంద్రANAKAPALLI2
మంత్రిని చేసింది టిడిపి. అయ్యన్న పాత్రుడు లాంటి వారికి అవకాశాలు ఇచ్చింది టిడిపి. ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఎవరు పెత్తనం చేస్తున్నారు….ఎ2 ఇక్కడ పెత్తనం చేస్తున్నారు. ఎ2కు ఇక్కడ ఏంపని? విశాఖలో తట్ట మట్టి వెయ్యలేని జగన్ మూడు రాజధానులు కడతా అంటున్నాడు. రాష్ట్రంలో రోడ్ల గుంతలకు మట్టి వెయ్యలేని ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతాడా? కిలోమీటరుకు 150 గుంతలు ఉన్నాయి. ఇదీ రోడ్ల పరిస్థితి.

విజయసాయిరెడ్డి పోయి సుబ్బారెడ్డి వచ్చాడు. ఉత్తరాంధ్రపై వీళ్ల పెత్తనం ఏంటి? ఇదే సామాజిక న్యాయం అంటున్న వైసిపికి ఉత్తరాంధ్ర ప్రజలు ఒక్క సీటు గెలిపించకుండా బుద్ది చెప్తారు. బంగారం లాంటి కోనసీమలో క్రాప్ హాలిడే కి కారణం ఎవరు? ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో కూడా క్రాప్ హాలిడే ఇచ్చారు. సిఎం కళ్లు తెరవాలి. రైతులకు ఇన్స్యూరెన్స్ అని జగన్ ఉత్తిత్తి బటన్ నొక్కుతున్నాడు. దైర్యం ఉంటే నిజమైన బటన్ నొక్కు…వివరాలు అన్నీ బహిరంగ పరుచు.

ప్రజల కట్టే ట్యాక్సులతో సొంత పేపర్ లకు ప్రకటనలు ఇస్తున్నాడు. టీచర్ల పోస్టులు ఎందుకు భర్తీ చెయ్యడం లేదు…టీచర్లను బ్రాందీ షాపుల వద్ద పెట్టినప్పుడే వ్యవస్థ కుప్పకూలింది. తల్లితండ్రి తరువాత గౌరవించే గురువులను జగన్ పంగనామాలు పెట్టి అవమానించాడు. జగన్ విద్యా వ్యవస్థను నాశనం చేశారు….టెన్త్ లో ఎందుకు ఇంత మంది ఫెయిల్ అయ్యారు.

జగన్ సిఎంగా ఉన్నంత కాలం రాష్ట్రంలో ఎవరూ పెట్టుబడులు పెట్టరు…..ఉద్యోగాలు రావు. జగన్ చెప్పిన ఇంగ్లీషు మీడియం ఏమయ్యింది. మమ్మీ డాడీ అంటే ఉద్యోగాలు ఇచ్చేస్తారా? తెలుగు దేశం ఐటి ఉద్యోగాలు ఇస్తే….జగన్ వాలంటీర్ ఉద్యోగం ఇచ్చాడు.
మనం 50 వేలు జీతం వచ్చే ఉద్యోగాలు ఇస్తే…జగన్ 5 వేల రూపాయల జీతం వచ్చే ఉద్యోగం ఇచ్చాడు.

రాష్ట్రంలో యువత బయటకు రావాలి…..జగన్ ను రాజకీయాల నుంచి వెళ్లగొట్టాలి. అందుకే క్విట్ జగన్..సేవ్ ఆంధ్ర ప్రదేశ్. 40 ఏళ్లలో ప్రజల పై ఇంత బాదుడు అనేది ఎప్పుడూ లేదు. మద్యంలో అవినీతి కొత్త చరిత్ర…ఇలా కూడా చెయ్యవచ్చా అని నాకేANAKAPALLI5 అనిపించింది. మద్యంలో సొంత బ్రాండ్లు తేవచ్చు అని ఎప్పుడూ ఎవరూ ఊహించలేదు.మద్యం తయారీ, డిస్ట్రిబ్యూషన్, షాపులు నిర్వహణ అన్నీ జగనే చేస్తున్నాడు.ప్రజలు తాగే మద్యం లో జగన్ వాటా నేరుగా ఆయనకే వెళ్లిపోతుంది. జంగారెడ్డి గూడెంలో నాటుసారా తాగి 29 మంది చనిపోతే వాటిని జగన్ సహజమరణాలు అన్నాడు. జగన్ కు ప్రజల ప్రాణాలు అంటే విలువ లేదు.

జగన్ ది ఐరన్ లెగ్. పేపర్ తీస్తే చావు వార్తలే.అనకాపల్లిలో అమోనియా లీక్ ఘటనలో 180 మంది ఆసుపత్రి పాలయ్యారు. ఇంటి పన్ను, రిజిస్ట్రేషన్ చార్జి పెంచారు. చెత్త పన్ను వేశారు. ఇప్పుడు వాహనాల ఫ్యాన్సీ నెంబర్ కూడా పెంచారు.పరిశ్రమలకు ఇచ్చే నీటి రేట్లను పెంచిన ప్రభుత్వం ఇది.మనల్ని పన్నులతో బాదుతున్న ముఖ్యమంత్రిని ప్రజలు తిరిగి బాదాలి.
నర్సీపట్నంలో సుధాకర్ అనే డాక్టర్ మాస్క్ అడిగితే ఆయనను హింసించి చంపేశారు నర్సీపట్నంలో సెల్ ఫోన్ లైటింగ్ తో మహిళకు డెలివరీ చేసినందుకు జగన్ సిగ్గు పడాలి. 4 గురు మాజీ మంత్రులను అరెస్టు చేశారు. 60 మంది ప్రజా ప్రతినిధులపై కేసులు పెట్టారు. పల్నాడులో బడుగులను చంపేస్తున్నారు. ఇది మనం తిరుగుబాటు చెయ్యాల్సిన సమయం.

వివేకా హత్య గుండెపోటు అని నాటకం ఆడింది ఎవరు….ఇప్పటికి అయినా ఇది గొడ్డలి పోటు అని జగన్ అంగీకరించాలి. వివేకా హత్య కేసులో సాక్షులు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సాక్ష్యులను కూడా బతకనివ్వడం లేదు. పోలీసులు ఆత్మవిమర్శ చేసుకోవాలి….సరెండర్ లీడ్స్ వస్తున్నాయా, డిఎలు వస్తున్నాయా….పిఎఫ్ వస్తుందా….
అనంతపురంలో ఒక కానిస్టేబుల్ జీతం రావడం లేదు అని ప్రశ్నిస్తే అతన్ని సస్పెండ్ చేశారు.బాధితులు అయిన పోలీసులకు టిడిపి అండగా ఉంటుంది. విశాఖ ఎయిర్ పోర్టు లో కొడి కత్తి దాడి జరిగింది…ఇప్పుడు ఏమయ్యింది. కోడికత్తి నాటకం తో జగన్ సానుభూతి సంపాదించాడు…బాబాయి హత్య నాపై నెట్టి సానుభూతి పొందాడు.

దళిత డ్రైవర్ ను చంపిన ఎమ్మెల్సీకి పాలాభిషేకం చేసిన వైసిపి తమకు ఏం గతి పడుతుందో గుర్తుపెట్టుకోవాలి. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఉద్యమం చేస్తే అరెస్టు చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును ఇప్పటికీ ఇంటరాగేషన్ కు తీసుకోలేదు. జగన్ కారణంగాANAKAPALLI6 పోతున్న ప్రతి ప్రాణం జగన్ కు ఉరితాడు అవుతుంది. ఎమ్మెల్సీ చేసిన హత్యను కప్పిపుచ్చేందుకు కోనసీమలో చిచ్చు పెట్టారు.కోనసీమపై సిగ్గుంటే చర్యలు తీసుకోవాలి…చేతకాకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలి. కొంత మంది పోలీసులు తప్పుడు కేసులు పెట్టి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేస్తున్నారు. అరెస్టు చేసిన పార్టీ నేతల పేరు చెప్పమని పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. విచారణలో పోలీసులు బ్యాడ్జ్ పెట్టుకోకపోతే వాళ్లు పోలీసులా…వైసిపి గూండాలా…ఎలా తెలుస్తుంది.

రివర్స్ పాలన చేస్తున్న జగన్ కు రివర్స్ ట్రీట్మెంట్ ఇస్తాం. విచారణ సమయంలో అడ్వకేట్ ఉండాలని పోలీసుల వద్ద పట్టుపట్టండి. ప్రతి కార్యకర్తకు భరోసాగా నేను ఉంటాను…పోలీసులు రక్షకులుగా ఉండాలి.తప్పు చేస్తున్న పోలీసులకు ఎవరినీ వదిలేది లేదు. జగన్ మాట వింటే పోలీసులు జైలుకు వెళతారు.

సుప్రీం కోర్టు ఆదేశాలు పాటించకుండా తప్పు చేస్తే పోలీసులు మూల్యం చెల్లిస్తారు.మాట వివని పోలీసులను ఈ ప్రభుత్వం ఇబ్బంది పెడితే అధికారం వచ్చిన తరువాత అండగా ఉంటాం. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకం ఏమయ్యింది…పోలవరం ఏమయ్యింది. రివర్స్ టెండరింగ్ అనే పేరు పెట్టి…..పోలవరం ప్రాజెక్టులను దెబ్బతీశారు.అనకాపల్లి షుగర్ ఫ్యాక్టరీ తెరుస్తాం అన్నారు…ఇప్పుడు ఏం చేశారు. రాష్ట్రంలో అనకాపల్లి బెల్లం నెంబర్ వన్ బెల్లం. బెల్లం రైతులను ఆంక్షలతో తీవ్రంగా వేధిస్తున్నారు. బెల్లం రైతులను వేధించవద్దని టిడిపి హయాంలో జీవో తెచ్చాం. వైసిపి గడప గడపకూ వచ్చిన వారి ప్రజలు ప్రశ్నించాలి.

ఎందుకు ఇసుక రేటు పెరిగింది, ఎందుకు మద్యం రేటు పెరిగింది…ఎందుకు ధరలు పెరిగాయి అని ప్రజలు వైసిపి నేతలను నిలదీయాలి. ముఖ్యమంత్రి కబ్జాకు రుషికొండకు బలైపోయింది. నేను వెళతాను అంటే ఎందుకు వెళ్లనీయలేదు.. ప్రభుత్వం తప్పు చెయ్యకపోతే నన్ను ఎందుకువెళ్లనీయలేదు. రాష్ట్రంలో ఎమ్మెల్యేలు నేరాలు, హత్యలు, కబ్జాలు…ఇవే నవరత్నాలు
నేను పోరాటానికి సిద్దంగా ఉన్నాను. యువత కలిసి రావాలి. ప్రతి ఇంట్లో జెండా పట్టుకోవాలి.ప్రభుత్వం కేసులు పెడితే ఏమవుతుంది….స్వాతంత్ర్యం కోసం పోరాడినట్లు ఇప్పుడూ పోరాడాలి. జగన్ రెడ్డి నాకు వయసు అయిపోయింది అనుకుంటున్నాడు. నేను అందరికంటే ఎక్కువ పని చేస్తా….ఉదయం నుంచి రాత్రి వరకు అంతే ఉత్సాహంగా పనిచేస్తా నా అవసరం రాష్ట్రానికి ఉందని నాడు బ్లాస్టింగ్ లో వెంకటేశ్వర స్వామి నన్ను బతికించారు.

2014లో 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా…ఎక్కడా లోటు లేకుండా పాలన చేశాను.లోటు బడ్జెట్ ఉన్నా అన్నా క్యాంటీన్ ఇచ్చాను. పథకాలు అమలు చేశాను.మంగళగిరిలో అన్నా క్యాంటీన్ పెడితే ఎందుకు అడ్డుకున్నారు.రాష్ట్రాన్ని జగన్ 30 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లారు…మళ్లీ రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత టిడిపి తీసుకుంటుంది.రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం….పూర్వ వైభవం తెస్తాం.ఒక్క సారి అని కరెంట్ తీగ పట్టుకుంటే ఎలా అని నాడే చెప్పాను. కానీ జగన్ కు ఓటేశారు.రాష్ట్రంలో ప్రతి వర్గం ఆలోచించాలి…..నాకు ముఖ్యమంత్రి పదవి కొత్తకాదు. రాష్ట్రం సర్వనాశనం అయ్యింది…..రాష్ట్రం కోసమే నా ఆలోచన. అందుకే నేను ఈ ఎన్నికలను సవాల్ గా తీసుకుంటున్నా…అంతా కలిసి రావాలి. అనకాపల్లి పార్లమెంట్లో గ్రావెల్ మాఫియా ఉంది…భూ కబ్జాలు ఉన్నాయి. చోడవరం లో జిల్లా మహానాడును సక్సెస్ చేసిన నేతలకు అందరికీ అభినందనలు. ఘన స్వాగతం పలికిన కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు.

LEAVE A RESPONSE