అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ క్యాడర్ స్ట్రెంత్‌ను 144 నుంచి 174కు పెంచుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం బుధవారం గెజిట్‌లో ప్రచురించింది.ఈ క్యాడర్ పెంపు వల్ల రాష్ట్రానికి అదనంగా మరో 30 మంది ఐపీఎస్‌లను కేంద్రం కేటాయించనుంది.
సీనియర్ డ్యూటీ పోస్టుల్లో 95 మంది అధికారులను,కేంద్ర డిప్యుటేషన్‌కు రిజర్వుగా 38 మందిని, రాష్ట్రాల డిప్యుటేషన్‌కు రిజర్వుగా 28 మందిని కేటాయించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా 121 మందిని, పదోన్నతుల ద్వారా 53 మంది ఐపీఎస్‌లను ఇవ్వనుంది. వీటికి సంబంధించిన వివరాలన్నీ గెజిట్ నోటిఫికేషన్లో ప్రస్తావించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్‌కుమార్ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.