– విశాఖపట్నంలో 40వేలకోట్ల రూపాయల భూములు దోచుకున్నారు, ఎవడబ్బ సొమ్ము?
– బొత్స సత్తిబాబుకు కనీసం ఒక టీచర్ ను ట్రాన్స్ ఫర్ చేసే అధికారం లేదు
– రాజాం శంఖారావం సభలో టిడిపి ఇన్చార్జి కోండ్రు మురళి
రాష్ట్రంలో సైకో సిఎం నేతృత్వంలో దుర్మార్గమైన పాలన కొనసాగుతోంది. అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను అమలు చేయలేని అసమర్థుడు జగన్. 31 మంది ఎంపిలున్నా స్పెషల్ స్టేటస్ ను పట్టించుకోలేదు. పోలవరాన్ని గత ప్రభుత్వంలో 72శాతం పూర్తిచేస్తే అయిదేళ్లలో జగన్ 5శాతం కూడా పూర్తిచేయలేకపోయారు. ఈరోజు అరాచకాన్ని ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టి, దాడులు చేస్తున్నారు.
విజనరీ సిఎం చంద్రబాబు నేతృత్వంలో ఎంతోమంది పేదల జీవితాల్లో మార్పులు వచ్చాయి. హైటెక్ సిటీ నిర్మాణం కారణంగా లక్షలాదిమంది యువతకు ఉపాధి అవకాశాలు లభించాయి. 14 ఏళ్లు సిఎంగా చేసిన చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టారు, ఉచితంగా ఇసుక ఇచ్చినందుకు, రాష్ట్రానికి పరిశ్రమలు తెచ్చినందుకు జైలులో పెడతారా? మన నేతను జైలులో పెట్టినపుడు 80దేశాల్లో ఆందోళనలు జరిగాయంటే ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్న అభిమానాన్ని చాటిచెబుతోంది.
జగన్మోహన్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై నమ్మకంలేదు, ఎస్సీ, ఎస్టీ, బిసి ప్రజాప్రతినిధులకు అధికారలు ఇవ్వకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. బొత్స సత్తిబాబుకు కనీసం ఒక టీచర్ ను ట్రాన్స్ ఫర్ చేసే అధికారం లేదు.సాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిధున్ రెడ్డి, తాడేపల్లి గుమాస్తా సజ్జల రాష్ట్రాన్ని ప్రాంతాలవారీగా దోచుకుంటున్నారు. త్వరలో వారు కటకటాలు లెక్కపెట్టడం ఖాయం.
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని జగన్ 43వేల కోట్ల అవినీతికి పాల్పడి 16నెలలు జైలుశిక్ష అనుభవించారు. గత అయిదేళ్లలో ల్యాండ్, శ్యాండ్, వైన్, మైన్ పేరుతో లక్షకోట్లు దోచుకున్నారు. విశాఖపట్నంలో 40వేలకోట్ల రూపాయల భూములు దోచుకున్నారు, ఎవడబ్బ సొమ్ము? ఇలాంటి దొంగలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిన అవసరం ఉంది. 175 నియోజకవర్గాల్లో వైసిపిని ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించాలి.
లోకేష్ స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీలో చదివారు, అక్కడ చదివినవారు ఆర్థికవేత్తలయ్యారు. యువనేత లోకేష్ తెలుగుదేశానికి మరో 30ఏళ్లు దశ,దిశ నిర్దేశించబోతున్నారు. చంద్రబాబుపై అక్రమకేసులు బనాయించినపుడు బేషరతుగా మద్దతు ఇచ్చిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు.
బొత్స ఓ అవినీతి తిమింగళం: టిడిపి అధ్యక్షుడు కిమిడి నాగార్జున
నాలుగున్నరేళ్లుగా ఒక మూర్ఖుడు పాలనలో రాష్ట్రప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.సంక్షేమం మాటును పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు. రూ.10 ఇచ్చి వందలాగేస్తున్నారు.జగన్ పాలనకు వ్యతిరేకంగా సొంత చెల్లి మాట్లాడినా సహించలేక సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిస్తున్నారు.
రాష్ట్రంలో స్థానికంగా ఇసుక దొరక్కుండా చేసి పొరుగురాష్ట్రాలకు తరలిస్తూ కోట్లు కొల్లగొడుతున్నారు.టిడిపికి చెందిన సీనియర్ నాయకులు అచ్చెన్న, కళావెంకట్రావు, కొల్లు రవీంద్ర వంటి బిసి నాయకులపై తప్పుడు కేసులు బనాయించారు.జగన్ కు బుద్ధిచెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ ఓ అవినీతి తిమింగళం, ఓక్స్ వ్యాగన్ వెళ్లిపోవడానికి బొత్స కారణం కాదా?మున్సిపల్ మంత్రిగా ఉన్నపుడు ఆయన రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి శూన్యం.మంత్రి బొత్స నేతృత్వంలో విద్యాశాఖలో కూడా అవినీతి రాజ్యమేలుతోంది, విద్యార్థులకు నాసిరకం కిట్లు ఇస్తున్నారు. టీచర్ల బదిలీల్లో సైతం నిబంధనలను ఉల్లంఘించి భారీగా అక్రమార్జనకు పాల్పడుతున్నారు.
మనకు ఒక రాజధాని ఉండాలన్నా, అభివృద్ధి జరగాలన్నా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలి.పాలకొండ – రాజాం మధ్య రహదారిని రాష్ట్రంలో ఎక్కడాలేనంత చెత్తగా తయారుచేశారు. చంద్రబాబు అరెస్టయినపుడు పవన్ కళ్యాణ్ వచ్చి సంఘీభావం తెలపడం అభినందనీయం.రాష్ట్రంలో యువతకు నేనున్నానని భరోసా ఇచ్చి లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తే అనేక అడ్డంకులు సృష్టించారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆయన ఎక్కడా తగ్గలేదు, దండయాత్ర మాదిరిగా రాష్ట్రమంతా తిరిగారు.రాబోయే ఎన్నికల్లో టిడిపి-జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించేందుకు ఇరుపార్టీల కార్యకర్తలు ఐకమత్యంగా పనిచేయాలి.
ఇక్కడ పనికిరాని వాడు అక్కడ ఎలా పనికివస్తారు?
– జనసేన సమన్వయకర్త వై.రాజు
పేదవాడికి కూడు,గూడు, గుడ్డ కల్పించాలన్న లక్ష్యంతో 1983లో ఎన్టీఆర్ తెలుగుదేశంపార్టీని స్థాపిస్తే, ఈరోజు ఆయన మనవడు అరాచకపాలనపై గళమెత్తుతూ ప్రజలముందుకు వచ్చారు. రాజాం నియోజకవర్గంలో ఎక్కువమంది ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో పేదలు అధికంగా ఉన్నారు.
రాజాం నుంచి పాలకొండకు 20కిలోమీటర్లు . 4.10 సంవత్సరాల్లో ఎంతోమంది ఈ రోడ్డుపై వెళ్తూ ప్రాణాలు కోల్పోయారు, ఎవరూ పట్టించుకోలేదు. మేం ధర్నాలు, పాదయాత్ర చేసినా పట్టించుకోలేదు. స్థానిక ఎమ్మెల్యే కంబాల జోగులు ఇక్కడ ఇక గెలవడన్న ఉద్దేశంతో మరో నియోజకర్గానికి బదిలీచేశారు. ఇక్కడ పనికిరాని వాడు అక్కడ ఎలా పనికివస్తారు?
తోటపల్లి రిజర్వాయర్, మడ్డువలసపై ఆధారపడి రైతులు జీవిస్తున్నారు. మడ్డువలస కాల్వల నుంచి తట్టెడు మట్టితీసిన పాపాన పోలేదు. పర్యాటకం తీర్చిదిద్దుతామని గాలికొదిలేశారు.జగన్మోహన్ రెడ్డికి కమీషన్లు వచ్చే పనులు తప్ప ప్రజల సంక్షేమానికి అవసరమైన కార్యక్రమాలు చేపట్టడం లేదు.ఇప్పుడు రాష్ట్రమంతా లోకేష్ బాబు చేతిలో రెడ్ బుక్ పైనే సాగుతోంది. జగన్ కు ఎవరైతే బానిసత్వం చేస్తున్నారో వారంతా భయంతో వణికిపోతున్నారు.
పవన్ కళ్యాణ్ పై ఆశలు పెట్టుకున్న నిరుద్యోగ యువత, విద్యార్థులకోసం మన ప్రభుత్వం వచ్చాక కార్యక్రమాలు చేపట్టండి. జనసేన-టిడిపి ప్రభుత్వం వచ్చాక రాజాంలో సాఫ్ట్ వేర్ కంపెనీని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోండి. రాష్ట్రంలో 600మంది కౌలురైతులు చనిపోతే పవన్ కళ్యాణ్ సొంతడబ్బుతో వారందరికీ ఆర్థికసాయం అందించారు. విశాఖలో బోట్లు కాలిపోతే పవనన్న వెంటనే స్పందించారు.
నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారని నమ్మి పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు మద్దతు తెలిపారు. లోకేష్ బాబు పాదయాత్ర ప్రారంభించాక దుర్మార్గపు ప్రభుత్వం ఎన్నో ఇబ్బందులు పెట్టింది. జగన్ వేలకోట్లు తినేసినా పాదయాత్ర చేసేందుకు చంద్రబాబు అడ్డంకులు సృష్టించలేదు.పాదయాత్ర తర్వాత లోకేష్ వజ్రాయుధంలా తయారయ్యారు. రాష్ట్రంలో అరాచకపాలనను అంతమొందించడానికి టిడిపి-జనసేన ఉమ్మడి అభ్యర్థులను ప్రజలు గెలిపించాలి.